![TVS launched High Speed Scooter In India - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/7/TVS.jpg.webp?itok=Gd8lqP0P)
ముంబై: టీవీఎస్ మోటార్ మంగళవారం ఎన్‌టార్క్ 125సీసీ రేస్ ఎక్స్‌పీ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. తెలంగాణలో ఎక్స్ షోరూంలో దీని ధర రూ.89,192 గాఉంది. 125 సీసీ సిగ్మెంట్‌లో 10 పీఎస్ పైగా పవర్‌తో భారత్‌లో రూపొందిన ఏకైక స్కూటర్ ఇదే అని కంపెనీ తెలిపింది. రేస్, స్ట్రీట్ అనే రెండు డ్రైవింగ్ మోడ్ ఆప్షన్లను కలిగి ఉంది.
ఎన్‌టార్క్ 125సీసీ రేస్ ఎక్స్‌పీ బైక్‌లో అధునాత ఫీచర్లను టీవీఎస్ జత చేసింది. అందులో వాయిస్ అసిస్టెంట్, కనెక్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ రేస్ మోడల్‌లో గంటకు 98 కిలోమీటర్ల వేగం ప్రయాణిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment