Enigma to launch 6 high-speed electric 2-wheelers by year end - Sakshi
Sakshi News home page

Enigma హై-స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ టూ-వీలర్లు కమింగ్‌ సూన్‌!

Published Wed, May 17 2023 10:27 AM | Last Updated on Wed, May 17 2023 10:49 AM

6highspeed electric two wheelers coming year end by Enigma - Sakshi

నోయిడా: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఎనిగ్మా త్వరలో ఆరు హై–స్పీడ్‌ టూ వీలర్లను ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఇవిఅందుబాటులోకి రాగలవని సంస్థ ఎండీ అన్మోల్‌ బోహ్రీ తెలిపారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలిగే కెఫే రేసర్‌-ఎనిగ్మా సీఆర్‌22 వీటిలో ఉండనున్నట్లు వివరించారు. ఒక్కసారి చార్జి చేస్తే ఇది 105 కి.మీ. రేంజి ఇస్తుందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  (యూట్యూబ్‌ వీడియో లైక్‌ చేస్తే..రోజుకు రూ. 8వేలు: కట్‌ చేస్తే!)
 

గిఫ్ట్‌ నిఫ్టీగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  జూలై 3 నుంచి అమల్లోకి 
సింగపూర్‌లో ట్రేడయ్యే నిఫ్టీ సూచీ పేరు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నుంచి గిఫ్ట్‌ నిఫ్టీగా మారనుంది. జూలై 3 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) తెలిపింది. ఎస్‌జీఎక్స్‌ ఆర్డర్లు అన్నీ మ్యాచింగ్‌ కోసం గిఫ్ట్‌ సిటీలోని ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ ఎక్స్ఛేంజీకి బదలాయించనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో ఎన్‌ఎస్‌ఈ అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ సెంటర్‌ (ఐఎఫ్‌ఎస్‌సీ) ఎక్స్ఛేంజీ ఉంది.     (టీ స్టాల్‌ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement