ఆటోమొబైల్ దిగ్గజం కేటీఎం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల ర్యాలీలో దూసుకొస్తోంది. త్వరలోనే ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకు రానుంది. బజాజ్ సహకారంతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తోంది.
ఈ ఏడాది చివర్లో ఇటలీ మిలాన్‌లో జరగనున్న ఈఐసీఎంఏ షోలో దీన్ని ఆవిష్కరించనుందదని భావిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన టెస్ట్ మ్యూల్‌లో ఎటువంటి బ్రాండింగ్ లేనప్పటికీ, కేటీఎం లివరీతో కూడిన జాకెట్‌తో రైడర్ ఉండటంతో ఈ స్కూటర్‌ను విదేశాలలో పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. (మహీంద్రా థార్ దెబ్బకి రెండు ముక్కలైన ట్రాక్టర్? వైరల్ వీడియో)
కేటీఎం ఈ-స్కూటర్ సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే కొంచెం పెద్దదిగా ఉండనుంది. విండ్‌స్క్రీన్ కూడా పెద్దగా ఉన్నట్టు తెలుస్తోంది. అల్లాయ్ వీల్స్, TFT డిస్‌ప్లే , ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు, ఎయిర్ డక్ట్, ఫ్రెంట్, రేర్ వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్ ముఖ్య ఫీచర్లుగా కనిపిస్తున్నాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో తేలికపాటి అల్యూమినియం స్వింగార్మ్ , సింగిల్/ డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ సిస్టెంతో లాచ్‌కానుందని అంచనా. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!)
2025 ప్రారంభంలో లాంచ్ కానున్న ఈ కేటీఎం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బజాజ్ చకాన్ ప్లాంట్‌లో చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ధరలపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.
Comments
Please login to add a commentAdd a comment