సాక్షి, ముంబై: దిగ్గజ టెలికాం సంస్ధ రిలయన్స్ జియో తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్, లాక్డౌన్, వర్క్ ఫ్రం హోం కారణంగా డేటాను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం కొత్త ప్లాన్ ను తీసుకువచ్చింది. రూ.999 ప్రీపెయిడ్ ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటాను అందించనుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. 84 రోజుల వ్యవధిలో యూజర్లు మొత్తం 252 జీబీని వాడుకోవచ్చు. (జియో హాట్రిక్ : మరో మెగా డీల్)
జియో వినియోగదారులకు ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ వంటి అదనపు లాభాలు రూ.999 ప్లాన్ ద్వారా లభించనున్నాయి.ఇతర నెట్ వర్క్ లకు 3,000 నిమిషాలు ఉచితం. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ 3 జీబీ అయిపోయాక నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు పరిమితమవుతుంది. (జియో మరో భారీ డీల్ )
చందాదారులు కొత్త ప్లాన్‌ను మైజియో యాప్ నుండి నేరుగా రీఛార్జ్ చేసుకోవచ్చు లేదా థర్డ్ పార్టీ వెబ్‌సైట్ లేదా గూగుల్ పే లేదా పేటిఎం లాంటి యాప్స్ ద్వారా కూడా రీచార్జ్ చేసుకోవచ్చు. (మూడ్ లేదు.. ఇక తెగతెంపులే )
దీంతోపాటు ప్రస్తుతం జియోలో 84 రోజుల వ్యాలిడిటీతో మొత్తం మూడు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.599, రూ.555 ప్లాన్లు. ఇవి వరుసగా 2జీబీ, 1.5జీబీ రోజువారీ హై-స్పీడ్ డేటా ను అందిస్తాయి. ఈ రెండు ప్లాన్ల ద్వారా కూడా జియో నుంచి జియోకు ఉచిత అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ లకు చేసుకోవడానికి 3000 ఉచిత నిమిషాలు, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభ్యం. అలాగే జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభించనుంది. (భారత్‌కు మరోసారి ప్రపంచ బ్యాంకు భారీ సాయం)
Comments
Please login to add a commentAdd a comment