సార్వత్రిక ఎన్నికలు, దాని ఫలితం చుట్టూ ఉన్న అనిశ్చితి, ఖరీదైన వాల్యుయేషన్లు, ప్రాఫిట్ బుకింగ్ కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీల నుంచి భారీగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. మే నెల మొదటి 10 రోజుల్లో రూ. 17,000 కోట్లను ఉపసంహరించుకున్నారు.
మారిషస్‌తో భారత్ పన్ను ఒప్పందం సర్దుబాటు, యూఎస్ బాండ్ ఈల్డ్‌లలో నిరంతర పెరుగుదలపై ఆందోళనల కారణంగా ఏప్రిల్‌లో నమోదైన రూ. 8,700 కోట్ల నికర ఉపసంహరణ కంటే ఇది చాలా ఎక్కువ. అంతకు ముందు ఎఫ్‌పీఐలు మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. సాధారణ ఎన్నికల తర్వాత నాలుగో త్రైమాసికంలో దేశ కార్పొరేట్ ఆర్థిక పనితీరు బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు స్పష్టంగా వెలువడేంత వరకు ఎఫ్‌పీఐలు జాగ్రత్త వైఖరి అవలంబించవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎఫ్‌పీఐల ఈ దూకుడు అమ్మకాల వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు, దాని ఫలితాల చుట్టూ ఉన్న అనిశ్చితి కారణంగా, ఎన్నికల ఫలితాలకు ముందే మార్కెట్‌లోకి ప్రవేశించడంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉన్నారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ - రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment