
న్యూఢిల్లీ: గాల్వాన్ లోయ హింసాత్మక ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లను, కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా ట్వీట్ చేసిన తమ టీమ్ డాక్టర్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం చర్య తీసుకుంది. అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. సీఎస్‌కే సహాయక సిబ్బంది బృందంలో వైద్యుడైన మధు తొట్టిప్పిల్లిల్ ట్విట్టర్‌లో అమరులైన జవాన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘సైనికుల శవపేటికలపై పీఎం కేర్స్ స్టిక్కర్ వేసి పంపిస్తారా? నాకు తెలుసుకోవాలని ఉంది’ అని మధు ట్వీట్ చేశాడు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఫ్రాంచైజీ యాజమాన్యం అతన్ని జట్టు నుంచి తప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment