‘ఫిఫా’ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మహిళల జట్టు విజయం
బెంగళూరు: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) స్నేహపూర్వక మ్యాచ్‌లో మరోసారి భారత మహిళల జట్టు అదరగొట్టింది. తొలి పోరులో 14–0తో మాల్దీవులును చిత్తు చేసిన భారత్... గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో 11–1 గోల్స్ తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్ ద్వారానే జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన ఫార్వర్డ్ ప్లేయర్ లింగ్‌డైకిమ్ (12వ, 16వ, 56వ, 59వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో విజృంభించింది.
సిమ్రన్ గురుంగ్ (62వ, 68వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో సత్తా చాటింది. మరో అరంగేట్ర ప్లేయర్ సిబాని దేవి (45+1వ నిమిషంలో)తో పాటు కాజల్ డిసౌజా (15వ ని.లో), పూజ (41వ ని.లో), భూమిక దేవి (71వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
మాల్దీవుల తరఫున మరియం రిఫా (27వ ని.లో) ఏకైక గోల్ సాధించగా... ఆ జట్టు కెప్టెన్ హనీఫా (17వ నిమిషంలో) సెల్ఫ్ గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని మరింత పెంచింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 6–1తో ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు... ద్వితీయార్ధంలో కూడా అదే జోరు కొనసాగిస్తూ ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తిరుగులేని విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment