
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో కొత్త వార్షిక ప్లాన్‌ను తీసుకొచ్చింది. 336 రోజుల చెల్లుబాటుతో రూ. 2,121 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత జియో-టు-జియో కాలింగ్, ల్యాండ్‌లైన్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే జియోయేతర కాలింగ్‌కు 12,000 నిమిషాల టాక్‌టైం లభించనుంది. దీంతోపాటు రోజూ 100 ఎస్ఎంఎస్ సందేశాలు ఉచితం. ఇంకా జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్ యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ వుంటుంది. రూ. 2,121 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ జియోతోపాటు, గూగుల్ పే , పేటీఎమ్‌తో సహా వివిధ థర్డ్ పార్టీ రీఛార్జ్ ఛానెళ్ల ద్వారా కూడా తాజా ప్లాన్ అందుబాటులో ఉంది. మరోవైపు గత ఏడాది డిసెంబర్‌లో పరిమిత కాల ఆఫర్‌గా 365 రోజుల వాలిడిటీతో తీసుకొచ్చిన "2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్" రూ. 2,020 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొలగించింది. దీంతో పాటు తన యాప్ లో కొన్ని ప్లాన్ల కేటగిరీలను కూడా జియో మార్చడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment