జియోకి షాక్: నెలకి రూ.20ల కే డేటా సేవలు
న్యూఢిల్లీ: టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీతో ఉచిత ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది. ఏ ప్రిల్ 1 నుంచి ఒకవైపు జియో టారిఫ్ ప్లాన్స్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా మరోవైపు అనేక స్వదేశీ, విదేవీ టెలికాం ఆపరేటర్లు తమ ప్లాన్లు సమీక్షించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ టెలికం బిజినెస్‌పై కెనడియన్ మొబైల్ తయారీ సంస్థ డాటా విండ్ కన్నేసింది. దీంతో టెలికాం స్పేస్ లో మరొక గేమ్ చేంజర్‌గా నిలవనుంది. 3జీ, 4జీ సేవలను అందించే దిశగా వ్యాపారాన్ని ప్రారంభించనుంది. ఖాతాదారులకు సంవత్సరానికి రూ.200 వద్ద డేటా సేవలను అందించడానికి ఆలోచిస్తోంది.
బడ్జెట్ ఫోన్లు, తక్కువ ధరలకే ల్యాప్‌టాప్ లను అందిస్తున్న డేటా విండ్ భారత టెలికాం వ్యాపారంలోకి రూ.100 కోట్ల పెట్టుబడులతో ఎంట్రీ ఇస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వర్చ్యువల్ నెట్‌వర్క్ ఆపరేటరింగ్ కోసం దరఖాస్తు చేసింది. దీనికి అనుమతి లభించిన మొదటి ఆరు నెలలపాటు సం.రానికి రూ.200 లతో డాటా సర్వీసులను అందించనుంది. డేటావిండ్ వ్యాపారం ఒకనెలలో ప్రాంరభకానున్నాయినే దీమాను వ్యక‍్తం చేశారు సీఈవో సింగ్‌తులి. ప్రధానంగా డేటా సేవలపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. నెలకు రూ.20 లేదా అంతకంటే తక్కువ డేటా ప్లాన్లు అందుబాటులోకి తీసుకు రానున్నట్టు తెలిపారు.
జియో రూ. 300 ప్లాన్ రూ.1,000-1,500 ఖర్చు చేసేవారికి మాత్రమే భరించగలరన్నారు. టాప్ 300 మిలియన్ ప్రజలే ఇందులే ఉంటారనీ,మిగిలిన ప్రజలు నెలకు సుమారు రూ. 90 భరించడం కష్టమని , అందుకేతాము చౌక ప్లాన్లపై దృష్టిపెట్టినట్టు వెల్లడించారు. నెలకి రూ.20 లేదా సం.రానికి రూ.200 లకుమించకుండా ఉండేలా యోచిస్తున్నట్టు చెప్పారు.