యాంగాన్: మయన్మార్‌లో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు సాధారణ పౌరులు మరణించడం పట్ల ఫేస్‌బుక్ యాజ మాన్యం విచారం వ్యక్తం చేసింది. మయన్మార్ మిలటరీ ప్రధాన పేజీని ఫేస్‌బుక్ నుంచి తొలగించినట్లు ప్రకటించింది. తాము పాటిస్తున్న ప్రమాణాల ప్రకారం హింసను రెచ్చగొట్టే అంశాలను కచ్చితంగా తొలగిస్తామని వెల్ల్లడించింది. మయన్మార్ సైన్యం తాత్‌మదా ట్రూ న్యూస్ ఇన్ఫర్మేషన్ టీమ్ పేరిట ఫేస్‌బుక్ పేజీని నిర్వహిస్తోంది. ఆ పేజీ ఇప్పుడు కనిపిం చడం లేదు. కాగా, పోలీసు దమనకాండను ఖండిస్తూ ఆదివారం దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఫిబ్రవరి 9న పోలీసుల కాల్పుల్లో గాయపడిన 19 ఏళ్ల మయా థ్వెట్ ఖీనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. ఆమె అంత్యక్రియలను ఆదివారం యాంగాన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా జనం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment