తీపి కబురు చెప్పిన హెచ్‌సీఎల్ టెక్
ముంబై: ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు తీపి కబురును అందించింది. భారీ షేర్ల బై బ్యాక్ చేయనుంది. ఈ మేరకు సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. గరిష్టంగా రూ.3500 కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్ చేయనుంది. దేశంలో నాల్గవ అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ షేరు ధర. రూ.1000దగ్గర ఈ బై బ్యాక్ చేపట్టనున్నట్టు మార్కెట్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇన్వెస్టర్ల వ్యాల్యూ పెంచేందుకు గాను టీసీఎస్, కాగ్నిజెంట్‌బాటలో పయనించిన సంస్థ ఈ ఆఫర్ ను ప్రకటించింది.
కాగా డిసెంబర్ 31 వరకు కంపెనీ వద్ద సుమారు1,88 5 మిలియన్ల డాలర్ల నిల్వలున్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లు మరో రూ.10,507 కోట్లున్నాయి. కంపెనీ 1.41 బిలియన్ ఈక్విటీ షేర్లు కలిగి ఉంది. గత 56 వరుస త్రైమాసికాల్లో డివిడెండ్లను చెల్లించింది. టీసిఎస్ తరహలో మెగా బై బ్యాక్ ఆఫర్ చేయకపోయినా బై బ్యాక్ మాత్రం తప్పనిసరి అని గతంలోనే సంస్థ ప్రకటించింది. మరోవైపు టాటా కన్సల్టెన్సీ ,కాగ్నిజెంట్ సంస్థలు షేర్ల బై బ్యాక్ ను ప్రకటించగా, మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వచ్చే నెల ప్రకటించే అవకాశం ఉంది.