public wifi
-
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో త్వరలోనే పబ్లిక్ డేటా సెంటర్లు ప్రారంభం కానున్నాయని కేంద్ర ఐటీ, న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. వీటికి ఎటువంటి లైసెన్స్, ఫీజు, రిజిస్ట్రేషన్ అవసరం లేదని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పబ్లిక్ డేటా సెంటర్ల ద్వారా వైఫై సేవలు అందించేందుకు వీలుగా రూపొందించిన పీఎండబ్ల్యూఏఎన్‌ఐ(పీఎం- వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్)కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి మీడియాకు వెల్లడించారు. ‘‘పీఎండబ్ల్యూఏఎన్‌ఐని ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. దేశంలో పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌ల వృద్ధిని ఇది ప్రోత్సహిస్తుంది. కొచ్చి- లక్షద్వీప్ మధ్య సబ్‌మెరైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ ఏర్పాటు ప్రొవిజన్‌కు ఆమోదం తెలిపింది’’ అని రవిశంకర్ పేర్కొన్నారు. అదే విధంగా ఈశాన్య ప్రాంతానికి సమగ్ర టెలికాం అభివృద్ధి ప్రణాళిక ప్రకారం అరుణాచల్ ప్రదేశ్, అసోంలోని రెండు జిల్లాల్లో మొబైల్ కవరేజ్ అందించడానికి యుఎస్ఓఎఫ్ పథకాన్ని కేంద్ర మంత్రి మండలి ఆమోదించినట్లు తెలిపారు. అంతేగాక ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 1584 కోట్లు, 2020-2023 కాలానికి గానూ రూ. 22.810 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. దీని ద్వారా సుమారు 58.5 లక్షల మందికి లబ్ది చేకూరనుంది.(చదవండి: రైతులతో చర్చలు: కేంద్రం ప్రతిపాదనలు) -
ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్స్ ద్వారా పబ్లిక్ వైఫైలో ఒక్కసారి లాగిన్ అయితే చాలు దేశంలో ఎక్కడికెళ్లినా పదే పదే వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇంటర్నెట్ వినియోగించుకునే సదుపాయం ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం పబ్లిక్ వైఫై ఇంటర్‌ఆపరబిలిటీకి అనుమతించాలని భావిస్తోంది. ‘పబ్లిక్ వైఫై ఇంటర్ఆపరబిలిటీ అంశం పరిశీలనలో ఉంది. దీన్ని అమల్లోకి తెస్తే దేశవ్యాప్తంగా పబ్లిక్ వైఫై శ్రేణి సమీపంలోకి వస్తే చాలు ఇంటర్నెట్కు కనెక్ట్ కావొచ్చు’ అని అధికార వర్గాలు తెలిపాయి. -
ఫ్రీ వైఫై.. జాగ్రత్త సుమా!
వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరే అవకాశం ఎయిర్పోర్ట్.. రైల్వేస్టేషన్.. బస్టాండ్.. లాడ్జింగ్.. ఇలా ఎక్కడికెళ్లినా వెంటనే ఫ్రీ వైఫై కోసం వెతుకుతాం. వారు అడిగిన వివరాలు ఇచ్చి వెంటనే లాగిన్ అవుతాం. అయితే ఇలాంటి పబ్లిక్ వైఫైలతో చాలా సమస్యలు ఉన్నాయి. మీ వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరిపోయే ప్రమాదముంది. అయినా సరే.. ఉచితంగా వస్తే చాలు.. ఇలాంటి రిస్క్‌ను భరించేందుకు సిద్ధమే అనే వినియోగదారులు ఎక్కువేనట. చిత్రమైన విషయం ఏమిటంటే.. వీరిలో చాలామందికి ఇప్పటికీ సైబర్ సెక్యూరిటీ గురించి.. దాంతో వచ్చే సమస్యల గురించి తెలియకపోవడం. సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్ ఇటీవల పబ్లిక్ వైఫై వాడకం తీరుతెన్నులపై 15 దేశాల్లో విస్తృత సర్వే చేపట్టింది. పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చిన ఈ సర్వే వివరాలు.. జాగ్రత్త పడండి పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించేటప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు పడరాని వారి చేతుల్లో పడితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని నార్టన్ సర్వే హెచ్చరిస్తోంది. సైమాంటిక్ అభివృద్ధి చేసిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ‘నార్టన్ వైఫై ప్రైవసీ’వంటివి వాడకం ద్వారా సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. ఆన్లైన్ సెక్యూరిటీ కోసం వెబ్సైట్ల యూఆర్ఎల్లలో హెచ్‌టీటీపీఎస్ ప్రొటోకాల్ ఉందో.. లేదో.. చూసుకోవాలి. అయితే నెట్వర్క్ సురక్షితంగా లేకపోతే హెచ్‌టీటీపీఎస్ ఉన్నా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. వైఫై నెట్వర్క్ ఆటోమేటిక్‌గా కనెక్టయ్యే ఆప్షన్స్ ఉంటే వాటిని వాడకపోవడమే మేలు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు ఎడిట్ చేసేందుకూ అనుమతించే వారు 19% పబ్లిక్ వైఫై ద్వారా బ్యాంక్ అకౌంట్లు చూసుకోవడం, ఫొటోలు షేర్ చేసుకునే వారు 96% పబ్లిక్ వైఫై వాడినా తమ వివరాలకు వచ్చిన నష్టమేమీ లేదనుకునే భారతీయులు 74% కొత్త చోటికి వెళితే వైఫైలోకి ప్రవేశించేందుకు నిమిషమూ నిలవలేని వారు 51% వ్యక్తిగత ఈమెయిల్, కాంటాక్ట్స్ వివరాలు ఇచ్చేం దుకు సిద్ధంగా ఉన్న వారు 19% వైఫైతో పోలిస్తే సురక్షితమైన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(వీపీఎన్)ను వాడే వారు 48% పబ్లిక్ వైఫైతో అసభ్య చిత్రాలు, వీడియోలు చూసే వారు 31% -
హైదరాబాద్‌లో ఎయిర్టెల్ పబ్లిక్ వైఫై
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ కంపెనీ ఎయిర్టెల్, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పబ్లిక్ వైఫై సౌకర్యాన్ని హైదరాబాద్ హైటెక్‌సిటీ ప్రాంతంలో ప్రారంభించింది. ప్రస్తుతం ఎనిమిది కిలోమీటర్ల మేర 17 స్థానాల్లో ఈ సేవలు అందుబాటులోకి వ చ్చాయి. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ పీసీ, ల్యాప్‌టాప్ ఇలా ఉపకరణం ఏదైనా ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. ఇతర ఆపరేటర్లకు చెందిన కస్టమర్లు సైతం వైఫై పొందవచ్చని భారతీ ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ సీఈవో వెంకటేష్ విజయ్‌రాఘవన్ తెలిపారు. 3 నెలల పైలట్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం ప్రతి వినియోగదారుకు రోజుకు 750 ఎంబీ వరకు డేటా ఉచితమని చెప్పారు. నెట్ వేగం 42 ఎంబీపీఎస్ వరకు ఉంటుందన్నారు. వినియోగదారులు తమ ఉపకరణంలో వైఫైని ఆన్ చేసి పబ్లిక్ వైఫైని ఎంచుకోవాలి. వెంటనే వన్ టైమ్ పాస్వర్డ్ మొబైల్‌కు వస్తుంది. దీన్ని టైప్ చేస్తే నెట్ సౌకర్యం పొందొచ్చు. నగరం మొత్తం..: ఎయిర్టెల్ దశలవారీగా భాగ్యనగరి మొత్తం వైఫై సౌకర్యాన్ని కల్పించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్లో 14,000 కిలోమీటర్ల మేర ఎయిర్టెల్ ఫైబర్ విస్తరించింది. ఇందులో హైదరాబాద్ వాటా 2,200 కిలోమీటర్లు. 3 నెలల తర్వాత వైఫై ఫ్రీగా ఇవ్వాలా, లేదా స్వల్పంగా చార్జీ చేయాలా అన్నది నిర్ణయిస్తామని కంపెనీ చెబుతున్నప్పటికీ.. ఉచితంగా ఇవ్వడం వల్ల కంపెనీపై పెద్ద ఎత్తున భారం పెరుగుతుంది. చార్జీ చేయడం ఖాయమని ఎయిర్టెల్ అధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్‌లో పబ్లిక్ వైఫైని ఏర్పాటు చేయడం ఎయిర్‌టెల్‌కు ఇదే తొలిసారి. 17 స్థానాల్లో సగటున 40 వేల మంది వైఫై వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. రాజధాని అంతటా వైఫై: కేటీఆర్ నాలుగైదు నెలల్లో భాగ్యనగరి మొత్తం వైఫై హైదరాబాద్‌గా (హైఫై) మారిపోనుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. హైటెక్ సిటీ వద్ద ఎయిర్టెల్ పబ్లిక్ వైఫై ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో 700 చదరపు కిలోమీటర్ల మేర వైఫై సౌకర్యం అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. అంగుళం స్థలం కూడా వదలమని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. త్వరలో టెండర్లు..: వైఫై సేవలు అందించేందుకు ఎయిర్‌సెల్, రిలయన్స్ జియో తదితర టెలికం కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి. త్వరలో టెండర్లు పిలుస్తున్నాం. భాగ్యనగరానికి ఎవరు వచ్చినా వైఫై వంటి సౌకర్యాలుంటే సానుకూలంగా స్పందిస్తారు. ఇ-కామర్స్ రంగం దూసుకెళ్తోంది. డిజిటల్ అనుసంధానం పెద్ద ఎత్తున చేపడతాం. తద్వారా ఉత్తమ ఉత్పత్తులు, సేవలు పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. స్మార్ట్‌ఫోన్ నుంచే ‘మీ సేవ’ సర్వీసులు కొన్ని అయినా ప్రజలకు అందాలన్నది మా ధ్యేయం. స్మార్ట్‌ఫోన్ నుంచి ఏవైనా ధ్రువీకరణ పత్రాలు కోరితే.. ఆ పత్రాలు ఇంటికి రావాలన్నది మా ఆలోచన. మ్యాన్‌హోల్ తెరిచివుంటే దాన్ని ఫొటో తీసి జీహెచ్ఎంసీ పంపిస్తే అధికారులు స్పందించేలా టెక్నాలజీని వినియోగించనున్నాం. త్వరలో వొడాఫోన్ వైఫై..: టెలికం కంపెనీ వొడాఫోన్ సైతం పబ్లిక్ వైఫై సేవలను అందించనుంది. కొద్ది రోజుల్లో ప్రణాళిక కార్యరూపం దాల్చనుందని వొడాఫోన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆపరేషన్స్ బిజినెస్ హెడ్ మన్దీప్ సింగ్ భాటియా తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నట్టు ఆయన చెప్పారు.