high speed
-
విశాఖ టు శంషాబాద్ ఇక 4.30 గంటలే
సాక్షి, హైదరాబాద్: హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి రైల్వేశాఖ చేపట్టిన ప్రాథమిక సర్వే తుదిదశకు చేరుకుంది. వచ్చే మార్చినాటికి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వే పూర్తి కానుంది. పెట్ సర్వేకు రైల్వేశాఖ గతేడాది మే నెలలో ఎస్ఎం కన్సల్టెన్సీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సర్వే నివేదిక ఆధారంగా సమగ్రమైన సర్వే (డీపీఆర్) కోసం మరో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుతానికి రూ.20,000 కోట్లకుపైగా వ్యయం అవుతుందని అధికారుల అంచనా. కానీ పనులు ప్రారంభించే నాటికి నిర్మాణ వ్యయం ఇంకా పెరిగే అవకాశముంది. పెట్ సర్వేలో భాగంగా ఎంపిక చేసిన రూట్లలో ఇంజనీరింగ్ అంశాలపై అధ్యయనం చేశారు. ఎక్కడెక్కడ వంతెనలు, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే దానిపై కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు మార్గాల్లో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్‌లో హైస్పీడ్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎలా ఉంటుందనే అంశాలపైన కూడా పెట్‌సర్వే నివేదికలో పొందుపరచనున్నారు. దీని ఆధారంగా చేపట్టబోయే డీపీఆర్ సర్వేకు 6 నుంచి 8 నెలలకు పైగా సమయం పడుతుందని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. శంషాబాద్–విశాఖకు తక్కువ సమయంలోహైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే.. శంషాబాద్ నుంచి నాలుగున్నర గంటల్లోనే విశాఖకు చేరుకోవచ్చు. ప్రస్తుతం జంటనగరాల నుంచి రైలులో విశాఖకు వెళ్లేందుకు 12 నుంచి 13 గంటల సమయం పడుతోంది. వందేభారత్ మాత్రం 9 గంటల్లో చేరుకుంటోంది. హైదరాబాద్ నుంచి విశాఖకు నిత్యం 10 రెగ్యులర్ రైళ్లు, మరో 12 వీక్లీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 25 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తుండగా మరో 30 వేల మంది వీక్లీ ట్రైన్లలో రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రతి రోజు సుమారు 55,000 మంది జాతీయ ప్రయాణికులు ఉండగా మరో 10 వేల మందికిపైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అమెరికా, దుబాయ్, యూరొప్ తదితర దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హైస్పీడ్ రైలులో నేరుగా విజయవాడ, విశాఖ, తదితర నగరాలకు చేరుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇటు రైలు ప్రయాణికులు, అటు విమాన ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజధానులను అనుసంధానం చేసే విధంగా హైస్పీడ్ కారిడార్ మార్గాలను ఎంపిక చేసినట్టు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సకాలంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడితే రానున్న ఐదారేళ్లలో తెలుగు రాష్ట్రాలకు హైస్పీడ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఎలివేటెడ్ కారిడార్ అయితే ఎలా ఉంటుంది... హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రాథమిక సర్వే చేపట్టినా, కారిడార్ నిర్మాణానికి ఏ రకమైన సాంకేతిక వ్యవస్థ ఎంపిక చేసుకోవాలనే అంశంపైన కూడా అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం అన్ని రైళ్లు నేల మీద నిర్మించిన పటిష్టమైన ట్రాక్‌లపైనే నడుస్తున్నాయి. ప్రధాననగరాల్లో మెట్రోలకు మాత్రం ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించారు. ఈ క్రమంలో పటిష్టమైన ట్రాక్ వ్యవస్థ, అత్యధిక వేగం, ప్రయాణికుల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని హైస్పీడ్ రైల్‌కు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిసేనే బాగుంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే 922 కి.మీల వరకు ఎలివేటెడ్ నిర్మాణానికి భారీ వ్యయం కావొచ్చు. ఇప్పుడున్న అంచనాలకు రెట్టింపు ఖర్చు చేయాల్సి రావొచ్చు. నేలపైనే హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తే నిర్మాణ వ్యయం తగ్గే అవకాశముంది. ఈ రెండింటిలో ఏ పద్ధతిని ఎంపిక చేసుకోవాలనే అంశంపైనే డీపీఆర్ తర్వాతే ఓ అంచనాకు వస్తామని అధికారులు చెబుతున్నారు. చర్లపల్లికి సోలార్ ప్రాజెక్టు.. గ్రేటర్ హైదరాబాద్‌లో నాలుగో టర్మినల్‌గా అందుబాటులోకి రానున్న చర్లపల్లి రైల్వేస్టేషన్లో విద్యుత్ సరఫరాకు చేపట్టిన సోలార్ ప్రాజెక్టుకు కేంద్రం తాజా బడ్జెట్లో రూ.93.75 కోట్లు కేటాయించింది. స్టేషన్ అవసరాలకు కావాల్సినంత విద్యుత్ ఈ ప్రాజెక్టు నుంచి తీసుకుంటామని అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరులో చర్లపల్లి నుంచి రైల్వేసేవలు ప్రారంభించనున్నట్టు జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. సౌరశక్తి ప్రాజెక్టుతో పాటు తుదిదశలో ఉన్న చర్లపల్లి టర్మినల్ నిర్మాణ పనులకు మరో రూ.46 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు. -
‘నమో భారత్’ అదిరెన్.. హైదరాబాద్‌లోనే డిజైన్!
సాక్షి, హైదరాబాద్: వందే భారత్ రైలు తర్వాత మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న రైలు సర్వీసు ‘నమో భారత్’. మెట్రో రైళ్ల కంటే చాలా ఎక్కువ వేగంతో దూసుకుపోయే ఈ రైళ్లు.. వసతుల్లోనూ వాటికంటే మెరుగ్గా ఉంటాయి. బుల్లెట్ రైలు మాదిరిగా ముందు భాగం ఏరోడైనమిక్ డిజైన్‌తో ఉండటం దీని ప్రత్యేకత. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే.. ఢిల్లీ, రాజస్తాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పట్టణాలతో అనుసంధానించే ఈ ప్రాజెక్టు మొదటి దశను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. సాహిబాబాద్–దుహై స్టేషన్ల మధ్య ఈ సేవలు మొదలయ్యాయి. దాదాపు 160 కి.మీ. వేగాన్ని అందుకునే ఈ రైళ్లు ఇప్పుడు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భాగ్యనగరంతో బంధం... ఎన్నో ప్రత్యేకతలతో పట్టాలెక్కిన ఈ రైళ్లకు భాగ్యనగరంతోనూ ఓ బంధం ముడిపడి ఉంది. చూడగానే ఆకట్టుకునే రూపం, అత్యధిక వేగం, మెట్రో రైళ్లకంటే వెడల్పు, ఎత్తుగా ఉండటంతో విశాలమైన కోచ్‌లు.. ఇలా పలు ప్రత్యేకలతో ఉన్న ఈ రైలును డిజైన్ చేసింది ఆల్స్టోమ్ అనుబంధ విభాగం ఉన్న హైదరాబాద్‌లోనే కావటం విశేషం. ఫ్రాన్స్‌కు చెందిన బహుళజాతి కంపెనీ ఆల్స్టోమ్ ప్రపంచ వ్యాప్తంగా రైలు రోలింగ్‌స్టాక్ తయారీలో నిమగ్నమై ఉంది. ఈ కంపెనీ బెంగళూరు కేంద్రంగా మన దేశంలో ఆల్స్టోమ్ ఇండియా ప్రైవేట్ లిమిడెట్ పేరుతో ఏర్పాటై, మెట్రో రైళ్లను తయారు చేస్తోంది. దీనికి హైదరాబాద్‌లో ఉన్న ఇంజినీరింగ్ కేంద్రం నమో భారత్ రైలును డిజైన్ చేసింది. ఎరోడైనమిక్ నోస్ మోడల్‌తో రూపొందించిన ఈ డిజైన్ టెండర్ ద్వారా అమోదం పొందింది. ఎన్నో ప్రత్యేకతలు... గంటకు దాదాపు 180 కి.మీ. వేగంతో దూసుకుపోయే సామర్ధ్యంతో దీన్ని రూపొందించారు. అంత వేగంతో వెళ్లేప్పుడు గాలి ఒత్తిడిని తట్టుకునేందుకు బుల్లెట్ రైలు తరహాలో ఎరోడైనమిక్ నోస్ మోడల్‌ను రూపొందించారు. దేశంలో సాధారణ మెట్రో రైళ్లు 2.8 మీటర్ల నుంచి 3 మీటర్ల వెడల్పు ఉంటాయి. కానీ నమో భారత్ ఏకంగా 3.2 మీటర్ల వెడల్పుతో ఉంది. మెట్రో రైళ్లలో బెంచీల తరహాలో సీటింగ్ సిస్టం ఉండగా, ఇందులో వందేభారత్ చైర్ కార్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో ఉన్నవారిని వేగంగా ఢిల్లీ నగరంలోని అసుపత్రులకు తరలించేందుకు కూడా అనుకూలంగా వీటిని డిజైన్ చేశారు. రోడ్డు మార్గాన రెండు గంటల్లో వెళ్లే దూరాన్ని ఈ రైలు కేవలం అరగంటలో చేరుతుంది. స్ట్రెచర్‌తో సహా రోగిని రైలు కోచ్‌లో ఉంచేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. స్ట్రెచర్‌ను అటాచ్ చేసే సిస్టమ్ ఉంది. ఆ కంపెనీ టేకోవర్.. నమో భారత్ రైలు డిజైన్‌ను హైదరాబాద్‌లో రూపొందించగా, గుజరాత్‌లోని సావ్లీ గ్రామంలో ఉన్న బాంబార్డియర్ ట్రాన్స్‌పోర్టేషన్ అనే మరో బహుళజాతి కంపెనీకి చెందిన యూనిట్లో ఈ రైళ్లను తయారు చేశారు. 2021లో ఈ కంపెనీని కూడా ఆల్స్టోమ్ కంపెనీ టేకోవర్ చేయటం విశేషం. త్వరలో చేపట్టనున్న హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుకు కూడా ఈ సంస్థ బిడ్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ప్రస్తుతం నగరంలో 90 కి.మీ. వేగంతో తిరుగుతున్న మెట్రో రైళ్ల కంటే ఎయిర్‌పోర్టు మెట్రో రైళ్లు కనీసం 30 కి.మీ. అధిక వేగంతో తిరుగుతాయని అధికారులు చెబుతున్నారు. కాస్త ఎరో డైనమిక్ లుక్‌తో ఉండనున్న ఈ రైళ్ల తయారు కోసం ఈ కంపెనీ సిద్ధమవుతోందని తెలుస్తోంది. -
జియో 5జీ @ 2 జీబీపీఎస్.. న్యూ బ్యాండ్, హై స్పీడ్!
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ సర్వీసులను 26 గిగాహెట్జ్ మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్‌లో ఆవిష్కరించినట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వెల్లడించింది. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో 2 జీబీపీఎస్ (సెకనుకు గిగాబిట్స్) స్పీడ్‌ను సాధించినట్లు తెలిపింది. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం 22 టెలికం సర్కిళ్లలోని జియో కస్టమర్లు .. 26 గిగాహెట్జ్ వేవ్ అధారిత బిజినెస్ కనెక్టివిటీని పొందుతున్నారని జియో వివరించింది. దాదాపు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా, పూర్తి సామర్ధ్యంలో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించేందుకు మిల్లీమీటర్ వేవ్ ఉపయోగపడగలదని తెలిపింది. తమకు నిర్దేశించిన గడువులోగానే 22 టెలికం సర్కిళ్లలో కనీస స్థాయిలో సర్వీసులను ప్రారంభించాలన్న నిబంధనను అమలు చేయగలిగినట్లు జియో తెలిపింది. 5జీని అత్యంత వేగంగా అందుబాటులోకి తెచ్చిన సందర్భాల్లో ఇది కూడా ఒకటని వివరించింది. -
Enigma హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్లు కమింగ్ సూన్!
నోయిడా: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఎనిగ్మా త్వరలో ఆరు హై–స్పీడ్ టూ వీలర్లను ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఇవిఅందుబాటులోకి రాగలవని సంస్థ ఎండీ అన్మోల్ బోహ్రీ తెలిపారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలిగే కెఫే రేసర్-ఎనిగ్మా సీఆర్22 వీటిలో ఉండనున్నట్లు వివరించారు. ఒక్కసారి చార్జి చేస్తే ఇది 105 కి.మీ. రేంజి ఇస్తుందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: (యూట్యూబ్ వీడియో లైక్ చేస్తే..రోజుకు రూ. 8వేలు: కట్ చేస్తే!) గిఫ్ట్ నిఫ్టీగా ఎస్‌జీఎక్స్ నిఫ్టీ జూలై 3 నుంచి అమల్లోకి సింగపూర్‌లో ట్రేడయ్యే నిఫ్టీ సూచీ పేరు ఎస్‌జీఎక్స్ నిఫ్టీ నుంచి గిఫ్ట్ నిఫ్టీగా మారనుంది. జూలై 3 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. ఎస్‌జీఎక్స్ ఆర్డర్లు అన్నీ మ్యాచింగ్ కోసం గిఫ్ట్ సిటీలోని ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ఎక్స్ఛేంజీకి బదలాయించనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఎన్ఎస్ఈ అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) ఎక్స్ఛేంజీ ఉంది. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు ) -
హైస్పీడ్ ఈ-స్కూటర్ ‘మిహోస్’ లాంచ్..ఫ్రీ బుకింగ్, ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో మరో ఈ స్కూటర్ సందడి చేయనుంది. జాయ్ ఇ-బైక్ తయారీదారు వార్డ్ విజార్డ్ తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మిహోస్ ఆన్లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. జనవరి 22 నుండి కస్టమర్లు కంపెనీ వెబ్సైట్ నుండి అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 600+ అధీకృత షోరూమ్‌ల నుండి మిహోస్‌ను ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. మిహోస్ డెలివరీలు మార్చి 2023లో దశలవారీగా ప్రారంభం మవుతాయని కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆటో ఎక్స్పో 2023 సందర్భంగా జాయ్ ఇ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 1.49 లక్షలకు (ఎక్స్-షోరూమ్, పాన్ ఇండియాలో మొదటి 5000 మంది కస్టమర్లకు) లాంచ్ చేసింది. స్మార్ట్ మిహోస్ ఇ-స్కూటర్ విభిన్న సెన్సార్ల కలయికతో వస్తుంది. అదనపు మన్నిక, సేఫ్టీకోసం పాలీడైసైక్లోపెంటాడిన్ (PDCPD)తో రూపొందించింది. 7 సెకన్లలోపు వ్యవధిలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. నికెల్ మాంగనీస్ కోబాల్ట్ కెమిస్ట్రీతో 74V40Ah Li-Ion ఆధారిత బ్యాటరీ,యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, GPS సెన్సింగ్, రియల్-టైమ్ పొజిషన్ , జియో-ఫెన్సింగ్ వంటి అనేక ఇతర ఫీచర్లు మిహోస్‌లో ఉన్నాయి.'జాయ్ ఇ-కనెక్ట్ యాప్' ద్వారా స్కూటర్ని ట్రాక్ చేయవచ్చు , బ్యాటరీ స్థితిని కూడా రిమోట్‌గా తనిఖీ చేయవచ్చు. రివర్స్ మోడ్‌తో ఇరుకైన పార్కింగ్ ప్రదేశాల నుండి సులభంగా బయటకు రావడానికి స్కూటర్‌ను వెనుకకు తరలించడానికి అనుమతిస్తుంది. మెటాలిక్ బ్లూ, సాలిడ్ బ్లాక్ గ్లోసీ, సాలిడ్ ఎల్లో గ్లోసీ, పెరల్ వైట్ ఇలా నాలుగు రంగుల్లో మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఆటో ఎక్స్‌పోలో తమకు అద్భుతమైన స్పందన లభించిందనీ, ముఖ్యంగా ఈ స్కూటర్ రెట్రో డిజైన్‌ను ప్రశంసించడమే కాకుండా అదనపు భద్రత కోసం ఉపయోగించిన పాలీ డైసైక్లోపెంటాడిన్ బాగా ఆకర్షించిందనీ వార్డ్‌విజార్డ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ యతిన్ గుప్తా తెలిపారు. వినియోగదారుల సానుకూల స్పందనతోనే ఆన్లైన్ బుకింగ్స్‌ను ఉచితంగా ప్రారంభించామన్నారు. టాప్ నాచ్టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో, కస్టమర్ల ఆకాంక్షల్ని తీర్చగలమనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
అతివేగంతోనే అధిక ప్రమాదాలు
సాక్షి, అమరావతి: దేశంలో అతివేగం వల్లే అత్యధిక రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. 2020తో పోల్చితే 2021లో అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ మేరకు 2021లో రాష్ట్రాల వారీగా రోడ్డు ప్రమాదాలపై కేంద్రం నివేదిక విడుదల చేసింది. దేశంలో ఆ ఏడాదిలో మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 71.7 శాతం ప్రమాదాలు అతివేగం వల్లే జరిగాయి. అంతేకాకుండా 2020తో పోల్చితే ఇవి 11.4 శాతం పెరిగాయి. రోడ్డు ప్రమాదాల మొత్తం మరణాల్లో అతివేగం వల్ల ఏకంగా 69.6 శాతం మృతి చెందగా 72.9 శాతం గాయపడ్డట్టు నివేదిక పేర్కొంది. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల 2.2 శాతం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల 1.6 శాతం రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో కూడా జాతీయ రహదారులపై అతివేగం కారణంగా 2021లో 5,167 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 2,155 మంది మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది. అలాగే రాష్ట్రంలో మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల జాతీయ రహదారులపై 113 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 13 మంది మృతి చెందారు. -
అతివేగం.. నిద్రమత్తు..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: శ్రుతిమించిన వేగం, నిద్రమత్తు కారణంగానే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు వెల్లడయింది. ఎక్కువగా జాతీయ రహదారులపైనే దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటలలోపే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన ఏడాది అంటే.. 2021లో 23,313 ప్రమాదాలు జరిగాయి. ప్రమాదానికి గురైన వారిలో ఎక్కువగా 35 ఏళ్లలోపు వారే. ప్రమాదాల్లోనూ, మృతుల్లోనూ అనంతపురం జిల్లాలోనే ఎక్కువ ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రోజుకు సగటున 64 ప్రమాదాలు రాష్ట్రంలో రోజుకు సగటున 64 ప్రమాదాలు జరుగుతున్నట్లు తేలింది. ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ప్రమాదానికి గురవుతున్నారు. 35 ఏళ్లలోపు యువకులు అత్యంత వేగంగా వెళ్లడం కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక జాతీయ రహదారుల్లో ట్రక్కులు, కార్లు వంటివి మితిమీరిన వేగంతో వెళుతూ అదుపుతప్పి ప్రమాదానికి గురవుతున్నాయి. కొన్నిసార్లు బ్లాక్ స్పాట్స్ (ప్రమాదం జరిగే ప్రాంతం) సూచికలున్నా పట్టించుకోకుండా వెళుతుండడం వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రద్దీ కారణంగానే.. వాహనాల రద్దీ పెరిగింది. అందుకు తగ్గట్టుగా రహదారుల నిర్వహణ చేయాల్సి ఉంది. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ప్రతి నెలా ఒక మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ను రహదారి భద్రతకు కేటాయిస్తున్నాం. స్పీడ్ లేజర్ గన్ల సాయంతో అతివేగంతో ప్రయాణించే వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నాం. – శివరామప్రసాద్, ఉప రవాణా కమిషనర్, అనంతపురం -
మస్క్ కాస్కో.. టెస్లాకు పోటీగా ఇండియన్ కార్
రౌద్రం, రణం, రుధిరం సింపుల్‌గా ఆర్ఆర్ఆర్ భారతీయ మూవీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా. మీన్ మెటల్ మోటార్ సింపుల్‌గా ఎంఎంఎం. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తాజాగా ఆసక్తి రేపిన స్టార్టప్. ఫస్ట్ ఇండియన్ సూపర్ కార్ తెస్తామంటూ రూట్‌మ్యాప్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో సంచలనం సృష్టించిన టెస్లాతో ఢీ అంటే ఢీ అంటున్నాడు భారత ఔత్సాహిక పారిశ్రామిక వేత్త శర్‌తక్‌పాల్. టెస్లా ఎస్ ప్లెయిడ్ 3ని మించిన ఫీచర్లతో కారు తయారు చేయబోతున్నట్టు ప్రకటించారు. టెస్లాకు సవాల్ విసిరాడు. సాక్షి, వెబ్‌డెస్క్: రెండు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకునే నేర్పు... గరిష్ట వేగం గంటకి 350 కిలోమీటర్లు.... 100 హార్స్ పవర్ కలిగిన శక్తివంతమైన ఇంజన్.... ఒక్క సారి రీఛార్జీ చేస్తే చాలు 700 కి.మీల ప్రయాణం చేయగల సామర్థ్యం, .. ఇవన్నీ చదువుతుంటే టెస్లా కంపెనీ ఎస్ ప్లెయిడ్ 3 ఎలక్ట్రిక్ కారు గుర్తొస్తుందా.. కానీ ఇది ఎస్ ప్లెయిడ్ కాదు ఎంఎంఎం అజానీ ఎలక్ట్రిక్ కారు. తయారు చేస్తోంది ఏ విదేశీ కంపెనీయో కాదు పక్కా భారతీయ సంస్థ. దాని ఓనర్ శర్‌తక్‌పాల్. ఇండియా వర్సెస్ టెస్లా భారత్‌లో దిగుమతి సుంకాలు ఎక్కువని, వాటిని తగ్గిస్తే ఇండియాలో టెస్లా ఈవీ కార్లనె తెస్తామంటూ టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ ప్రకటించారు. దీనికి ప్రతిగా ఇండియాలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే పన్ను రాయితీ గురించి ఆలోచిస్తామంటూ భారత ప్రభుత్వం ఫీలర్ వదిలింది. మరోవైపు ఈవీ వెహికల్స్ తయారు చేసే సత్తా భారతీయులకు ఉందంటూ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అధినేత భవీష్ అగర్వాల్ స్పందించారు. టెస్లాకి సవాల్ ఈవీ వాహనాలు.. ఎలన్‌మస్క్... భారత్‌ల మధ్య రాజుకున్న వేడి ఇంకా చల్లారలేదు. ఇంతలోనే ఎలన్‌మస్క్‌కు షాక్ ఇచ్చే న్యూస్ మరో భారతీయుడైన శర్‌తక్‌పాల్ నుంచి వచ్చింది. ఎలన్‌మస్క్ తనకు ఆదర్శమని, ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో టెస్లా ఓ బ్రాండ్ అని.. కానీ తాము బ్రాండ్ కిల్లర్ అంటూ సవాల్‌కు సై అన్నాడు. త్వరలో తన కంపెనీ నుంచి రాబోతున్న సూపర్ ఎలక్ట్రిక్ కారు విశేషాలను తెలియజేశాడు. భారత సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఎంఎంఎం మీన్ మెటల్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్. సింపుల్‌గా ఎంఎంఎం. ఈ స్టార్టప్‌ని ముగ్గురు మిత్రులతో కలిసి 19 ఏళ్ల శర్‌తక్‌పాల్ 2012లో నెలకొల్పాడు. ఆ తర్వాత 2014లోనే భవిష్యత్తును అంచనా వేసి అజానీ అనే బ్రాండ్ నేమ్‌తో ఇండియన్ మేడ్ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కారును తయారు చేయాలని ఎంఎంఎ లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్టార్టప్‌లో శ్రమిస్తున్న వారి సంఖ్య నాలుగు నుంచి ఇరవైరెండుకి పెరగగా.... ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కారు కాన్సెప్టు చివరి చేరుకుంది. త్వరలోనే అజానీ కారుతో సంచలనాలు సృష్టిస్తామంటూ తమ మార్కెట్ స్ట్రాటజీని ఇటీవల ఎంఎంఎ వెల్లడించింది. ఎంఎంఎం అజానీ ఎంఎఎం ప్రైవేట్ లిమిలెడ్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం... ఫస్ట్ ఇండియన్ ఎలక్ట్రిక్ కారుగా వస్తోన్న అజానీ గరిష్ట వేగం గంటలకు 350 కిలోమీటర్లు, ఇందులో అమర్చిన 120 కిలోవాట్ బ్యాటరీని ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు స్పీడ్ మోడ్‌లను బట్టి కనిష్టంగా 550 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 700 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. 986 బ్రేక్‌హార్స్ పవర్ ఇంజన్‌తో కేవలం రెండు సెకన్లలోనే వంద కిలోమీటర్ల స్పీడు అందుకోగల నేర్పు దీని స్వంతం. మార్కెట్లో హల్చల్ చేస్తోన్న స్పోర్ట్స్ కార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కారుని డిజైన్ ఉంటుంది. కంపెనీ రిలీజ్ చేసిన ఫోటోలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మార్కెట్‌కి వచ్చేది అప్పుడే అజానీ కారు 2022 ద్వితియార్థంలో అజానీ ప్రొటోటైప్ సిద్ధమవుతుందని ఎంఎంఎం ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. అనంతరం 2023 ప్రారంభంలో యూకేలో ఈ కారుని ఫస్ట్ రిలీజ్ చేయనున్నారు. ఆ మరుసటి ఏడాది యూఏఈలో అందుబాటులోకి తేనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో జెండా పాతిన తర్వాత 2025లో ఇండియాకు అజానీని తీసుకువస్తామని చెబుతున్నారు. ఇండియాలో ఈ కారు ధర ఇండియాలో కనిష్టంగా 89 లక్షల నుంచి రూ. 1.50 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. అన్నింటా భిన్నమే ప్రస్తుతం కార్ మాన్యుఫ్యాక్లరింగ్ యూనిట్లో ఐదో వంతు ఉండే యూనిట్‌తోనే అజానీ కార్లు తయారు చేయబోతున్నట్టు ఎంఎంఎం ప్రకటించింది. ఈ మేరకు కారు ఎయిరోడైనమిక్స్, రీసెచ్చ్ అండ్ డెవలప్మెంట్లకు సంబంధించి ఎంఎంఎం టీమ్ సభ్యులు అమెరికా, జర్మనీలకు చెందిన ఇంజనీర్లతో కలసికట్టుగా పని చేస్తున్నారు. వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు సమీకరిస్తున్నారు. రెండేళ్లలో మార్పు ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల ఇటు ప్రభుత్వం, అటు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నా.. మౌలిక సదుపాయల కొరత ఎక్కువని ఎంఎంఎం సీఈవో శర్‌తక్‌పాల్ అంటున్నారు. రెండేళ్లలో ఈ సమస్య తీరిపోతుందని ఆయన అన్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సంబంధించి పాశ్చాత్య దేశాలతో పోల్చితే ఇండియా వెనుకబడి ఉందని, అజానీ రాకతో ఈ పరిస్థితులో మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
టీవీఎస్ నుంచి హై స్పీడ్ స్కూటర్
ముంబై: టీవీఎస్ మోటార్ మంగళవారం ఎన్‌టార్క్ 125సీసీ రేస్ ఎక్స్పీ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. తెలంగాణలో ఎక్స్ షోరూంలో దీని ధర రూ.89,192 గాఉంది. 125 సీసీ సిగ్మెంట్లో 10 పీఎస్ పైగా పవర్‌తో భారత్‌లో రూపొందిన ఏకైక స్కూటర్ ఇదే అని కంపెనీ తెలిపింది. రేస్, స్ట్రీట్ అనే రెండు డ్రైవింగ్ మోడ్ ఆప్షన్లను కలిగి ఉంది. ఎన్‌టార్క్ 125సీసీ రేస్ ఎక్స్పీ బైక్‌లో అధునాత ఫీచర్లను టీవీఎస్ జత చేసింది. అందులో వాయిస్ అసిస్టెంట్, కనెక్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ రేస్ మోడల్లో గంటకు 98 కిలోమీటర్ల వేగం ప్రయాణిస్తుంది. -
ఎయిర్టెల్ కొత్త ప్లాన్ : జీ5 ప్రీమియం ఫ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. 289 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను మళ్లీ లాంచ్ చేసింది. ఇందులో రోజుకు 1.5 జీబీ హై-స్పీడ్ డేటాను అందివ్వనుంది. అపరిమిత కాలింగ్ సదుపాయాన్నిఅందిస్తున్న ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. దీంతో పాటు 28 రోజుల పాటు జీ5 ప్రీమియం సభ్యతాన్ని ఉచితంగా అందించనుంది. (జియోమీట్‌కు పోటీ :ఎయిర్టెల్ త్వరలోనే) 289 రూపాయల ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జి చేసే వినియోగదారులకు జీ 5 ప్రీమియంతోపాటు, అపరిమిత లోకల్, ఎస్టిడి, రోమింగ్ కాల్స్ ఉచితం. రోజుకు 1.5జీబీ హై-స్పీడ్ డైలీ డేటా రోజుకు 100 ఎస్ఎంఎస్ సందేశాలు 28 రోజులు పాటు లభిస్తాయి. అలాగే ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం చందాతో 400 కి పైగా లైవ్ టివి ఛానెల్స్ ను ఎంజాయ్ చేయవచ్చు. షా అకాడమీ ద్వారా వింక్ మ్యూజిక్ యాక్సెస్, ఉచిత ఆన్లైన్ కోర్సులు కూడా లభ్యం. అలాగే 79 టాప్-అప్ వోచర్ ను ఎయిర్టెల్ తీసుకొచ్చింది. దీని ద్వారా జీ 5 ప్రీమియం సభ్యత్వాన్ని 30 రోజుల పాటు అందివ్వనుంది. కాగా 2018 లో, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు ఒక జీబీ డేటాతో 289 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 48 రోజుల పాటు చెల్లుబాటయ్యేలా ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రకటించింది. అదే పీపెయిడ్ ప్లాన్ ను తాజా ప్రయోజనాలతో తీసుకొచ్చింది. -
గుడ్ న్యూస్: జియో అదిరిపోయే ప్లాన్
సాక్షి, ముంబై: దిగ్గజ టెలికాం సంస్ధ రిలయన్స్ జియో తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్, లాక్డౌన్, వర్క్ ఫ్రం హోం కారణంగా డేటాను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం కొత్త ప్లాన్ ను తీసుకువచ్చింది. రూ.999 ప్రీపెయిడ్ ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటాను అందించనుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. 84 రోజుల వ్యవధిలో యూజర్లు మొత్తం 252 జీబీని వాడుకోవచ్చు. (జియో హాట్రిక్ : మరో మెగా డీల్) జియో వినియోగదారులకు ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ వంటి అదనపు లాభాలు రూ.999 ప్లాన్ ద్వారా లభించనున్నాయి.ఇతర నెట్ వర్క్ లకు 3,000 నిమిషాలు ఉచితం. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ 3 జీబీ అయిపోయాక నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు పరిమితమవుతుంది. (జియో మరో భారీ డీల్ ) చందాదారులు కొత్త ప్లాన్‌ను మైజియో యాప్ నుండి నేరుగా రీఛార్జ్ చేసుకోవచ్చు లేదా థర్డ్ పార్టీ వెబ్సైట్ లేదా గూగుల్ పే లేదా పేటిఎం లాంటి యాప్స్ ద్వారా కూడా రీచార్జ్ చేసుకోవచ్చు. (మూడ్ లేదు.. ఇక తెగతెంపులే ) దీంతోపాటు ప్రస్తుతం జియోలో 84 రోజుల వ్యాలిడిటీతో మొత్తం మూడు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.599, రూ.555 ప్లాన్లు. ఇవి వరుసగా 2జీబీ, 1.5జీబీ రోజువారీ హై-స్పీడ్ డేటా ను అందిస్తాయి. ఈ రెండు ప్లాన్ల ద్వారా కూడా జియో నుంచి జియోకు ఉచిత అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ లకు చేసుకోవడానికి 3000 ఉచిత నిమిషాలు, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభ్యం. అలాగే జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభించనుంది. (భారత్‌కు మరోసారి ప్రపంచ బ్యాంకు భారీ సాయం) -
జియో కొత్త రీచార్జ్ ప్లాన్
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో కొత్త వార్షిక ప్లాన్‌ను తీసుకొచ్చింది. 336 రోజుల చెల్లుబాటుతో రూ. 2,121 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత జియో-టు-జియో కాలింగ్, ల్యాండ్‌లైన్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే జియోయేతర కాలింగ్‌కు 12,000 నిమిషాల టాక్‌టైం లభించనుంది. దీంతోపాటు రోజూ 100 ఎస్ఎంఎస్ సందేశాలు ఉచితం. ఇంకా జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్ యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ వుంటుంది. రూ. 2,121 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ జియోతోపాటు, గూగుల్ పే , పేటీఎమ్‌తో సహా వివిధ థర్డ్ పార్టీ రీఛార్జ్ ఛానెళ్ల ద్వారా కూడా తాజా ప్లాన్ అందుబాటులో ఉంది. మరోవైపు గత ఏడాది డిసెంబర్లో పరిమిత కాల ఆఫర్‌గా 365 రోజుల వాలిడిటీతో తీసుకొచ్చిన "2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్" రూ. 2,020 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొలగించింది. దీంతో పాటు తన యాప్ లో కొన్ని ప్లాన్ల కేటగిరీలను కూడా జియో మార్చడం గమనార్హం. -
ప్రాణాలను పణంగా పెట్టి బైక్ రేసింగ్
తమ ప్రాణాలను పణంగా పెట్టి అతివేగంతో వారు ఆడిన ఆట తమలో ఒకడిని మృత్యుఒడికి చేర్చింది.. పుట్టిన రోజు సంబరాలు వారిలో ఒకరి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. అతివేగం ప్రమాదకరం, నిదానమే ముద్దు.. వేగం వద్దు అంటూ ప్రభుత్వం, అధికారులు ఎంత ప్రచారం చేస్తున్నా.. యువత వినడం లేదు. వేగంలోనే మజా ఉందంటూ, స్పీడ్ బైక్‌లపై రయ్యని దూసుకుపోతూ మృత్యు ఒడికి చేరుతున్నారు. రామవరప్పాడు సమీపంలో బుధవారం జరిగిన బైక్ రేసింగ్ ఒకరి కుటుంబంలో విషాదం నింపింది.. సాక్షి, ఆటోనగర్(విజయవాడతూర్పు), రామవరప్పాడు: అతివేగం ఒకరిపాలిట యమపాశం అయింది. రామవరప్పాడు సమీపంలో బుధవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తవంతెన దుర్గా అగ్రహారానికి చెందిన బుర్ర అజయ్(19), దోమల యశ్వంత్(22), వాంబేకాలనీకి చెందిన గుత్తికొండ నాగరాజు(23), కుందావారి కండ్రికకకు చెందిన వందల దుర్గాప్రసాద్(23) నలుగురు స్నేహితులు. వీరిలో దుర్గాప్రసాద్ పుట్టినరోజు కావడంతో మిత్రులంతా కలిసి ద్విచక్ర వాహనంపై ఎనికేపాడు వరకూ వెళ్లి వేడుక జరుపుకొన్నారు. తిరిగి విజయవాడకు బయల్దేరుతూ ఎవరు ముందు వెళ్తారోనని పందెం వేసుకొని ఒకరినొకరు అతివేగంతో రెండు వాహనాలపై వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో రామవరప్పాడు సమీపంలోకి వస్తుండగా ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న పిచ్చయ్య హోటల్ వద్ద డివైడర్‌ను బలంగా ఢీకొట్టారు. ఘటనలో నలుగురు కింద పడ్డారు. అజయ్ డివైడర్ ఇనుపచువ్వలు బలంగా గుచ్చుకుని, అక్కడికక్కడే మృతిచెందాడు. మిగిలిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు ఫోన్‌చేసి సమాచారం అందించగా వారు వచ్చి క్షతగాత్రులందరికి చికిత్సనిమిత్తం ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. అజయ్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఔటర్‌పై జెట్‌స్పీడ్
సాక్షి, సిటీబ్యూరో: ‘2018 అక్టోబర్ 12 ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పెద్దఅంబర్‌పేట నుంచి శంషాబాద్ విమానాశ్రయ మార్గంలో ఓ కారు వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) పాయింట్ వద్ద గంటకు 229 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతున్నట్టుగా స్పీడ్ లేజర్ గన్ కెమెరాలకు చిక్కింది.’‘2019 మే రెండో తేదీన మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి పెద్దఅంబర్‌పేట మార్గంలో ఓ కారు అధిక వేగంతో దూసుకెళుతూ శంషాబాద్ ట్రాఫిక్ ఠాణా పరిధిలోకి వచ్చే హర్షగూడ ప్రాంతంలో గంటకు 170 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్టుగా స్పీడ్ లెజర్ గన్ కెమెరాకు చిక్కింది’. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై వాహనాలు వాయు వేగంతో దూసుకెళుతున్నాయి. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్పైకి వాహనం ఎక్కితే చాలు కంటికి కనిపించని వేగంతో దూసుకెళుతుండటంతో తోటి వాహనదారులు హడలెత్తిపోతున్నారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ, సైబరాబాద్, రాచకొండ పోలీసులు నిర్ణయించినా వాహనదారులు మాత్రం అంతకు రెట్టింపు వేగంతో దూసుకెళ్లేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా ఈ ఏడాది నాలుగు నెలల్లో సైబరాబాద్ పరిధిలోని ఓఆర్ఆర్లో 1,26,135, రాచకొండ పరిధిలోని ఓఆర్ఆర్లో 1,39,201 ఈ–చలాన్ కేసులు నమోదవడం వాహనదారుల వాయువేగానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇతర రహదారులతో పోలిస్తే ఓఆర్‌ఆర్‌పైనా అత్యధికంగా హైస్పీడ్ ఉల్లంఘనలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఉల్లంఘనల్లో కార్లదే హవా... ఇరు కమిషనరేట్ల పరిధిలోని 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్లో రోజుకు లక్షన్నర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలతో పాటు నగరానికి చెందిన వాహనాలు రోజురోజుకు పెరుగుతుండటంతో కొన్ని సందర్భాల్లో టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఇదే క్రమంలో ఓఆర్ఆర్ ఎక్కితే చాలా వరకు వాహనాలు తమ గమ్యస్థానికి తొందరగా వెళ్లేందుకు వాయు వేగంతో తాపత్రయపడుతున్నారు. అయితే హెవీ వెహికల్స్ కంటే ఎక్కువగా కార్లే ఉల్లంఘనల్లో మొదటిస్థానంలో ఉన్నాయి. ఓఆర్ఆర్పై జరుగుతున్న ప్రమాదాల్లోనూ ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. అత్యధికంగా పెద్దఅంబర్‌పేట–శంషాబాద్ మార్గంతో పాటు శంషాబాద్–గచ్చిబౌలి మార్గంలో వాహనాలు ఓవర్‌స్పీడ్‌తో పరుగులు పెడుతున్నాయి. నాలుగు నెలలకు రూ.27 కోట్ల పైనే జరిమానా అధిక వేగంతో వెళుతున్న వాహనాలు స్పీడ్ లేజర్ గన్ కెమెరాలకు చిక్కుతున్నా వేగం మాత్రం మారడం లేదు. సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఇంటికి చలాన్లు పంపుతున్నారు. ఇలా నాలుగునెలల్లో రూ.27 కోట్ల జరిమానాతో చలాన్లు జారీ చేశారు. అయినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అయితే గతంతో పోల్చుకుంటే ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు తగ్గాయని అధికారులు చెబుతున్నా మాట వాస్తవమే అయినా ఒకవేళ ప్రమాదం జరిగితే మాత్రం తీవ్రత ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు మితీమిరిన వేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. అధిక వేగం వద్దు...ప్రాణం ముద్దు అని ఓఆర్ఆర్ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో హెచ్ఎండీఏ అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వాహనదారుల్లో మాత్రం ఆశించినంత మార్పు కనిపించడం లేదంటున్నారు. మూడేళ్లలో రూ.122 కోట్లు ఇరు కమిషనరేట్ల పరిధిలోని ఓఆర్ఆర్లో 2017, 2018, 2019 సంవత్సరాల్లో అధిక వేగంతో దూసుకెళుతున్న వాహనాలకు 10,05,196 ఈ–చలాన్లు జారీ చేశారు. ఆయా వాహనాలకు వేసిన జరిమానా ఏకంగా రూ.122 కోట్లపైనే ఉందంటే వాహనదారుల వేగం ఏ రేంజ్లో ఉందో అర్ధమవుతోంది. అలాగే ఈ సమయంలో ఓఆర్‌ఆర్‌పైనా 358 రోడ్డు ప్రమాదాలు జరిగితే 110 మంది మృత్యువాత పడ్డారు. వందలా మంది క్షతగాత్రులయ్యారు. అందుకే ఓవర్ స్పీడ్ తగ్గిస్తే వాహనదారుల ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని పోలీసులు సూచిస్తున్నారు. -
పెనువిషాదం : వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
అతివేగం మూడు గ్రామాల్లో పెనువిషాదం నింపింది. రెండు బొలెరో వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఈ ఘోర ప్రమాదంతో పెనుకొండ ప్రాంతం ఉలిక్కిపడింది. మృతులు, క్షతగాత్రుల బంధువులు, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం మిన్నంటింది. పెనుకొండ/పెనుకొడ రూరల్/ రొద్దం: ఘోర ప్రమాదంతో పెనుకొండ ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది. రొద్దం మండలం లక్సానుపల్లి, ఎల్.తిమ్మాపురం గ్రామాలకు చెందిన దాదాపు 26 మంది శుక్రవారం ఉదయం టాప్‌లెస్ బొలెరో వాహనంలో అనంతపురం బయల్దేరారు. పెనుకొండ మండలం సత్తారుపల్లి వద్దకు రాగానే అరటిగెలల లోడుతో మడకశిరకు వెళుతున్న మరో బొలెరో వాహనం ఎదురుగా ఢీకొంది. టాప్‌లెస్ వాహనం బోల్తాపడటంతో ప్రాణనష్టం భారీగా సంభవించింది. ప్రమాదస్థలిలో ఆరుగురు, ఆస్పత్రిలో ఒకరు, మార్గమధ్యంలో మరొకరు మరణించారు. 15 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో ఆస్పత్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి. డాక్టర్ రోహిల్ ఆధ్వర్యంలో వైద్యసేవలందించారు. మధ్యాహ్నం డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ దివాకర్‌బాబు పరిస్థితిని సమీక్షించి మెరుగైన వైద్యం కోసం కొంతమందిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో బొలెరో వాహనాల డ్రైవర్లు సురక్షితంగా బయటపడి సంఘటన స్థలం నుంచి పరారయ్యారు. రోడ్డు ప్రమాద విషయం తెలియగానే ఆర్డీఓ ఓబులేసు, ఎమ్మెల్యే బీకే పార్థసారథి, వైఎస్సార్సీపీ నాయకులు శ్రీకాంతరెడ్డి, న్యాయవాది భాస్కరరెడ్డి, మాజీ సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, చలపతి, రాజ్‌గోపాల్‌రెడ్డి కొండల రాయుడు, వైశాలి జయప్ప, ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, అనితా శ్రీనివాసరెడ్డి, ఎస్.బి.శీనా, నాయుడు తదితరులు పెనుకొండ ఆస్పత్రికి వెళ్లి మృతుల, క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించారు. చంద్రన్న బీమా కింద ఆర్థికసాయం అందించే విషయమై ఎమ్మెల్యే ఆరా తీశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు.. లక్సానుపల్లి, ఎల్.తిమ్మాపురం గ్రామాలకు చెందిన శ్రీనివాసులు, గంగప్ప, చంద్రశేఖర్, కొండప్ప, రామాంజినరెడ్డి, వెంకటరమణప్ప, గంగాధర్, గోవిందప్ప, ప్రభాకరరెడ్డి, లింగప్ప, దాసరిక్రిష్టప్ప, రామచంద్రప్ప, గోవిందశెట్టి, ఈ వెంకటరమణప్ప, ముద్దప్ప తదితరులు చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్సీపీ నేతల పరామర్శ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, అనంతపురం, హిందూపురం పార్లమెంటుల అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం పార్లమెంటు సమన్వయన్వయకర్త నదీమ్హమ్మద్, కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.వి.సిద్దారెడ్డి తదితరులు లక్సానుపల్లి, ఎల్.తిమ్మాపురం గ్రామాలకు చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. అంతకుముందు పెనుకొండ, అనంతపురం ఆస్పత్రులకూ వెళ్లి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మృతుల కుటంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. నేతల వెంట వైఎస్సార్సీపీ కన్వీనర్లు శ్రీకాంతరెడ్డి, వెంకటరత్నం, ఫక్రోధ్ధిన్, నారాయణరెడ్డి, జయరాం, తయూబ్, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, బ్రహ్మసముద్రం శ్రీనివాసులు, మాజీ సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, చలపతి, రాజ్గోపాలరెడ్డి, ఎంపీటీసీలు రామ్మోహన్‌రెడ్డి, అనితా శ్రీనివాçసరెడ్డి సింగిల్ విండో అధ్యక్షులు కరావులపల్లి బాబు, శంకరరెడ్డి, రొద్దం చంద్రశేఖర్, రమణ, ప్రభు, అశోక్, కలిపి శీనా, శివారెడ్డి తదితరులు ఉన్నారు. -
ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్
సాక్షి, ముంబై: భారతీ ఎయిర్టెల్ తాజాగా కొత్త డేటా ప్లాన్లను ప్రకటించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకోసం ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్లతో ముందుకు వచ్చింది . టెలికాం కంపెనీ వెబ్సైట్ ప్రకారం రెండు ప్లాన్లను లాంచ్ చేసింది . రూ. 49 , రూ. 92 ప్లాన్లను ప్రారంభించింది. అందుబాటు ధరలో, హైస్పీడ్ డేటాను వినియోగదారులకు అందించే లక్ష్యంగా వీటిని ప్రారంభించింది. రూ.49 ప్యాక్ ప్రామాణికత ఒక రోజు. ఇందులో 3జీబీ హై స్పీడ్ డేటా. మరొక ప్లాన్ రూ. 92 ప్యాక్ 7 రోజులపాటు చెల్లుబాటులో ఉంటుంది. 6జీబీ డేటా అందిస్తుంది. ఈ రెండు ప్లాన్లలోనూ అధిక-వేగ డేటాను ఆఫర్ చేస్తుంది. డేటా వినియోగంపై రోజువారీ నిబంధన ఏదీ లేదు. అంటే ఏడు రోజుల్లోనూ ఎపుడైనా 6జీబీ డేటా వాడు కోవచ్చు. -
అక్రమ రవాణా.. ఆపై అతివేగం
కొత్తపల్లి(కరీంనగర్) : అసలే అక్రమంగా తరలిస్తున్న ఇసుక.. ఆపై అతివేగం.. అనుభవంలేని, లైసెన్స్ లేకుండా.. ఇష్టారాజ్యమైన డ్రైవింగ్‌తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మితిమీరిన వేగం ప్రజలకు ప్రాణసంకటంగా మారుతోంది. వేగంగా దూసుకొస్తున్న వాహనాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో..? అన్న అభద్రతాభావంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇటీవల అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ మల్కాపూర్‌లో ఓ ఇంట్లోకి దూసుకురాగా.. అదే శివారులోని బైపాస్ సమీపంలో గల మూలమలుపు వద్ద శనివారం అతివేగంతో అదుపుతప్పిన ఓ ఇసుక ట్రాక్టర్ బోల్తాపడింది. ఎలాంటి నష్టమూ వాటిల్లనప్పటికీ.. రోడ్డంతా ఇసుక నిండుకోవడంతో పాటు ఇతర వాహనాల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. ఆదరాబాదరగా ఆ ఇసుక ట్రాక్టర్‌ను అక్కడి నుంచి తరలించడంతో కేసునుంచి బయటపడినట్లయ్యింది. మల్కాపూర్ బైపాస్‌పై గతేడాది ఆటోను ట్యాంకర్ ఢీకొట్టిన సంఘటనలో ఎనిమిది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సమీపంలోనే ఇసుక ట్రాక్టర్ బోల్తా పడటంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్, ఆసిఫ్‌నగర్, ఎలగందుల, కమాన్‌పూర్, బద్ధిపల్లి, నాగులమల్యాల, గంగాధర మండలం ఒడ్యారం గ్రామాల్లోని ఖనిజ సంపదను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు నిత్యం వేలాది చిన్న, పెద్ద వాహనాలు వెళ్తుంటాయి. ఆ వాహనాలన్నీ కమాన్‌పూర్, చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్, రేకుర్తి గ్రామాల మీదుగా అతివేగంతో ప్రయాణిస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు రోడ్డు దాటాలంటేనే వణుకుతున్నారు. మానేరు వాగు నుంచి ఇసుక, ఆసిఫ్‌నగర్, నాగులమల్యాల, ఒడ్యారం, కమాన్‌పూర్, బద్ధిపల్లి గ్రామాల నుంచి గ్రానైట్, మొరం రవాణా చేసే వాహనాలు, ఆటోలు తదితర ఇతర వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తుండటంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ వాహనాల వేగానికి ప్రజలు దూరంగా పరుగెత్తాల్సి వస్తుందే తప్ప డ్రైవర్లు మాత్రం వేగాన్ని నియంత్రించడం లేదు. అడ్డు అదుపులేకుండా వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలపై రవాణా శాఖ కొరడా ఝులిపించాల్సి అవసరం ఉన్నా.. ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అడపాదడపా తనిఖీలు చేస్తూ వదిలేస్తుండటంతో భయం లేకుండా పోతోంది. లైసెన్స్‌లు లేకుండా వాహనాలను నడుపుతున్నా చర్యలు లేకపోవడంతో దర్జాగా డ్రైవింగ్ చేస్తున్నారు. గ్రానైట్ లారీల్లోంచి బండలు పడిపోయినా, అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు బోల్తా పడ్డ ఎలాంటి చర్యలు లేకపోవడంతో అతి వేగానికి కళ్లెం పడటం లేదని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇసుక ట్రాక్టర్ల వేగానికి కళ్లెమేది ? మండలంలోని ఖాజీపూర్ మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారుల కళ్లెదుటే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా నిలువరించలేకపోతున్నారు. అధికారులెక్కడ చూస్తారోనన్న భయంతో అక్రమ రవాణాదారులు ట్రాక్టర్ల స్పీడును పెంచుతూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అతివేగం ప్రమాదమని తెలిసినా ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. లైసెన్స్‌లు లేని డ్రైవర్లు, లేబర్లే డ్రైవర్లుగా అవతారమెత్తుతూ ట్రాక్టర్లను తోలుతుండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత నెల 22న మల్కాపూర్ మాజీ సర్పంచ్ ఇంట్లోకి ఇసుక ట్రాక్టర్ దూసుకెళ్లిన విషయం మరువకముందే.. అదేగ్రామంలో బైపాస్ సమీపంలోని మూలమలుపు వద్ద ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో రోడ్డంతా ఇసుక నిండుకోవడమే కాకుండా ఇతరుల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. ధనార్జనే ధ్యేయంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఇసుక ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వేగాన్ని అదుపు చేయాలి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, గ్రానైట్, మొరం లారీల వేగాన్ని అదుపు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇసుక ట్రాక్టర్లు, లారీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆ వాహనాల వేగానికి రోడ్డు దాటాలంటేనే భయం వేస్తోంది. చిన్న పిల్లలు, వృద్ధులకు మరీ కష్టంగా ఉంది. మితిమీరిన వేగం వల్ల ఇసుక ట్రాక్టర్లు బోల్తా పడుతున్నాయి. అతి వేగానికి కళ్లెం వేయాలి. – కాసారపు శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ మల్కాపూర్ -
అతివేగానికి చెక్ పెట్టేలా లేజర్ గన్స్
కొరుక్కుపేట: వాహనాల అతివేగానికి చెక్ పెట్టేందుకు లేజర్‌గన్స్ అందుబాటులోకి రానున్నాయి. రోడ్డు నిబం ధనలు పాటించకుండా మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే జరిమానాలు భరించక తప్పదు. వాహనాల అతివేగాన్ని పసిగట్టేలా చెన్నై –బెంగళూరు జాతీయ రహదారిలో వినూత్న లేజర్ గన్స్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.12కోట్ల నిధులు మంజూరు చేసిం ది. అధికారులు మాట్లాడుతూ ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా లేజర్ గన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జాతీయ రహదారుల్లో ఏర్పాటు చేసిన లేజర్‌గన్స్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి అతివేగంగా వెళ్లే వాహనాలకు జరిమానా విధించనున్నారు. ఈ జరిమానాను తరువాత వచ్చే టోల్ ప్లాజాలోనే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వాహనం ఫొటో, నంబర్ చిత్రాలను ఎవిడెన్స్‌గా చూపనున్నట్లు పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా చెన్నై –వేలూరు మధ్య జాతీయ రహదారిలో ఏర్పాటు చేస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. -
వేగపరిమితి తప్పనిసరి
– స్పీడ్ గవర్నర్స్ లేని రవాణా వాహనాలకు ఫిట్నెస్ ‘నో’ – టాంపరింగ్ చేసినవారిపై కఠిన చర్యలు – ఏర్పేడు ఘటన నేపథ్యంలో ప్రమాద నివారణపై స్పెషల్ డ్రైవ్ కర్నూలు: గరిష్ట వేగ పరిమితిని పాటించేందుకు దోహదపడే స్పీడ్ గవర్నర్స్ లేని రవాణా వాహనాలకు సోమవారం నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ చేయకూడదని జిల్లా రవాణా శాఖ నిర్ణయించింది. మితిమీరిన వేగం వల్ల రోడ్డు ప్రమాదాలు భారీ సంఖ్యలో జరగడం, అపార ప్రాణనష్టం సంభవించడంతో ఈ మేరకు రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేస్తే ఆ వాహనం ఇక బయట తిరిగే అవకాశం ఉండదు. ఒకవేళ తిరిగితే సీజ్ చేస్తారు. భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. చట్టం ఏమి చెబుతోంది... మోటార్ వాహనాల చట్టం ప్రకారం రవాణా వాహనాలు 20 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లడానికి వీలు లేదు. రవాణా వాహనాలకు 2015 అక్టోబర్ 1 ముందు వరకు స్పీడ్ గవర్నర్స్ విధానం ఉండేది కాదు. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అక్టోబర్ 2015 నుంచి తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో వాహన తయారీదారులు కొత్తగా ఉత్పత్తి చేసే వాహనాల్లో వేగ పరిమితి అమర్చుతున్నారు. దీనివల్ల ఆ వాహనం గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లగలదు. అక్టోబర్ 2015 ముందు వాహనాలకు ఈ విధానం లేకపోవడంతో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఉదంతాలు ఉన్నాయి. ఉల్లంఘనలు ఇలా.. కేంద్ర ప్రభుత్వం స్పీడ్ గవర్నర్స్‌ను తప్పనిసరి చేసినా ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వాహన కంపెనీలు అంతర్గతంగా వేగపరిమితిని బిగించి వాటికి సీల్ చేసినా యజమానులు టాంపరింగ్ చేస్తున్నారు. జిల్లాలో స్టేజ్ కారియర్లుగా తిరిగే రవాణా వాహనాల్లో చాలావరకు టాంపరింగ్ జరిగాయని రవాణా శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవలే కొన్ని బస్సులకు తనిఖీలు నిర్వహించినప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. స్పీడ్ గవర్నర్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతుండటం రవాణా శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. రవాణా వాహనాలు ఫిట్నెస్ కోసం కార్యాలయానికి రాగానే ముందుగా వేగపరిమితి ఉందో లేదో చెక్ చేస్తారు. పరిశీలనలో టాంపరింగ్‌కు గురైందని తేలితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు. కోర్టుకు కూడా నివేదిస్తారు. స్పీడ్ గవర్నర్లు లేనివారు వాటిని బిగించుకుని ఫిట్‌నెస్‌కు రావాల్సిందిగా రవాణా శాఖ జిల్లా ఉపకమిషనర్ ప్రమీల తెలిపారు. జిల్లాలో స్పెషల్ డ్రైవ్... చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన నేపథ్యంలో జిల్లాలో ‘ఉల్లంఘనుల’పై స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నట్లు డీటీసీ ప్రమీల తెలిపారు. మోటర్ వాహన తనిఖీ అధికారులు కె.వి.ఎల్.ఎన్.ప్రసాద్, స్వాతి, రమణా నాయక్ నేతృత్వంలో రోడ్డు సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్నవారిపై రెండు రోజుల్లో 97 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఓవర్‌లోడ్, ఓవర్ క్రోడింగ్, రెండవ డ్రైవర్ లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వారిపై స్పెషల్ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. -
హైస్పీడ్ కనెక్టివిటీతో సరికొత్త రైల్
-
ఆటో డ్రైవర్ల అతివేగానికి ఒకరు మరణం
- నందికొట్కూరు వద్ద ఢీకొన్న మూడు ఆటోలు - ఓ మహిళ మృతి - 18 మందికి గాయాలు - ఒకరి పరిస్థితి విషమం జూపాడుబంగ్లా: ఆటో డ్రైవర్ల అతివేగానికి పొట్ట కూటి కోసం కూలీకి వెళ్తున్న మహిళ బలైంది. రహదారి సరిగా లేదని తెలిసినా పోటాపోటీగా నడుపుతూ ప్రమాదానికి కారకులయ్యారు. నందికొట్కూరు సమీపంలో రబ్బాని వేర్‌హౌస్ వద్ద శుక్రవారం ఉదయం మొదట రెండు ఆటోలు ఢీకొని ప్రయాణికులు ఆర్తనాదాలు చేస్తుండగా, నిమిషం తేడాలోనే మరో ఆటో వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధురాలు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. నాగటూరు గ్రామంలో శుక్రవారం ఉదయం 18 మంది వ్యవసాయ కూలీలు ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ నరేంద్ర తంగెడంచ గ్రామానికి బయలుదేరాడు. అదే రహదారిలో జూపాడుబంగ్లాలో ఆరుగురు ప్రయాణికులను ఎక్కించుకున్న డ్రైవర్ వలి నందికొట్కూరుకు బయలుదేరాడు. ఇద్దరు ఒకే వైపు అతివేగంగా వస్తూ అధిగమించే ప్రయత్నంలో నందికొట్కూరు సమీపంలో రబ్బాని వేర్‌హౌస్ వద్ద రెండు ఆటోలు ఢీకొన్నాయి. రహదారిపై బోల్తా పడిన ఆటోలో నుంచి గాయపడిన కూలీలు తేరుకుంటుండగా నందికొట్కూరు నుంచి ఆత్మకూరుకు బీరువాలు తీసుకెళ్తున్న ట్రాలీ ఆటో వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగటూరుకు చెందిన అక్కమ్మ (50) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. అదే గ్రామానికి పెద్దక్క పరిస్థితి విషమంగా ఉంది. వీరితోపాటు నరేష్, సుశీలమ్మ, సువర్ణ, ఆటో డ్రైవరు నరేంద్రతోపాటు తాటిపాడు గ్రామానికి చెందిన వెంకటయ్య, తిరుపతయ్య, నీలిషికారి లక్ష్మీదేవి, రాజు, మాలిక్బాషాతో పాటు మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనంలో నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన మూడు ఆటో డ్రైవర్లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జూపాడుబంగ్లా ఎస్ఐ అశోక్ తెలిపారు. మూడు ఆటోలను సీజ్‌చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. క్షతగాత్రులను స్వయంగా తరలించిన సీఐ: సంఘటన స్థలంలో తీవ్రరక్తస్రావంతో విలవిలలాడతున్న బాధితులను చూసిన వారందరూ అయ్యోపాపం అంటున్న వారే తప్పా ఆసుçపత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి హుటాహుటిన ద్విచక్రవాహనంపై సంఘటన ప్రాంతానికి చేరుకొని రక్తమోడుతున్న క్షతగాత్రులను స్వయంగా ఎత్తుకొని ఓ ప్రైవేటు వాహనంలో నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి దగ్గరుండి బాధితులకు చికిత్సలు చేయించారు. -
కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి
► మృతుల్లో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ► భద్రాద్రికి వెళ్లివస్తూ మృత్యువాత ► అతివేగమే ప్రమాదానికి కారణం కట్టంగూర్: నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల శివారు చెర్వుఅన్నారం బస్టాప్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. మెదక్ జిల్లా ఇందు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఆరుగురు పూర్వ విద్యార్థులు (ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు) దైవదర్శనం కోసం శుక్రవారం భద్రాచలం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో పాల్వంచలోని స్నేహితుని ఇంటివద్ద సాయంత్రం వరకు కాలక్షేపం చేశారు. తిరిగి రాత్రి 7 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ క్రమంలో చెర్వుఅన్నా రం బస్‌స్టాప్ సమీపంలోకి కారు అతివేగంగా వచ్చి అదుపు తప్పింది. కల్వర్టును ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లి నీటిలో మునిగింది. అందులో ముగ్గురు అతికష్టంమీద డోరు తీసుకొని బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారుకు తాడు కట్టి క్రేన్ సహాయంతో బయటకు తీశారు. కానీ, కారులోనే ఉన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిన్న చీకోడుకు చెందిన చర్లపల్లి శృతిరెడ్డి(23), ఇదే జిల్లా జిల్లేడకి చెందిన హాసాన్పల్లి రత్నమాల(24) నీటిలో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ప్రశాంత్ (23) కారు నడుపుతూ తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి 108 లో తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెం దాడు. శృతిరెడ్డి హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ కాగా, రత్నమాల ఎంటెక్ ఫస్టియర్ చదువుతోంది. ప్రశాంత్ బీటెక్ పూర్తిచేసి వ్యాపారం చేస్తున్నాడు. ముగ్గురు మృత్యుంజయులు.. ఈ ప్రమాదంలో వరంగల్‌కు చెందిన ఐలేన్ వినోద్‌రెడ్డి, హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన గోపిరెడ్డి దిలీప్ కుమార్‌రెడ్డి, సిద్దిపేటకు చెందిన జెట్టి శ్వేతలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. -
చిన్నారిని బలిగొన్న అతివేగం
కామేపల్లి (పిడుగురాళ్ల రూరల్): అతివేగానికి చిన్నారి బలైపోయింది. పండుగ సెలవులకని అమ్మమ్మ ఇంటికి వెళ్లి రెండు రోజులు ఆనందంగా గడిపి తిరిగి వస్తున్న చిన్నారిని కారు రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటన వుండలంలోని కామేపల్లిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. మాచవరం నుంచి పిడుగురాళ్ల వైపు వెళుతున్న ఆటోను కామేపల్లి గ్రామం వద్ద పిడుగురాళ్ల వైపు నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఘటనలో నకరికల్లు మండలం ఈదులపేటకు చెందిన నాగుల్‌మీరా, నన్నెల దంపతుల చిన్న కువూర్తె షభానా(5) అక్కడికక్కడే మృతి చెందింది. అదే ప్రమాదంలో మోర్జంపాడుకి చెందిన వీఆర్వో సర్వేశ్వర, పిడుగురాళ్ళకు చెందిన నాగవ్ము, సక్కుబాయి, నాగబాబు, కృష్ణా జిల్లా బొగ్గవరపుకు చెందిన వెంకటేశ్వర్లు, మండలంలోని తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సుజాత, రవుణమ్మ గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను పిడుగురాళ్ళలోని ఓ ప్రై వేటు వైద్యశాలకు, నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
బోన్విల్లేలో హైస్పీడ్ వాహనాల పోటీ
-
ప్రాణాలు తీసిన నిద్ర మత్తు.. అతివేగం
దొరవారిసత్రం: స్కార్పియో కారు డ్రైవర్ నిద్ర మత్తు, అతి వేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న డాక్టర్ దుర్మరణం చెందగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మండలంలోని జాతీయ రహదారిపై కలగుంట సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారు జామున జరిగింది. ఎస్సై మారుతీకృష్ణ కథనం మేరకు... చెన్నై ప్రాంతంలోని పొన్నేరిలో డాక్టర్లు మువ్వా భవాని (48), ఆదిశేషారావు సాయిభవాని డయాబెటిక్ సెంటర్‌ను సుమారు 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఆదిశేషారావు తండ్రి సంవత్సరికం సందర్భంగా స్వగ్రామైన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు 14వ తేదీన వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని 16వ తేదీన భవాని స్వగ్రామం తెనాలికి వచ్చారు. అక్కడ చదువుకుంటున్న కుమారుడిని చూసి శనివారం రాత్రి 8 గంటకు పొన్నేరికి కారులో బయలుదేరారు. కలగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి వచ్చే సరికి డ్రైవర్ నిద్రమత్తులో అతివేగంగా కారును నడపడంతో ముందుకు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొన్నాడు. కారు లారీ వెనుక భాగంలో సగం వరకు దూసుకుపోయింది. దీంతో డ్రైవర్ ధరణి నరేష్ (30), డాక్టర్ భవాని ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. ఆదిశేషారావుకు స్వల్పగాయాలు కాగా, వీరికి సహాయంగా వచ్చిన కుమార్ తీవ్రగాయాలతో బయట పడ్డాడు. డ్రైవర్ చెన్నై దగ్గరలోని అనపంబట్టు ప్రాంతానికి చెందిన వాడిగా పోలీసుల తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు గంటల పాటు అల్లాడిన యువకుడు డాక్టర్ కుటుంబానికి తోడుగా వచ్చిన యువకుడు కుమార్ జరిగిన ప్రమాదంలో కారులోనే ఇరుక్కుపోయాడు. ప్రమాదం ఆదివారం తెల్లవారు జామున సుమారు 3.30 గంటలకు జరిగింది. విషయం తెలుసుకుని ఎస్సై, పోలీస్‌లు, 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికి ఎంత ప్రయత్నం చేసిన ఇరుక్కుపోయిన యువకుడిని బయటకు తీయలేకపోయారు. చివరికి ఎస్ఐ నాయుడుపేట నుంచి ఓ క్రేన్ తెప్పించి గాయపడిన కుమార్‌ను వెలికి తీసే సరికి రెండు గంటలు పట్టింది. అప్పటి వరకు కాపాడండి కాపాడండి అంటూ ఆ యువకుడు నరకయాతన పడ్డాడు. -
హైస్పీడ్ ట్రైన్ టెస్ట్ రన్
-
అతి వేగం ప్రాణాల మీదకు తెచ్చింది
ప్రకాశం (దర్శి): ఓ వ్యక్తి మితిమీరిన వేగంతో కారును నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన షేక్ మస్తాన్ బాబు, కారును అతివేగంగా నడిపి రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టాడు. దీంతో మస్తాన్ బాబుతో పాటు, కారులో ఉన్న సుభానీ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
ప్రాణం తీసిన అతివేగం..
పెయింట్ డబ్బాలు ఢీకొట్టి అదుపుతప్పిన బైక్ మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం మరొకరికి స్వల్పగాయాలు సినిమా సన్నివేశంలా జరిగిన ఘటన తాడేపల్లి రూరల్ : అతివేగం మరో రెండు నెలల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఓ యువకుడిని బలితీసుకుంది. పెయింట్ డబ్బాల రూపంలో మృత్యువు వెంటాడగా, పెట్రోల్ రూపంలో సజీవ దహనం చేసింది. తాడేపల్లి పట్టణ పరిధిలోని కనకదుర్గ వారధిపై గురువారం అందరూ చూస్తుండగా అచ్చం సినిమా సన్నివేశంలా జరిగిపోయింది. ప్రమాదం ఏ రూపంలోనైనా రావచ్చన్న మాటకు ఈఘటన నిదర్శనంగా నిలిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన వెలగల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు సీతారామరాజు (23)కు చిలకలూరిపేట సమీపంలోని మెట్టపల్లి గ్రామానికి చెందిన మిత్రుడు మందా నారాయణస్వామితో కలిసి రిలయన్స్ 4జి కంపెనీలో విధులు నిర్వహిస్తుంటారు. వీరిద్దరూ నిత్యం గుంటూరు నుంచి పల్సర్ ద్విచక్రవాహనంపై విజయవాడ బెంజ్ సర్కిల్ వరకు ప్రయాణం చేస్తూ ఉంటారు. సీతారామరాజుకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. మరో రెండు నెలల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉంది. రోజూ మాదిరిగానే గురువారం మిత్రుడితో కలిసి విజయవాడ బయలుదేరిన వీరు కనకదుర్గ వారధిపై అతి వేగంగా వెళ్తూ రోడ్డుపై జీబ్రా లైన్లు వేస్తున్న పెయింట్ డబ్బాలను ఢీకొట్టారు. అచ్చం సినిమా సన్నివేశంలా.. బైక్ వేగానికి పెయింట్ డబ్బాలతో పాటు అందులో కలిపే టిన్నర్ సైతం ఎగిరి వీరి ఒంటి నిండా పడింది. అప్పటికే ఆ డబ్బాలలో కొంత కిరోసిన్ కలిపి ఉండడం, అది వీరి ఒంటిపై పడడంతో కంగారు పడ్డ వీరు దిచక్రవాహనాన్ని నియంత్రించలేకపోయారు. వారధిపై 8-9 ఖానాల నడుమ బండి అదుపుతప్పి కిందపడి దూసుకు వెళుతుండడంతో బండిలోని పెట్రోల్ ఒలికి రోడ్డుపై పడింది. బైక్‌పై ఉన్న ఇద్దరినీ తడిపేసింది. ఆ సయంలోనే పల్సర్ వాహనం ఘర్షణకు రోడ్డుపై నిప్పులు చిమ్మడం, ఆ మంట వీరికి అంటుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. బాధితుల కేకలు విని సమీపంలోని వాహనదారులు, పెయింట్ వేస్తున్న వారు మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఎంతకీ మంటలు అదుపుకాలేదు. ఒంటిపై మంటల ధాటికి ఆర్తనాదాలు చేసిన బాధితులు ఒకానొక తరుణంలో కృష్ణా నదిలో దూకేందుకు ప్రయత్నించగా, స్థానికులు నిలువరించారు. అటుగా వెళ్లే ప్రయాణికులు కార్లలో ఉన్న టవళ్లతో మంటలను అదుపు చేశారు. అప్పటికే సీతారామరాజు 90 శాతం కాలిపోగా, నారాయణ స్వామికి కొంతమేర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే సీతారామరాజు మృతి చెందగా, నారాయణ స్వామి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో రెండు నెలల్లో వివాహం కావాల్సిన కుమారుడు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసిన తాడేపల్లి ఎస్ఐ వినోద్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని నార్త్ జోన్ డీఎస్పీ రామకృష్ణ, తాడేపల్లి సీఐ చిట్టెం కోటేశ్వరరావు సందర్శించి వివరాలు సేకరించారు. -
అతివేగం..విషాదం
శంషాబాద్, న్యూస్‌లైన్: బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ వద్ద బుధవారం లారీ, స్కార్పియో ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో జేపీ సిమెంట్ సంస్థ జాయింట్ వైస్ ప్రెసిడెంట్ పి.వి గోపాలకృష్ణన్ ఉన్నారు. అతివేగం, రోడ్డుపై మలుపులో వాహనాలు అదుపుతప్పడం వల్ల ఈ సంఘటన జరిగింది. ఆర్జీఐఏ ఠాణా ఎస్ఐ కాశీవిశ్వనాథ్ కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఉన్న జేపీ సిమెంట్ కంపెనీ జాయింట్ వైస్ ప్రెసిడెంట్ పి.వి గోపాలకృష్ణన్ హైదరాబాద్‌లోని కంపెనీ కార్యాలయంలో మంగళవారం పనులు ముగించుకున్నారు. అక్కడి నుంచి సెలవుపై కేరళ రాష్ట్రంలోని సొంతూరు కున్నూరుకు వెళ్లేందుకు బుధవారం తెల్లవారుజామున స్కార్పియో వాహనంలో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. ఈ క్రమంలో శంషాబాద్ పట్టణంలో మలుపు వద్ద పొట్టు లోడుతో ఉన్న లారీ వేగంగా వచ్చి స్కార్పియో వాహనాన్ని ఢీకొంది. దీంతో కారు నడుపుతున్న మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన డ్రైవర్ లినేష్ (29) , వెనుక సీట్లో కూర్చున గోపాలకృష్ణన్(51) అక్కడికక్కడే మృతి చెందారు. అదే వాహనంలో ఉన్న మరో డ్రైవర్ కరీంనగర్ జిల్లాకు చెందిన జహీర్‌ఖాన్ (29)కు తీవ్ర గాయాలవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గోపాలకృష్ణన్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు.