indian jawans
-
జమ్మూలో భారత సైనిక పోస్టులపై పాక్ రేంజర్ల కాల్పులు
జమ్మూ/న్యూఢిల్లీ: పాకిస్తాన్ రేంజర్లు భారత జవాన్లను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గురువారం రాత్రి జమ్మూలోని అరి్నయా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత సైనిక పోస్టులపై కాల్పులు జరిపారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. తాము తగిన రీతిలో ప్రతిస్పందిస్తున్నామని, పాకిస్తాన్ రేంజర్లకు ధీటుగా సమాధానం చెబుతున్నామని వెల్లడించారు. పాకిస్తాన్ భూభాగం నుంచి రాత్రి 8 గంటలకు కాల్పులు ప్రారంభమయ్యాయని, ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 17న అరి్నయా సెక్టార్లో పాక్ రేంజర్ల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను ఒకరు గాయపడ్డారు. -
బలిదానం వృథా కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: సైనికుల బలిదానాలు వృ«థా కాబోవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత్ శాంతికాముక దేశమే కానీ, రెచ్చగొడితే సరైన రీతిలో సమాధానమివ్వగలదని స్పష్టం చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా సైనికుల పాశవిక దాడిలో అమరులైన భారతీయ జవాన్లకు ప్రధాని ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా వారితో పాటు బుధవారం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అంతకుముందు చైనా ఘాతుకంపై స్పందిస్తూ.. దేశ సమగ్రత, సార్వభౌమత్వం విషయంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోదని తేల్చి చెప్పారు. ‘భారత్ ప్రాథమికంగా శాంతిని కోరుకునే దేశం. పొరుగుదేశాలతో స్నేహ, సహకార సంబంధాల దిశగానే కృషి చేశాం. పొరుగు దేశాల అభివృద్ధిని, సంక్షేమాన్ని కాంక్షించాం. మనమెవరినీ రెచ్చగొట్టం. అదే సమయంలో, ఎవరైనా రెచ్చగొడితే, సరైన రీతిలో సమాధానమిస్తాం. మన దేశ చరిత్రలో త్యాగంతో పాటు శౌర్యం, వీరత్వం కూడా సమపాళ్లలో కనిపిస్తాయి. దేశ సమగ్రత, సార్వభౌమత్వాల విషయంలో రాజీ లేని ధోరణి భారత్‌ది. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే క్రమంలో అవసరమైన ప్రతీసారి భారత్ తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటూనే ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. రక్షణ మంత్రి, హోం మంత్రి నివాళులు చైనా సరిహద్దుల్లో వీర మరణం చెందిన భారతీయ సైనికులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా ఘనంగా నివాళులర్పించారు. జవాన్లు అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని రాజ్‌నాథ్ కొనియాడారు. దేశం వారి త్యాగాన్ని మరచిపోదన్నారు. సైనికుల ప్రాణ త్యాగంపై బాధను వ్యక్తపరిచేందుకు తన వద్ద మాటలు లేవని అమిత్ షా ట్వీట్ చేశారు. వారికి దేశం రుణపడి ఉంటుందన్నారు. అంగుళం కూడా వదలం చైనా సైనికుల దాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని.. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లు వారని, పోరాటంలో శత్రువును అంతమొందిస్తూ వారు ప్రాణాలొదిలారని కొనియాడారు. ‘మన అమర జవాన్ల త్యాగాలు వృథా కావు. ఎలాంటి పరిస్థితుల్లోనయినా, దేశ ఆత్మగౌరవాన్ని నిలబెడతాం. ఒక అంగుళం భూభాగాన్ని కూడా వదలబోం’ అన్నారు. ‘సార్వభౌమత్వం మనకు సర్వోన్నతం. దాన్ని కాపాడుకోవడంలో మనల్నెవరూ ఆపలేరనే విషయంలో అణుమాత్రం కూడా సందేహం అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. -
జవాన్లపై అనుచిత ట్వీట్
న్యూఢిల్లీ: గాల్వాన్ లోయ హింసాత్మక ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లను, కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా ట్వీట్ చేసిన తమ టీమ్ డాక్టర్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం చర్య తీసుకుంది. అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. సీఎస్కే సహాయక సిబ్బంది బృందంలో వైద్యుడైన మధు తొట్టిప్పిల్లిల్ ట్విట్టర్లో అమరులైన జవాన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘సైనికుల శవపేటికలపై పీఎం కేర్స్ స్టిక్కర్ వేసి పంపిస్తారా? నాకు తెలుసుకోవాలని ఉంది’ అని మధు ట్వీట్ చేశాడు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఫ్రాంచైజీ యాజమాన్యం అతన్ని జట్టు నుంచి తప్పించింది. -
సరిహద్దుల్లో పాక్ పాశవికం
జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన నిజ స్వరూపాన్ని చాటుకుంది. పాక్ సైన్యానికి చెందిన బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ) పాశవిక చర్యకు పాల్పడింది. భారత సైన్యానికి సామగ్రిని సరఫరా చేసే ఇద్దరు పోర్టర్లను చంపి ఒకరి తలను నరికి తమ వెంట తీసుకెళ్లింది. గతంలో భారత జవాన్ల తలు నరికిన ఘటనలు ఉన్నప్పటికీ, ఇలా పౌరుని తలను మాయం చేయడం ఇదే మొదటిసారని సైన్యం పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి విధులు నిర్వహించే సైనికులకు నిత్యావసరాలను అందించే పోర్టర్లే లక్ష్యంగా పాక్ సైన్యం శుక్రవారం విచక్షణారహితంగా మోర్టార్లు ప్రయోగించింది. దీంతో గుల్పూర్ సెక్టార్‌లోని కస్సాలియాన్ గ్రామానికి చెందిన పోర్టర్లు మొహమ్మద్ అస్లాం, అల్తాఫ్ హుస్సేన్(23) చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో అస్లాం(28) శరీరాన్ని ఛిద్రం చేసిన బీఏటీ అతని తలను వెంట తీసుకెళ్లిందని సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇద్దరి మృతదేహాలను కుటుంబసభ్యులకు అందజేశామని, వారి అంత్యక్రియలు శుక్రవారం పూర్తయ్యాయని పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. గాయపడిన పోర్టర్లు సలీం, షౌకత్, అహ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. సైనికుడనే వాడెవడూ ఇలాంటి హేయమైన చర్యలకు దిగడనీ, వీటికి సరైన సమయంలో సైనికరీతిలో స్పందిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే పేర్కొన్నారు. సామాన్యులను పాక్ సైన్యం పొట్టనబెట్టుకోవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. కాగా, సరిహద్దుల వెంట చొరబాటు, ఉగ్ర చర్యలకు పాల్పడటమే లక్ష్యంగా ఏర్పాటైన బీఏటీలో పాక్ సైనికులతోపాటు ఉగ్రవాదులు కూడా సభ్యులుగా ఉంటారు. -
ఆకాశంలో ఆర్మీ సాహసం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇండియన్ ఆర్మీ ఆకాశంలో అద్భుతం సృష్టించనుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆకాశమార్గాన భారీ బెలూన్‌లో సాహస ప్రయాణం చేసి రికార్డు నెలకొల్పబోతోంది. అందులో భాగంగా మంగళవారం ఇక్కడికి చేరుకున్న బృందం తిరిగి బుధవారం బయలుదేరి వెళ్లింది. వివరాల్లోకి వెళితే..ఇండియన్ ఆర్మీ అధికారి మేజర్ అనిరుధ్ నేతృత్వంలో 60 మంది సైనికుల బృందం జమ్మూ–కశ్మీర్ నుంచి తమిళనాడు కన్యాకుమారి వరకు భారీ బెలూన్‌లో ఆకాశయానాన సాహస ప్రయాణాన్ని గత నెల 6వ తేదీన ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీ అనే అక్షరాలు రాసి ఉన్న రంగు రంగుల ఆకర్షణీయమైన ఈ బెలూన్‌లో నలుగురు మాత్రమే ప్రయాణించాల్సి ఉంది. ఈ కారణంగా నలుగురు సైనికులు బెలూన్‌లో ప్రయాణిస్తే మిగిలిన వారు రోడ్డు మార్గంలో వారిని అనుసరించారు. నిర్ణీత ప్రయాణం చేసిన తరువాత బెలూన్ నేలపైకి దిగినపుడు అందులోని సైనికులు కిందకు దిగుతుండగా..మరో నలుగురు అందులో ఎక్కేలా ఏర్పాట్లు చేసుకున్నారు. జమ్మూ–కశ్మీర్ నుంచి ఆగ్రా, భోపాల్, తిరుపతి మీదుగా చెన్నైకి చేరుకున్నారు. చెన్నై నుంచి కాంచీపురానికి సమీపంలోని కురువిమలైలోని విమాన కంట్రోలు కార్యాలయం మైదానంలో మంగళవారం సాయంత్రం దిగారు. ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి మైదానంలో దిగిన బెలూన్ చూసి పరిసరాల ప్రజలు ఆశ్చర్యంతో చుట్టూ చేరారు. సైనిక వీరులతో సెల్ఫీ దిగారు. ఇక్కడ కొన్ని గంటలపాటు విశ్రాంతి తీసుకుని తిరిగి బుధవారం బయలు దేరారు. చెన్నై, తిరుచ్చిరాపల్లి, మదురై, శివకాశి, తిరునెల్వేలి మీదుగా ఈనెల 29వ తేదీకి కన్యాకుమారి చేరుకుంటారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సాహస ప్రయాణంలో ఆకాశమార్గాన 3,236 కిలోమీటర్లు, రోడు మార్గంలో 3,901 కిలోమీటర్లు పయనించినట్లవుతుందని వారు తెలిపారు. -
పాక్ కాల్పుల్లో ఐదుగురి మృతి
సరిహద్దుల్లో పాక్ బరితెగింపు.. 22 మందికి గాయాలు! జమ్మూ: భారత స్వాతంత్య్ర దినోత్సవాన సైతం సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లోని 4 సెక్టార్లలో.. జనావాసాలపై భారీ కాల్పులు, మోర్టార్ బాంబులతో విరుచుకుపడింది. దాడిలో ఒక సర్పంచ్ సహా నలుగురు పౌరులు మృతిచెందగా మరో ఐదుగురు గాయపడ్డారని అధికారికంగా చెప్తున్నా.. 22 మంది గాయపడినట్లు సమాచారం. పాక్ సేనలు ప్రయోగించిన మోర్టారు బాంబు బసోనీలో ఓ కారుపై పడటంతో అందులోని ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు గాయాలపాలై చనిపోయారు. ఘటనాస్థలి వద్ద గుమిగూడిన స్థానికులపైనా పాక్ సేనలు తూటాల వర్షం కురిపించడంతో ఓ బాలుడు సహా ఐదుగురు గాయపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచి శనివారం ఉదయం 7:30 వరకు పాక్ రేంజర్లు 60 ఎంఎం, 82 ఎంఎం మోర్టార్ బాంబులతో సరిహద్దు ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి. పాక్ దళాల దాడిని భారత జవాన్లు దీటుగానే తిప్పికొట్టారు. కాగా, బిహార్‌లోని నవాడాలో ఓ స్కూళ్లో స్వాతంత్య్ర వేడుకలు జరుగుతుండగా కొందరు దుండగులు బాంబులు విసరడంతో ఇద్దరు బాలికలు గాయపడ్డారు. -
తీవ్రవాదుల కాల్పుల్లో జవాను మృతి
జమ్మూ: జమ్మూ కాశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద గురువారం తీవ్రవాదులకు, భద్రతా బలగాలకు భీకరమైన కాల్పులు జరిగాయి. తీవ్రవాదులు చొరబాట్లకు యత్నిస్తున్న సమయంలో వారిని జవాన్లు అడ్డుకున్నారు. ఈ కాల్పుల్లో ఒక జవాను మృతి చెందాడు. ముగ్గురు నుంచి నలుగురు తీవ్రవాదలు జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్ లోకి ప్రవేశిస్తుండగా అడ్డుకున్నామన్నాడు. ఆ క్రమంలోనే ఆర్మీ బంకర్ లోకి ప్రవేశించిన వారితో తమ జవాన్లు పోరాటం చేసారని, ఇందులో ఒక జవాన్ మృతి చెందాడన్నారు.