Rs 3
-
తీపి కబురు చెప్పిన హెచ్‌సీఎల్ టెక్
ముంబై: ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు తీపి కబురును అందించింది. భారీ షేర్ల బై బ్యాక్ చేయనుంది. ఈ మేరకు సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. గరిష్టంగా రూ.3500 కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్ చేయనుంది. దేశంలో నాల్గవ అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ షేరు ధర. రూ.1000దగ్గర ఈ బై బ్యాక్ చేపట్టనున్నట్టు మార్కెట్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇన్వెస్టర్ల వ్యాల్యూ పెంచేందుకు గాను టీసీఎస్, కాగ్నిజెంట్బాటలో పయనించిన సంస్థ ఈ ఆఫర్ ను ప్రకటించింది. కాగా డిసెంబర్ 31 వరకు కంపెనీ వద్ద సుమారు1,88 5 మిలియన్ల డాలర్ల నిల్వలున్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లు మరో రూ.10,507 కోట్లున్నాయి. కంపెనీ 1.41 బిలియన్ ఈక్విటీ షేర్లు కలిగి ఉంది. గత 56 వరుస త్రైమాసికాల్లో డివిడెండ్లను చెల్లించింది. టీసిఎస్ తరహలో మెగా బై బ్యాక్ ఆఫర్ చేయకపోయినా బై బ్యాక్ మాత్రం తప్పనిసరి అని గతంలోనే సంస్థ ప్రకటించింది. మరోవైపు టాటా కన్సల్టెన్సీ ,కాగ్నిజెంట్ సంస్థలు షేర్ల బై బ్యాక్ ను ప్రకటించగా, మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వచ్చే నెల ప్రకటించే అవకాశం ఉంది. -
12 పీఎస్‌యూ బ్యాంకులకు నిధుల సమీకరణ అనుమతి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనాన్ని పటిష్టపర్చేదిశగా ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా నిధుల సమీకరణకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. 12 పీఎస్‌యూ బ్యాంకులు రూ. 3000 కోట్ల సమీకరణకు ఈ అనుమతి లభించింది. ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా రూ. 2,912 కోట్ల సమీకరణకు 12 ప్రభుత్వ బ్యాంకులు చేసిన ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఓకే చెప్పగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్విప్ విధానంలో రూ. 200 కోట్ల సేకరణకు కూడా అనుమతినిచ్చింది. 2016–17 ఆర్థిక సంవత్సరానికి 19 పీఎస్‌యూ బ్యాంకులకు బడ్జెట్లో ప్రతిపాదించిన రూ. 25,000 కోట్ల మూలధనంలో ఇప్పటికి 22,915 కోట్లను కేంద్ర ప్రభుత్వం అందచేసింది. మిగిలిన మొత్తాన్ని ఆయా బ్యాంకుల పనితీరు ఆధారంగా విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ ఆదివారం విడుదల చేసిన సంవత్సరాంతపు సమీక్షలో పేర్కొంది. -
అంచనాలను అధిగమించిన ఇన్ఫీ
ముంబై: అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఎనలిస్టులు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మార్కెట్ అంచనాలకు మించి ఆశ్చర్యకర ఫలితాలను వెల్లడించింది. 6.1 శాతం వృద్ధితో రూ. 3606 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని, 10 శాతం వృద్ధితో రూ.18,070 కోట్ల ఆదాయాన్ని సాధించింది. రూ. 17310 కోట్ల ఆదాయంపై ఈ నికర లాభాన్ని ఆర్జించింది. ఎబిటా రూ.4309 కోట్లుగా నమోదు చేసింది. 2,587 మిలియన్ డాలర్ల డాలర్ ఆదాయాన్ని ఆర్జించింది. ఒక్కో షేరుకు రూ. 11 మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు బోర్డ్ అంగీకరించినట్టు కూడా సంస్థ ప్రకటించింది. దీంతోపాటుగా కంపెనీ కరెన్సీ పరంగా 8-9 శాతం రెవెన్యూ గైడెన్స్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కంపెనీ నిర్వహణా లాభాలు 80 బేసిస్ పాయింట్లు వరుసగా పెరిగి 4.9 శాతం విస్తరించాయి. ఆర్థిక సంవత్సరం మొదటి అర్థ భాగం, సమీపంలో అనిశ్చిత వ్యాపార దృక్పథ తీరును గమనించిన తరువాత గైడెన్స్ ను తగ్గించేందుకు నిర్ణయించామని ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా వ్యాఖ్యానించారు. గత ఏడాది 10.5-12 శాతం ఆదాయ అంచనా కంటే ఇది తక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం గైడెన్స్ లో కోత పెట్టడం రెండవ సారి. మరోవైపు ఇన్ఫీ ఆర్థిక ఫలితాల అనంతరం ఒక్కసారిగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో మార్కెట్ ఆరంభంలో 3 శాతం వరకూ లాభపడిన ఇన్ఫోసిస్ కౌంటర్లో అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో ఒక దశలోసుమారు 5 శాతం పతనమైంది. బీఎస్ఈలో ఇన్ఫోసిస్ షేర్ 2.27 శాతం నష్టంతో రూ 1,028.20 వద్ద ట్రేడ్ అవుతోంది. -
స్పైస్‌జెట్ ఫెస్టివల్ ఆఫర్
న్యూఢిల్లీ: రాబోవు పండుగ సీజన్ నేపథ్యంలో విమానయాన సంస్థ తగ్గింపు ధరల వెల్లువ కురుస్తోంది. తాజాగా చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ సూపర్ ఫెస్టివల్ ఆఫర్ ప్రకటించింది. స్పెషల్ గ్రేట్ ఫెస్టివ్ సేల్ పేరుతో దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లలో తగ్గింపు ధరలను ప్రకటించింది. దేశీయ టికెట్లు, రూ. 888, అంతర్జాతీయ విమాన టికెట్లు రూ 3,699 ల ప్రారంభ (వన్ వే) ఛార్జీలలో అందిస్తోంది. బెంగళూరు-కొచ్చి, ఢిల్లీ-డెహ్రాడూన్, చెన్నై- బెంగళూరు లాంటి పాపులర్ రూట్లలో, అంతర్జాతీయంగా చెన్నై -కొలంబో రూట్లలో ఈ ధరలను అందిస్తోంది. అక్టోబర్4 నుంచి అక్టోబర్ 7 తేదీ అర్ధరాత్రి వరకు ఓపెన్ ఉంటుందనీ, ఇలా బుక్ చేసుకున్న ఈ టికెట్ల ద్వారా ఈ ఏడాది నవబంర్ 8 నుంచి వచ్చేఏడాది ఏప్రిల్13 మధ్య ఉపయోగించుకోవాల్సి ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫర్ కింద పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయని మొదట వచ్చినవారికి మొదట కేటాయింపు ఆధారంగా టికెట్లను కేటాయిస్తామని తెలిపింది. కాగా ఇదే తరహాలో మరో చవక ధరల విమానయానసంస్థ ఎయిర్ ఏషియా దేశీయ, అంతర్జాతీయ తగ్గింపు ధరలను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఉచిత ఇంటర్నెట్తో 4జీ స్మార్ట్‌ఫోన్ రూ.3వేలు
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ప్రభావం సృష్టించిన సంచలనం పలు ఆఫర్లకు ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. తాజాగా మొబైల్ మేకర్ డాటా విండ్ వివిధ వేరియంట్లలో ఎంట్రీలెవల్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతోపాటు ఈ మొబైల్స్ లో సంవత్సరం పాటు ఉచిత ఇంటర్ నెట్ ను కూడా అఫర్ చేస్తోంది. ఎంట్రీ లెవల్ రూ.3000 ధర లో 4 జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది డాటా విండ్ . వచ్చే నెల దీపావళికి ముందే వీటిని ప్రారంభించబోతోంది. 1జీబీ, 2జీబీ, 3జీబీ ర్యామ్, 8జీబీ, 16జీబీ , 32జీబీ ఇంటర్నెల్ మొమరీతో వీటిని అందుబాటులోకి తెస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. అలాగే మేటి స్మార్ట్ఫోన్లలో ఉండే దాదాపు అన్ని సుగుణాల మేళవింపుగా తమ స్మార్ట్ ఫోన్లు యూజర్లను అలరించనున్నాయని పేర్కొంది. మరోవైపు రూ.5 వేల ధర పలికే దేశీయ టాబ్లెట్ మార్కెట్ లో 76 శాతం వాటాను కలిగి ఉన్నట్టు కంపెనీ చెబుతోంది. కాగా అమృత్ సర్, హైదరాబాద్ లలో డాటా విండ్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్లో రూ.1500ల నుంచి డాటా విండ్ స్మార్ట్ఫోన్లు లభిస్తున్నాయి. ఇటీవలే మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టిన ఈ సంస్థ ఇప్పటికే రూ.2999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
'అడ్మైర్ స్టార్' మొబైల్ ధర తక్కువేనట!
న్యూఢిల్లీ : దేశీయ మొబైల్ తయారీదారి జెన్ మొబైల్స్ సరసమైన ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం లాంచ్ చేసింది. "అడ్మైర్ స్టార్" పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్ ధర రూ.3,290గా కంపెనీ నిర్ణయించింది. జెన్ మొబైల్స్ నుంచి వచ్చిన ఈ కొత్త ఎడిషన్‌ను ధరకు అనువైన రీతిలో ఫీచర్లను ఆఫర్ చేసినట్టు విశ్వసిస్తున్నామని కంపెనీ సీఈవో సంజయ్ కలిరోనా తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో ముందుగా సూచించిన ఐదు నెంబర్లకు యూజర్ల లొకేషన్ వివరాలను పంపించేందుకు వీలుగా ఎస్ఓఎస్ ఫీచర్‌ను అందుబాటులో ఉంచినట్టు కంపెనీ పేర్కొంది. జెన్ యాప్ క్లౌడ్, లైవ్ స్ట్రీమింగ్ అప్లికేషన్ నెక్స్జెన్టీవీ, వీడియో ప్లేయర్ ఉలివ్ వంటి వాటిని ఈ ఫోన్లో ప్రీలోడెడ్‌గా అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. జెన్ మొబైల్ అడ్మైర్ స్టార్ ఫీచర్లు.. 4.5 అంగుళాల ఎఫ్డబ్ల్యూవీజీఏ డిస్ప్లే 1.3 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్ ఎస్ఓఎస్ ఫీచర్ 512 ఎంబీ ర్యామ్ 8 జీబీ ఇంటర్నెల్ మెమరీ 32 జీబీ విస్తరణ మెమెరీ 5 ఎంపీ రియర్ కెమెరా 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా 2000ఎంఏహెచ్ బ్యాటరీ -
ఐటీ రైడ్స్‌లో భారీగా బ్లాక్‌మనీ!
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను శాఖ నిర్వహిస్తున్న రైడ్స్ లో భారీగా బ్లాక్‌మనీ బయటపడుతోంది. మొదటి నాలుగు నెలల కాలంలో రూ.3,300 కోట్ల ఆదాయాన్ని ఐటీశాఖ తవ్వి తీసినట్టు వెల్లడైంది. 2016-17 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై మధ్యకాలంలో కనీసం 145 రైడ్స్‌ను ఆదాయపు పన్ను శాఖ నిర్వహించింది. ఆ రైడ్స్‌లో రూ.245 కోట్లను లెక్కలో చూపని నగదుగా(బ్లాక్ మనీగా) గుర్తించి ఐటీ శాఖ సీజ్ చేసింది. అంతేకాక నగదు, జ్యువెలరీని తీసివేస్తే, మొత్తంగా లెక్కలో చూపని ఆదాయంగా రూ.3,375 కోట్లను గుర్తించింది. 2015లో మొదటి నాలుగునెలలో లెక్కలో చూపని ఆదాయం రూ.2,252 కోట్లగా ఉండేది. అదేవిధంగా రూ.85 కోట్ల జువెల్లరీని స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ శాఖ తెలిపింది. పన్ను ఎగవేతదారులకు వ్యతిరేకంగా ఈ దాడులను జరుపుతున్నట్టు ఐటీశాఖ వెల్లడించింది. నగదు సీజ్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నట్టు తెలిపింది. అధిక లావాదేవీలు జరుపుతూ టాక్స్ రిటర్న్‌లు ఫైల్ చేయని కనీసం 90 లక్షల లావాదేవీలపై కూడా ఐటీ శాఖ ఓ కన్ను వేసి ఉచ్చింది. ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ, బ్లాక్‌మనీ బయటకు రావడం లేదని ఐటీ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో దేశమంతటా టాక్స్ రైడ్స్ జరిపి, పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు సిద్ధమైనట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. -
ఇంకా చీప్ గా 4జీ స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఇప్పుడు 4జీ వార్ కొనసాగుతోంది. ఈ వార్ తో 4జీ స్మార్ట్ ఫోన్ ధర అమాంతం పడిపోతోంది. గతేడాది అతి చౌకైన 4జీ స్మార్ట్ ఫోన్ రూ.8,000 దొరికితే, ఈ ఏడాది అది రూ.3,650 కే అది లభ్యం అవుతోంది. ఈ ధరలు మరింత కిందకు జారనున్నాయి. 2016 చివరి నాటికి 4జీ స్మార్ట్ ఫోన్లు కేవలం రూ.2,700కే దొరకనున్నట్లు మార్కెట్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ స్పీడు కల్గిన డేటాలను వినియోగదారులకు అందించేందుకు అతిపెద్ద టెలికాం ఆపరేటర్లు పోటీ పడుతున్నాయి. తక్కువ ధరలకే 4జీ సేవలు అందించడంలో భారతి ఎయిర్ టెల్ మొదటిస్థానంలో ఉండగా, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ముఖేశ్ అంబానీ సంస్థ కూడా ఈ రకమైన సేవలను అందించేందుకే రిలయన్స్ జియో ఇన్ఫోకాంను ఆవిష్కరించింది. కేవలం రూ.3,999కే 4జీ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ చేస్తున్న మొదటి కంపెనీ చైనీస్ హ్యాండ్ సెట్ కంపెనీ పికామ్. డిస్కౌంట్స్ తో కలిపి ఈ ఫోన్ ను వినియోగదారుల ముందుకు తెచ్చింది. భారత్ లోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా అవతరించిన మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్ మరికొన్ని నెలల్లో 4జీ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. భారత్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 4జీ ఫోన్లన్నీ ఎక్కువగా 1800 మెగాహెడ్జ్‌పై ఎఫ్డీ ఎల్టీఈ, 2300 మెగాహెడ్జ్‌పై టీడీఎల్టీఈలను సపోర్టు చేస్తున్నాయి. వొడాపోన్ , ఐడియా కేవలం ఎఫ్ఎల్టీఈనే బ్యాండ్లను ఆఫర్ చేస్తున్నాయి. రెండు ప్రధాన కారణాలతో ఈ 4జీ స్మార్ట్ ఫోన్ల ధరలు అమాంతం పడిపోతున్నాయి. ఒకటి మార్కెట్లో డిమాండ్ ను ముందుగానే గుర్తించిన టెలికాం ఆపరేటర్ల మధ్య పోటీ వాతావరణం నెలకొనడం. రెండోంది 4జీ టెక్నాలజీని ఎక్కువగా అడాప్ట్ చేసుకోవడం. చైనా, తైవాన్, కొరియా, జపాన్ వంటి దేశాలు తక్కువ ధరలకే చిప్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. భారత 4జీ స్మార్ట్ ఫోన్ విభాగంలో శ్యామ్‌సంగ్ మొదటిస్థానంలో ఉండగా, లెనోవా, షియోమి, మైక్రోమ్యాక్స్, యాపిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 3జీ స్మార్ట్ ఫోన్ల ధరల విషయంలో మనం ఏమైతే గమనించామో, 4జీ స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా అంతకంటే త్వరగా పడిపోతాయని మైక్రోమాక్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుబజిత్ సేన్ చెప్పారు. -
'చల్ల'గా లాగించేస్తున్నారు
రూ.3,500 కోట్లకు దేశీ ఐస్‌క్రీమ్ మార్కెట్ సగటు వినియోగం 400 ఎంఎల్ మూడో స్థానంలో హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా వినియోగం: 1520 కోట్ల లీటర్లు భారత్‌లో బ్రాండెడ్ కంపెనీల అమ్ముతున్నది: 19 కోట్ల లీటర్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ఐస్‌క్రీమ్ అమ్మకాలు దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సగటు తలసరి వార్షిక వినియోగం 2012లో 300 మిల్లీ లీటర్లుంటే, ఇప్పుడు ఏకంగా 400 ఎంఎల్‌కు చేరుకుంది. అమ్మకాల విషయంలో ఉత్తరాది రాష్ట్రాలు కేవలం వేసవిపైనే ఆధారపడితే.. దక్షిణాదితోపాటు పశ్చిమ రాష్ట్రాల వాసులు ఏడాది పొడవునా ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తున్నారు. రూ.3,500 కోట్ల విపణిలో అంతర్జాతీయ బ్రాండ్లకు దీటుగా దేశీయ కంపెనీలు కొత్త రుచులతో పోటీ పడుతున్నాయి. వెరశి కస్టమర్లు నోరూరించే విభిన్న రుచులను ఎంజాయ్ చేస్తున్నారు. ధరలు పెరుగుతున్నా ఏటా వినియోగం అధికమవడాన్నిబట్టి చూస్తే భారతీయ కస్టమర్ ధర ఎంతైనా వెచ్చిస్తారని దిగ్గజ బ్రాండ్ అమూల్ అంటోంది. చల్లని అవకాశాలు.. దేశంలో ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలో 2012లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఉత్పత్తుల్లో ఐస్‌క్రీమ్ కూడా ఒకటి. ఇంకేముంది విదేశీ బ్రాండ్ల రాకతోపాటు దేశీయ కంపెనీలు విస్తరణపై దృష్టి పెట్టాయి. జాతీయ స్థాయి బ్రాండ్‌గా నిలిచేందుకు మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగ ళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా మార్కెట్లలో దేశీయ కంపెనీలు పాగా వేస్తున్నాయి. రాష్ట్రాల వారీగా స్థానిక బ్రాండ్లు కోకొల్లలుగా విస్తరిస్తున్నాయి. ఇక వినియోగంలో ఢిల్లీ, ముంబైల తర్వాతి స్థానం హైదరాబాద్‌దే. మొత్తంగా పశ్చిమ రాష్ట్రాలు 35 శాతం, ఉత్తరాది 30, దక్షిణాది 20, తూర్పు, మధ్య భారత్ 15 శాతం వాటాకు పరిమితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 15.2 బిలియన్ లీటర్ల ఐస్‌క్రీమ్ ఆరగించేస్తున్నారు. ఇందులో ఆసియా పసిఫిక్ దేశాలు 34 శాతం వాటా దక్కించుకున్నాయి. ప్రపంచ సరాసరి 2.3 లీటర్లుంది. అమెరికా వాసుల సగటు వినియోగం 24 లీటర్లు, ఆస్ట్రేలియాలో 18 లీటర్లు ఉంటే, భారత్‌లో 400 మిల్లీలీటర్లు మాత్రమే. ప్రీమియం అయినా..: ముడి పదార్థాల ధరలకుతోడు, వినియోగదార్లలో ఖర్చు చేయతగ్గ ఆదాయాలు పెరుగుతుండడంతో అధిక మార్జిన్ ఉన్న ప్రీమియం ఐస్‌క్రీమ్‌ల విభాగంపైనా కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. అమూల్-ఎపిక్, మదర్ డెయిరీ-బెల్జియుమ్, క్వాలిటీ వాల్స్-మాగ్నమ్ బ్రాండ్లు ప్రీమియం విభాగంలో ఇటీవలే కొత్తగా వచ్చి చేరాయి. సూపర్ ప్రీమియం బ్రాండ్‌ను క్రీమ్ బెల్ కంపెనీ ఈ ఏప్రిల్‌లో విడుదల చేస్తోంది. భారత్‌లో ప్రీమియం ఐస్‌క్రీమ్‌కు డిమాండ్ ఉందని అమూల్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ ఆర్.ఎస్.సోధి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రపంచంలో తొలిసారిగా కోన్స్‌లో షుగర్ ఫ్రీ, అలాగే ఫ్లావ్యో ఫ్రోజెన్ యోగర్ట్ వేరియంట్లను అమూల్ పరిచయం చేసిందని ఆయన చెప్పారు. బెల్జియుమ్ తయారీకి మదర్ డెయిరీ బెల్జియం నుంచి మిల్క్ చాకొలేట్, ఫ్రాన్స్-వెనిల్లా ఫ్లేవర్, కాలిఫోర్నియా-బాదం, స్విట్జర్లాండ్ నుంచి బెటా కెరోటీన్ను తెప్పిస్తోంది. బెల్జియూమ్ 80 ఎంఎల్ ఐస్‌క్రీమ్ ధర రూ.80 ఉంది. బ్రాండెడ్ కంపెనీలదే.. భారత్‌లో ఐస్‌క్రీమ్ వ్యాపారంలో వ్యవస్థీకృత రంగ కంపెనీలదే హవా నడుస్తోంది. మొత్తం పరిశ్రమ రూ.3,500 కోట్లుంటే, ఇందులో రూ.2,200 కోట్ల వాటాను బ్రాండెడ్ కంపెనీలు కైవసం చేసుకున్నాయి. అమూల్ వాటా ఏకంగా 42 శాతముంది. వ్యవస్థీకృత రంగంలో ప్రస్తుతం ఏడాది పొడవున దేశంలో 19 కోట్ల లీటర్ల ఐస్‌క్రీమ్ అమ్ముడవుతోంది. పరిశ్రమ 2015లో 15 శాతం వృద్ధి ఆశిస్తోంది. దేశంలో అమూల్, మదర్ డైరీ, క్రీమ్ బెల్, వాదిలాల్, దిన్షాస్తోపాటు హాగెన్ డాజ్స్, బాస్కిన్ రాబిన్స్, లండన్ డెయిరీ, న్యూజిలాండ్ నేచురల్స్, హాకీ పాకీ, మినీ మెల్ట్స్, స్వెన్సెన్స్ వంటి విదేశీ బ్రాండ్లు దూసుకెళ్తున్నాయి. భారత్‌లో తలసరి వినియోగం తక్కువ. అందుకే కంపెనీలు భిన్నంగా ఆలోచిస్తేనే మార్కెట్ వృద్ధికి ఆస్కారం ఉంటుందని మదర్ డెయిరీకి చెందిన డెయిరీ విభాగం బిజినెస్ హెడ్ సుభాషిశ్ బసు తెలిపారు. భారత్‌లో వినియోగం పశ్చిమ రాష్ట్రాలు 35 శాతం ఉత్తరాది 30 శాతం దక్షిణాది 20 శాతం తూర్పు, మధ్య భారత్ 15 శాతం టాప్ సిటీస్: ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ భారత్‌లో ఐస్‌క్రీమ్ మార్కెట్ రూ. 3,500 కోట్లు వ్యవస్థీకృత రంగం వాటా రూ. 2,200 కోట్లు -
విడాకుల కేసులో భార్యకు రూ.3,290 కోట్ల భరణం!
లండన్: విడాకుల కేసులో భార్యకు భర్త భారీగా భరణం చెల్లించాల్సిన ఘటన బ్రిటన్ లో చోటు చేసుకుంది. భార్యతో విడాకులు పొందేందుకు ఆమెకు 530 మిలియన్ల డాలర్లు(రూ.3,290 కోట్లు) చెల్లించాలని లండన్ వ్యాపారవేత్తకు బ్రిటన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అమెరికా సంతతికి చెందిన జామీ కూపర్ హోన్ (49), హెడ్జ్ ఫండ్ మేనేజర్ క్రిస్ హోన్(48)లు భార్య భర్తలు. అయితే వీరు 15 సంవత్సరాలు కాపురం చేసిన అనంతరం వీడిపోవడానికి నిర్ణయించుకున్నారు. వీరిద్దరి ఆస్తి విలువ దాదాపు 700 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఆస్తిలో పావువంతు ఇస్తానని భర్త ఆమెకు ఆఫర్ చేశాడు. అయితే ఆస్తి ఇద్దరు మూలంగా ఆదాయం పెరిగిందని ఆమె తన భర్తతో వాదించింది. దీనిపై ఇద్దరు కోర్టును ఆశ్రయించారు. తన భార్యకు 2006 నుంచి 2011 వరకు ఒక బిలియన్(రూ.100 కోట్లు) చెల్లించానని కోర్టుకు తెలిపాడు. వారివురు వాదనలువిన్న కోర్టు 530 డాలర్లు భార్యకు చెల్లించాలని తెలిపింది. ఇప్పటి వరకూ జరిగిన చెల్లింపుల్లో ఇది అత్యంత ఖరీదైన భరణంగా న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.