లండన్: విడాకుల కేసులో భార్యకు భర్త భారీగా భరణం చెల్లించాల్సిన ఘటన బ్రిటన్ లో చోటు చేసుకుంది. భార్యతో విడాకులు పొందేందుకు ఆమెకు 530 మిలియన్ల డాలర్లు(రూ.3,290 కోట్లు) చెల్లించాలని లండన్ వ్యాపారవేత్తకు బ్రిటన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అమెరికా సంతతికి చెందిన జామీ కూపర్ హోన్ (49), హెడ్జ్ ఫండ్ మేనేజర్ క్రిస్ హోన్(48)లు భార్య భర్తలు.
అయితే వీరు 15 సంవత్సరాలు కాపురం చేసిన అనంతరం వీడిపోవడానికి నిర్ణయించుకున్నారు. వీరిద్దరి ఆస్తి విలువ దాదాపు 700 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఆస్తిలో పావువంతు ఇస్తానని భర్త ఆమెకు ఆఫర్ చేశాడు. అయితే ఆస్తి ఇద్దరు మూలంగా ఆదాయం పెరిగిందని ఆమె తన భర్తతో వాదించింది. దీనిపై ఇద్దరు కోర్టును ఆశ్రయించారు. తన భార్యకు 2006 నుంచి 2011 వరకు ఒక బిలియన్(రూ.100 కోట్లు) చెల్లించానని కోర్టుకు తెలిపాడు. వారివురు వాదనలువిన్న కోర్టు 530 డాలర్లు భార్యకు చెల్లించాలని తెలిపింది. ఇప్పటి వరకూ జరిగిన చెల్లింపుల్లో ఇది అత్యంత ఖరీదైన భరణంగా న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.