ఉచిత ఇంటర్నెట్తో 4జీ స్మార్ట్‌ఫోన్‌ రూ.3వేలు | Reliance Jio effect: Soon you will get 4G mobile for Rs 3,000 with free internet browsing for a year | Sakshi
Sakshi News home page

ఉచిత ఇంటర్నెట్తో 4జీ స్మార్ట్‌ఫోన్‌ రూ.3వేలు

Published Fri, Sep 23 2016 3:36 PM | Last Updated on Thu, Dec 27 2018 4:17 PM

ఉచిత ఇంటర్నెట్తో 4జీ స్మార్ట్‌ఫోన్‌ రూ.3వేలు - Sakshi

ఉచిత ఇంటర్నెట్తో 4జీ స్మార్ట్‌ఫోన్‌ రూ.3వేలు

 న్యూఢిల్లీ: రిలయన్స్ జియో  ప్రభావం సృష్టించిన  సంచలనం పలు  ఆఫర్లకు ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. తాజాగా మొబైల్ మేకర్  డాటా విండ్  వివిధ   వేరియంట్లలో ఎంట్రీలెవల్ స్మార్ట్ ఫోన్లను  మార్కెట్లో విడుదల చేసేందుకు  సిద్ధమవుతోంది.  దీంతోపాటు ఈ మొబైల్స్  లో సంవత్సరం పాటు ఉచిత ఇంటర్ నెట్  ను కూడా అఫర్ చేస్తోంది. ఎంట్రీ లెవల్ రూ.3000 ధర లో 4 జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది డాటా విండ్ . వచ్చే నెల దీపావళికి ముందే వీటిని ప్రారంభించబోతోంది.  1జీబీ, 2జీబీ, 3జీబీ  ర్యామ్, 8జీబీ,  16జీబీ ,  32జీబీ ఇంటర్నెల్ మొమరీతో వీటిని అందుబాటులోకి తెస్తున్నట్టు  కంపెనీ వెల్లడించింది.   అలాగే మేటి స్మార్ట్‌ఫోన్లలో ఉండే దాదాపు అన్ని సుగుణాల మేళవింపుగా తమ స్మార్ట్ ఫోన్లు యూజర్లను అలరించనున్నాయని  పేర్కొంది.    

మరోవైపు రూ.5 వేల ధర పలికే  దేశీయ టాబ్లెట్ మార్కెట్ లో 76 శాతం వాటాను కలిగి ఉన్నట్టు కంపెనీ చెబుతోంది.  కాగా అమృత్ సర్, హైదరాబాద్  లలో డాటా విండ్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి  ప్రస్తుతం మార్కెట్లో రూ.1500ల నుంచి డాటా విండ్ స్మార్ట్‌ఫోన్లు లభిస్తున్నాయి. ఇటీవలే మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టిన ఈ సంస్థ ఇప్పటికే రూ.2999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement