ప్రతిష్టాత్మక 73వ మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల యువతి గెలుపొందారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ అందాల పోటీల్లో విశ్వ సుందరిగా డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ గెలుపొంది కిరీటాన్ని దక్కించుకున్నారు.
మెక్సికో వేదికగా జరిగిన ఈ పోటీలలో 125 దేశాలకు చెందిన యువతులు పోటీ పడ్డారు. అయితే, 21 ఏళ్ల 'విక్టోరియా కెజార్' విజేతగా నిలిచారు. మొదటి రన్నరప్‌గా నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా, రెండో రన్నరప్‌గా మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్‌ట్రాన్ నిలిచారు. ఈ అందాల పోటీలో టాప్ 5 ఫైనలిస్ట్‌లలో థాయిలాండ్‌కు చెందిన ఒపాల్ సుచతా చువాంగ్‌స్రీ, వెనిజులాకు చెందిన ఇలియానా మార్క్వెజ్ కూడా ఉన్నారు.
2023 మిస్ యూనివర్స్ విన్నర్ 'షెన్నిస్ పలాసియోస్' విజేతకు కిరీటాన్ని అందించారు. 'కొత్త శకం ప్రారంభమవుతుంది..! మా 73వ మిస్ యూనివర్స్ అయిన డెన్మార్క్ బ్యూటీకి అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు స్ఫూర్తి నింపేలా మీ ప్రయాణం ఉండాలని ఆశిస్తున్నాం.' అని మిస్ యూనివర్స్ టీమ్ తెలిపింది. ఈ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన రియా సింఘా టాప్ 5 వరకు కూడా చేరుకోలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment