Datawind
-
డేటావిండ్ ఉద్యోగుల తొలగింపు: ఆందోళన
హైదరాబాద్: తక్కువ ధరల టాబ్లెట్ తయారీ సంస్థ డాటా విండ్ ఉద్యోగులపై వేటు వేసింది. ముఖ్యంగా అమ్మకాలు భారీగా పడిపోవడంతో డజన్లకొద్దీ ఉద్యోగులను తొలగించిందని ఉద్యోగులు ఆందోళకు దిగారు. ఉత్పత్తిలో 50శాతం కోత పెట్టిందని ఆరోపిస్తూ దాదాపు 200 మంది కార్మికులు లేబర్ కమిషన్‌ను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ పిటిషన్ ఇచ్చారని తెలంగాణా జాయింట్ కమిషనర్(లేబర్) చంద్ర శేఖరం పీటీఐకి చెప్పారు. తాము ఉద్యోగుల నుంచి పిటిషన్‌ను స్వీకరించామని సంస్థ వెర్షన్ వినడానికి త్వరలోనే వారిని పిలవనున్నామని చంద్రశేఖరం తెలిపారు. ఎంత మంది కార్మికులు అనేది స్పష్టతలేనప్పటికీ, అయితే వీరి సంఖ్య 200 కన్నా ఎక్కువ ఉంటుందని ఆయన అన్నారు అయితే ఈ వ్యవహారంపై కంపెనీని సంప్రదించినపుడు సంస్థ భిన్నంగా స్పందించింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు తమ ఆఫీసును ధ్వంసం చేశారని కంపెనీ ఆరోపించింది. విమానాశ్రయ విస్తరణలో భాగంగా జీఎంఆర్‌కు కొంత స్థలం అవసరమైందనీ, ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో ఒక కొత్త కార్యాలయాన్ని ప్రారంభించాలని తాము యోచిస్తున్నట్టు చెప్పినా వినలేదనీ, చాలామంది శంషాబాద్ చుట్టూ పక్కలేఉండడంతో ఆందోళన చెందారని చెప్పారు. ఈ తరలింపు ఇష్టంలేని కొందరు తమపై ఫిర్యాదు చేసినట్టు వివరించారు. అందుకే వారిని తొలగించినట్టు చెప్పారు. ఉత్పత్తి 50శాతం క్షీణించిందనీ, అయితే హైదరాబాద్‌ను ప్లాంట్ ను మూసివేయడంలేదని స్పష్టం చేసింది. హైదరాబాద్ ప్లాంట్ భాగాల ఎగుమతికోసం ఎదురుచూస్తుండగా, అమృత్సర్ ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉందని చెప్పింది. 2017 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల్లో అమ్మకాలు గణనీయంగా తగ్గాయని డాటావిండ్ సీఈవో సునీత్ సింగ్ తులి మార్కెట్ ఫైలింగ్ లో పేర్కొన్నారు. కాగా హైదరాబాద్‌లో 100 కోట్ల రూపాయల పెట్టుబడులతో మొదలైన డేటావిండ్ సంస్థ మొదటి సంవత్సరంలో రెండు మిలియన్ యూనిట్లు (టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు) ఉత్పత్తి చేయనున్నామని ప్రకటించింది. తమ పూర్తి సామర్థ్యం 5 మిలియన్ యూనిట్లకు చేరుకోనుందని 2016 నవంబరులో ప్రకటించింది. మరోవైపు తక్కువ ధర డేటా ప్రణాళికలను ప్రారంభించనున్నామని, వచ్చే నెల లో ఫీచర్ ఫోన్ల కోసం మొబైల్ బ్రౌజర్ ప్రారంభించటానికి సిద్ధమవుతున్నామని డేటా విండ్ చెప్పింది. ఇది కూడా జావా ఆధారిత ఫీచర్ ఫోన్ లో వినియోగదారులు వేగవంతమైన డేటా అనుభవాన్ని అందించేలా లాంచ్ చేయనున్నామని ప్రకటించింది. -
జియోకి షాక్: నెలకి రూ.20ల కే డేటా సేవలు
న్యూఢిల్లీ: టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీతో ఉచిత ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది. ఏ ప్రిల్ 1 నుంచి ఒకవైపు జియో టారిఫ్ ప్లాన్స్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా మరోవైపు అనేక స్వదేశీ, విదేవీ టెలికాం ఆపరేటర్లు తమ ప్లాన్లు సమీక్షించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ టెలికం బిజినెస్‌పై కెనడియన్ మొబైల్ తయారీ సంస్థ డాటా విండ్ కన్నేసింది. దీంతో టెలికాం స్పేస్ లో మరొక గేమ్ చేంజర్‌గా నిలవనుంది. 3జీ, 4జీ సేవలను అందించే దిశగా వ్యాపారాన్ని ప్రారంభించనుంది. ఖాతాదారులకు సంవత్సరానికి రూ.200 వద్ద డేటా సేవలను అందించడానికి ఆలోచిస్తోంది. బడ్జెట్ ఫోన్లు, తక్కువ ధరలకే ల్యాప్‌టాప్ లను అందిస్తున్న డేటా విండ్ భారత టెలికాం వ్యాపారంలోకి రూ.100 కోట్ల పెట్టుబడులతో ఎంట్రీ ఇస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వర్చ్యువల్ నెట్వర్క్ ఆపరేటరింగ్ కోసం దరఖాస్తు చేసింది. దీనికి అనుమతి లభించిన మొదటి ఆరు నెలలపాటు సం.రానికి రూ.200 లతో డాటా సర్వీసులను అందించనుంది. డేటావిండ్ వ్యాపారం ఒకనెలలో ప్రాంరభకానున్నాయినే దీమాను వ్యక్తం చేశారు సీఈవో సింగ్తులి. ప్రధానంగా డేటా సేవలపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. నెలకు రూ.20 లేదా అంతకంటే తక్కువ డేటా ప్లాన్లు అందుబాటులోకి తీసుకు రానున్నట్టు తెలిపారు. జియో రూ. 300 ప్లాన్ రూ.1,000-1,500 ఖర్చు చేసేవారికి మాత్రమే భరించగలరన్నారు. టాప్ 300 మిలియన్ ప్రజలే ఇందులే ఉంటారనీ,మిగిలిన ప్రజలు నెలకు సుమారు రూ. 90 భరించడం కష్టమని , అందుకేతాము చౌక ప్లాన్లపై దృష్టిపెట్టినట్టు వెల్లడించారు. నెలకి రూ.20 లేదా సం.రానికి రూ.200 లకుమించకుండా ఉండేలా యోచిస్తున్నట్టు చెప్పారు. -
వీఎన్‌వో వ్యాపారంపై డేటావిండ్ కన్ను
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన మొబైల్ ఉపకరణాల తయారీ కంపెనీ డేటావిండ్ తాజాగా టెలికం సర్వీసెస్ బిజినెస్‌లో రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని ప్రణాళికలు రూపొందించుకుంటోంది. లైసెన్స్ పొందిన తొలి ఆరు నెలల కాలంలోనే ఈ పెట్టుబడులు ఉంటాయని కంపెనీ పేర్కొంది. సంవత్సరానికి రూ.200లతో డేటా సర్వీసులను అందిస్తామని తెలిపింది. చౌక ధరలకే ట్యాబ్లెట్స్, స్మార్ట్ఫోన్లను విక్రయించే డేటావిండ్ కంపెనీ ఇదివరకే వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ (వీఎన్‌వో) లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. కంపెనీకి ఒకవేళ లైసెన్స్ లభిస్తే.. ప్రస్తుత టెలికం ఆపరేటర్ భాగస్వామ్యంతో మొబైల్ టెలిఫోనీ, డేటా సర్వీసులను కస్టమర్లకు ఆఫర్ చేస్తుంది. ‘ఒక నెలలో లైసెన్స్ రావచ్చు. తర్వాత డేటా సర్వీసులే లక్ష్యంగా ఆరు నెలల కాలంలో రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాం’ అని డేటావిండ్ ప్రెసిడెంట్, సీఈవో సునీత్ సింగ్ తులి తెలిపారు. నెలకు రూ.20 లేదా అంతకన్నా తక్కువ ధరల్లో డేటా ప్లాన్లను ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. అంటే సంవత్సరానికి రూ.200లకే డేటా సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాగా కంపెనీ తాజాగా రూ.3,999 ధరతో విద్యాట్యాబ్–పంజాబి ట్యాబ్లెట్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. -
ఉచిత ఇంటర్నెట్తో 4జీ స్మార్ట్‌ఫోన్ రూ.3వేలు
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ప్రభావం సృష్టించిన సంచలనం పలు ఆఫర్లకు ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. తాజాగా మొబైల్ మేకర్ డాటా విండ్ వివిధ వేరియంట్లలో ఎంట్రీలెవల్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతోపాటు ఈ మొబైల్స్ లో సంవత్సరం పాటు ఉచిత ఇంటర్ నెట్ ను కూడా అఫర్ చేస్తోంది. ఎంట్రీ లెవల్ రూ.3000 ధర లో 4 జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది డాటా విండ్ . వచ్చే నెల దీపావళికి ముందే వీటిని ప్రారంభించబోతోంది. 1జీబీ, 2జీబీ, 3జీబీ ర్యామ్, 8జీబీ, 16జీబీ , 32జీబీ ఇంటర్నెల్ మొమరీతో వీటిని అందుబాటులోకి తెస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. అలాగే మేటి స్మార్ట్ఫోన్లలో ఉండే దాదాపు అన్ని సుగుణాల మేళవింపుగా తమ స్మార్ట్ ఫోన్లు యూజర్లను అలరించనున్నాయని పేర్కొంది. మరోవైపు రూ.5 వేల ధర పలికే దేశీయ టాబ్లెట్ మార్కెట్ లో 76 శాతం వాటాను కలిగి ఉన్నట్టు కంపెనీ చెబుతోంది. కాగా అమృత్ సర్, హైదరాబాద్ లలో డాటా విండ్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్లో రూ.1500ల నుంచి డాటా విండ్ స్మార్ట్ఫోన్లు లభిస్తున్నాయి. ఇటీవలే మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టిన ఈ సంస్థ ఇప్పటికే రూ.2999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
రూ.1,499కే డేటావిండ్ స్మార్ట్‌ఫోన్
తక్కువ బడ్జెట్లో టాబ్లెట్లను ఆవిష్కరించే కంపెనీగా పేరున్న డేటావిండ్, తాజాగా తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. పాకెట్‌సర్ఫర్ జీజడ్ పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను రూ.1,499కే కస్టమర్లకు అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌తో పాటు ఏడాది పాటు ఉచిత ఇంటర్నెట్ బ్రౌజింగ్ సౌకర్యాన్ని కూడా వినియోగదారుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ ధరలను తగ్గిస్తూ.. టెక్నాలజీని సరసమైన ధరల్లో యూనివర్స్ల్గా అందించేందుకు దృష్టిసారించామని డేటావిండ్ సీఈవో సునీత్ సింగ్ తులి చెప్పారు. టెక్నాలజీ డెమోక్రటైజేషన్కు ఇదే నిజమైన అర్థమని తెలిపారు. తక్కువ ధరల్లో టెక్నాలజీని అందించడం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని సునీత్ సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచంలో దాగిఉన్న ప్రతి మూలకు టెక్నాలజీ చేరేలా తాము దోహదం చేస్తామన్నారు. టచ్ స్క్రీన్, రియర్ కెమెరా, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. అయితే పాకెట్‌సర్ఫర్ జీజడ్కు సంబంధించిన మిగతా ఫీచర్లను కంపెనీ తెలుపలేదు. తాజాగా లాంచ్ చేసిన పాకెట్‌సర్ఫర్ జీజడ్ ఒక్కటే కంపెనీ నుంచి వెలువడిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కాదు. పాకెట్‌సర్ఫర్ 2జీ4ఎక్స్, పాకెట్‌సర్ఫర్ 3జీ4ఎక్స్, పాకెట్‌సర్ఫర్ 3జీ5, పాకెట్‌సర్ఫర్ 3జీ4జడ్ స్మార్ట్ఫోన్లను కూడా కంపెనీ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యంతో బడ్జెట్ ధరల్లో మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఫ్రీడం 251 తర్వాత డేటావిండ్స్ పాకెట్‌సర్ఫర్ జీజడ్ స్మార్ట్ఫోనే చాలా చౌకైన మొబైల్. ఐడీసీ డేటా ప్రకారం డేటావిండ్ తక్కువ ధరల్లో టాబ్లెట్లను అందించడంలో మార్కెట్ లీడర్‌గా ఉంది. కంపెనీ టాబ్లెట్ల రవాణా 2016 తొలి త్రైమాసికంలో 33.5 శాతం పెరిగి, 27.6 శాతం మార్కెట్ షేరును డేటావిండ్ దక్కించుకుంది. మొత్తంగా టాబ్లెట్ మార్కెట్ భారత్‌లో ఫ్లాట్‌గా ఉంది. -
రూ. 3 వేలకే 4జీ హ్యాండ్సెట్!
ఫిబ్రవరికల్లా మార్కెట్లోకి: డాటావిండ్ న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్సెట్ తయారీ కంపెనీ డాటావిండ్ త్వరలో అతి తక్కువ ధరలో, పలు ఆఫర్లతో 4జీ మొబైళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నది. వీటి ధర రూ.3,000గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. కొత్త 4జీ స్మార్ట్ఫోన్లకు ఏడాది పాటు ఉచిత ఇంటర్నెట్ బ్రౌజింగ్ సదుపాయాన్ని (వీడియోలతో సహా ఇతర ఫైళ్ల డౌన్‌లోడ్‌కు మాత్రం ప్రత్యేక ప్లాన్లను వేసుకోవాలి) అందిస్తున్నట్లు తెలిపింది. తాము 4జీ పరికరాల విషయమై పలు మొబైల్ ఆపరేటర్లతో మాట్లాడుతున్నామని, ఉచిత 2జీ, 3జీ నెట్ బ్రౌజింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఆర్‌కామ్, టెలినార్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని డాటావిండ్ ప్రెసిడెంట్, సీఈవో సునీత్ సింగ్ తెలిపారు. -
4,999లకే డాటావిండ్ ట్యాబ్లెట్
ఏడాదిపాటు ఇంటర్నెట్ ఉచితం న్యూఢిల్లీ: కెనడాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ డాటావిండ్ ‘యూబీస్లాట్ 7సీప్లస్ఎక్స్’ అనే ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.4,999. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా కంపెనీ ఈ ట్యాబ్లెట్‌కు ఏడాదిపాటు ఇంటర్నెట్ను ఉచితంగా అందిస్తోంది. -
డేటావిండ్ నుంచి 2జీ, 3జీ స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: ప్రముఖ వైర్లెస్ వెబ్ యాక్సెస్ ఉత్పత్తుల సంస్థ డేటావిండ్ అందుబాటు ధరలలో 2జీ, 3జీ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. డ్యూయల్ సిమ్, 3.5 అంగుళాల తెర వంటి ప్రత్యేకతలున్న ‘పాకెట్‌సర్ఫర్ 2జీ4’ ఫోన్ ధర రూ.1,999గా, 3జీ నెట్వర్క్, డ్యూయల్ కెమెరా, డ్యూయల్ సిమ్, 4 అంగుళాల తెర వంటి ప్రత్యేకతలున్న ‘పాకెట్‌సర్ఫర్ 3జీ4’ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2,999గా ఉంది. అలాగే 5 అంగుళాల తెర ఉన్న ‘పాకెట్‌సర్ఫర్ 3జీ5’ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,499గా ఉంది. కంపెనీ వీటికి ఒక ఏడాదిపాటు ఉచిత ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఆఫర్‌ను అందిస్తోందని డేటావిండ్ సీఈఓ సునీత్ సింగ్ చెప్పారు. దీని కోసం రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని అన్నారు. ‘ప్రతి ఏడాది ఫీచర్ ఫోన్ల అమ్మకాలు 15 కోట్ల యూనిట్లుగా ఉన్నాయి. దీనిలో మేమే 3 శాతం (45-50 లక్షల యూనిట్లు) వాటాను ఆక్రమించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దీని కోసం ముఖ్యంగా టైర్-2, టైర్-3 పట్టణాలపై దృష్టి కేంద్రీకరించాం’ అని అన్నారు. ఈ నెల చివరకు 3,600 రిటైల్ షాపులలో మా స్మార్ట్ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని, వచ్చే త్రైమాసికానికి ఈ షాపుల సంఖ్య రెట్టింపు చేస్తామని చెప్పారు. రూ.3,000 లోపు ధర ఉన్న స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ప్రతి నెల 1.3 కోట్లకు పైగా ఉన్నాయని తెలిపారు.