జమ్మూ: జమ్మూ కాశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద గురువారం తీవ్రవాదులకు, భద్రతా బలగాలకు భీకరమైన కాల్పులు జరిగాయి. తీవ్రవాదులు చొరబాట్లకు యత్నిస్తున్న సమయంలో వారిని జవాన్లు అడ్డుకున్నారు. ఈ కాల్పుల్లో ఒక జవాను మృతి చెందాడు.
ముగ్గురు నుంచి నలుగురు తీవ్రవాదలు జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్ లోకి ప్రవేశిస్తుండగా అడ్డుకున్నామన్నాడు. ఆ క్రమంలోనే ఆర్మీ బంకర్ లోకి ప్రవేశించిన వారితో తమ జవాన్లు పోరాటం చేసారని, ఇందులో ఒక జవాన్ మృతి చెందాడన్నారు.