న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్స్ ద్వారా పబ్లిక్ వైఫైలో ఒక్కసారి లాగిన్ అయితే చాలు దేశంలో ఎక్కడికెళ్లినా పదే పదే వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇంటర్నెట్ వినియోగించుకునే సదుపాయం ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం పబ్లిక్ వైఫై ఇంటర్‌ఆపరబిలిటీకి అనుమతించాలని భావిస్తోంది. ‘పబ్లిక్ వైఫై ఇంటర్‌ఆపరబిలిటీ అంశం పరిశీలనలో ఉంది. దీన్ని అమల్లోకి తెస్తే దేశవ్యాప్తంగా పబ్లిక్ వైఫై శ్రేణి సమీపంలోకి వస్తే చాలు ఇంటర్నెట్‌కు కనెక్ట్ కావొచ్చు’ అని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment