స్పైస్జెట్ ఫెస్టివల్ ఆఫర్ | SpiceJet's Great Festival Sale begins today; get domestic tickets at Rs 888, international at Rs 3,699 | Sakshi
Sakshi News home page

స్పైస్జెట్ ఫెస్టివల్ ఆఫర్

Published Tue, Oct 4 2016 12:23 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

స్పైస్జెట్  ఫెస్టివల్ ఆఫర్

స్పైస్జెట్ ఫెస్టివల్ ఆఫర్

న్యూఢిల్లీ: రాబోవు పండుగ  సీజన్ నేపథ్యంలో విమానయాన సంస్థ   తగ్గింపు ధరల వెల్లువ కురుస్తోంది. తాజాగా చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ సూపర్ ఫెస్టివల్ ఆఫర్ ప్రకటించింది.  స్పెషల్ గ్రేట్ ఫెస్టివ్ సేల్ పేరుతో దేశీయ, అంతర్జాతీయ  విమాన టికెట్లలో తగ్గింపు ధరలను ప్రకటించింది.  దేశీయ టికెట్లు, రూ.  888,  అంతర్జాతీయ విమాన టికెట్లు రూ 3,699  ల ప్రారంభ (వన్ వే)  ఛార్జీలలో అందిస్తోంది. బెంగళూరు-కొచ్చి,  ఢిల్లీ-డెహ్రాడూన్, చెన్నై- బెంగళూరు లాంటి పాపులర్ రూట్లలో, అంతర్జాతీయంగా చెన్నై -కొలంబో రూట్లలో  ఈ ధరలను అందిస్తోంది.  

అక్టోబర్4 నుంచి అక్టోబర్ 7 తేదీ అర్ధరాత్రి వరకు ఓపెన్ ఉంటుందనీ, ఇలా బుక్  చేసుకున్న ఈ టికెట్ల ద్వారా ఈ ఏడాది నవబంర్ 8 నుంచి వచ్చేఏడాది ఏప్రిల్13 మధ్య ఉపయోగించుకోవాల్సి ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫర్ కింద పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయని మొదట వచ్చినవారికి మొదట కేటాయింపు ఆధారంగా టికెట్లను కేటాయిస్తామని తెలిపింది.  కాగా ఇదే తరహాలో  మరో  చవక ధరల విమానయానసంస్థ ఎయిర్ ఏషియా దేశీయ, అంతర్జాతీయ తగ్గింపు ధరలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement