
జమ్మూ/న్యూఢిల్లీ: పాకిస్తాన్ రేంజర్లు భారత జవాన్లను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గురువారం రాత్రి జమ్మూలోని అరి్నయా సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత సైనిక పోస్టులపై కాల్పులు జరిపారని బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు.
తాము తగిన రీతిలో ప్రతిస్పందిస్తున్నామని, పాకిస్తాన్ రేంజర్లకు ధీటుగా సమాధానం చెబుతున్నామని వెల్లడించారు. పాకిస్తాన్ భూభాగం నుంచి రాత్రి 8 గంటలకు కాల్పులు ప్రారంభమయ్యాయని, ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 17న అరి్నయా సెక్టార్‌లో పాక్ రేంజర్ల కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ జవాను ఒకరు గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment