'అడ్మైర్ స్టార్' మొబైల్ ధర తక్కువేనట!
'అడ్మైర్ స్టార్' మొబైల్ ధర తక్కువేనట!
Published Mon, Sep 12 2016 1:54 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
న్యూఢిల్లీ : దేశీయ మొబైల్ తయారీదారి జెన్ మొబైల్స్ సరసమైన ధరలో కొత్త స్మార్ట్ఫోన్ను సోమవారం లాంచ్ చేసింది. "అడ్మైర్ స్టార్" పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్ ధర రూ.3,290గా కంపెనీ నిర్ణయించింది. జెన్ మొబైల్స్ నుంచి వచ్చిన ఈ కొత్త ఎడిషన్ను ధరకు అనువైన రీతిలో ఫీచర్లను ఆఫర్ చేసినట్టు విశ్వసిస్తున్నామని కంపెనీ సీఈవో సంజయ్ కలిరోనా తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో ముందుగా సూచించిన ఐదు నెంబర్లకు యూజర్ల లొకేషన్ వివరాలను పంపించేందుకు వీలుగా ఎస్ఓఎస్ ఫీచర్ను అందుబాటులో ఉంచినట్టు కంపెనీ పేర్కొంది. జెన్ యాప్ క్లౌడ్, లైవ్ స్ట్రీమింగ్ అప్లికేషన్ నెక్స్జెన్టీవీ, వీడియో ప్లేయర్ ఉలివ్ వంటి వాటిని ఈ ఫోన్లో ప్రీలోడెడ్గా అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది.
జెన్ మొబైల్ అడ్మైర్ స్టార్ ఫీచర్లు..
4.5 అంగుళాల ఎఫ్డబ్ల్యూవీజీఏ డిస్ప్లే
1.3 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్
ఎస్ఓఎస్ ఫీచర్
512 ఎంబీ ర్యామ్
8 జీబీ ఇంటర్నెల్ మెమరీ
32 జీబీ విస్తరణ మెమెరీ
5 ఎంపీ రియర్ కెమెరా
1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా
2000ఎంఏహెచ్ బ్యాటరీ
Advertisement
Advertisement