TVS Group
-
స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్
టూవీలర్ మార్కెటింగ్ పరిశ్రమ బలంగా పుంజుకుంటుందని టీవీఎస్ మోటార్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధ హల్దార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వీటికి గిరాకీ పెరుగుతుందని, రుతుపవనాలు ఆశించిన మేర వస్తుండడంతో వ్యయ సామర్థ్యం పెరిగి వినియోగదారుల సంఖ్య అధికమవుతుందన్నారు. ప్రధానంగా గ్రామాల్లో స్కూటర్లకు డిమాండ్ హెచ్చవుతుందని తెలిపారు.అనిరుద్ధ హల్దార్ మాట్లాడుతూ..‘స్కూటర్లకు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామాలకు చెందినవారే టూవీలర్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ పరిశ్రమలో స్కూటర్ సెగ్మెంట్ 32 శాతం వాటాను కలిగి ఉంది. రుతుపవనాలు ఆశించినమేర వస్తుండడంతో వినియోగదారులు ద్విచక్రవాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. రాబోయే పండుగ సీజన్లో విక్రయాలు పెరగనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వీటి అమ్మకాల్లో సుమారుగా 13 శాతం వృద్ధి నమోదైంది’ అన్నారు.ఇదీ చదవండి: పెచ్చురిల్లుతున్న ఆర్థిక అంతరాలు!‘గతంలో బైక్ వాడిన యూజర్లు స్కూటర్ కొనుగోలు చేయాలంటే మైలేజీ, వాహన ఖరీదు వంటి అంశాలు అడ్డంకిగా ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. మైలేజీతోపాటు అధునాతన టెక్నాలజీను అందిస్తున్నారు. టూవీలర్ అనేది ప్రస్తుతం సాధారణంగా అందరి వద్ద ఉండాల్సిన వస్తువుగా మారింది. ప్రభుత్వాలు కూడా మౌలిక సదుపాయాల వృద్ధిలో భాగంగా రోడ్లను మెరుగుపరుస్తున్నాయి. దాంతో వీటిని మరింత సౌకర్యంగా నడిపే అవకాశం ఉంది’ అని తెలిపారు. -
ప్రముఖ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల రీకాల్
టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఐకూబ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. జులై 10, 2023 నుంచి సెప్టెంబర్ 9, 2023 మధ్య తయారు చేసిన వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..‘ప్రోయాక్టివ్ ఇన్స్పెక్షన్’ కోసం ఐకూబ్ మోడల్ ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేస్తున్నారు. వాహనాల సామర్థ్యం ఎలాఉందో నిర్థారించుకోవడానికి బ్రిడ్జ్ ట్యూబ్‌ను తనిఖీ చేయనున్నారు. అందులో ఏదైనా సమస్యలుంటే కస్టమర్లకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగానే సర్వీసు చేస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకు సంబంధించి డీలర్ భాగస్వాములు వ్యక్తిగతంగా కస్టమర్లను సంప్రదిస్తారని సంస్థ పేర్కొంది. -
టీవీఎస్‌తో జతకట్టిన అమెజాన్ ఇండియా.. 2025 నాటికి అదే టార్గెట్!
భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలను బలోపేతం చేయడానికి టీవీఎస్ మోటార్ కంపెనీ అమెజాన్ ఇండియాతో చేతులు కలిపింది. వివిధ అమెజాన్ నెట్వర్క్, లాజిస్టిక్స్ విభాగాలలో ఈవీ(EV) వినియోగ కేసులను పరిశీలించడానికి ఈ రెండు కంపెనీలు కలిసి పని చేయనున్నాయి. పారిస్ ఒప్పందానికి ప్రకారం 2040 నాటికి జీరో కార్బన్‌ను సాధించాలనే నిబద్ధతలో భాగంగా అమెజాన్ ఈ ప్రయత్నాలను చేస్తోంది. అందుకోసం 2025 నాటికి 10,000 ఈవీలను డెలివర్ చేసే దిశగా అమెజాన్ ఇండియా ప్లాన్ చేస్తోంది. టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఎనిమిది త్రైమాసికాల వ్యవధిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రీ-వీలర్ల వాహనాల పూర్తి పోర్ట్‌ఫోలియోను మార్కెట్లో విడుదలకు సన్నాహాలు చేస్తోంది. తద్వారా భారత్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో కంపెనీ తన ఉనికిని విస్తరించడంతో పాటు బలోపేతం చేయాలని భావిస్తోంది. -
టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. ఆహా అనేలా ఫీచర్లు, లుక్ కూడా అదిరిందయ్యా!
యువతను తన వైపుకు తిప్పుకొని రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొట్టిన టీవీఎస్ అపాచీ (Tvs Apache) మోడల్ బైకులకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఆ సంస్థ కొత్తగా రెండు అపాచీ మోడళ్లను లాంచ్ చేసింది. ఒకటి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160( 2022 TVS Apache RTR 160), రెండోది టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 (TVS Apache RTR 180) మోడల్. RTR 160 ధర రూ 1.18 లక్షలు కాగా RTR 180 ధర 1.31 లక్షలు నుంచి ప్రారంభం అవుతుంది. కొత్తగా రాబోతున్న ఈ రెండు మోటార్‌సైకిళ్లలో రిఫ్రెష్డ్ డిజైన్, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ (SmartXonnect) చేయబడిన టెక్నాలజీతో పాటు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. అంతేకాక రెయిన్, అర్బన్, స్పోర్ట్ పేరుతో మూడు విభిన్న డైవింగ్ మోడ్లు ప్రత్యేక ఫీచర్‌గా చెప్పాలి. ఫీచర్లు ఇవే: 2022 TVS Apache RTR 160.. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 159.7 cc ఎయిర్-కూల్డ్ ఇంజన్, 16.04 PS పవర్, 13.85 Nm టార్క్ డెలివర్ చేస్తుంది. 2022 TVS Apache RTR 180.. 5-స్పీడ్ గేర్‌బాక్స్, 17PS పవర్, 15 Nm టార్క్‌తో 177.4cc ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. వీటిలో..ఫ్యూయల్ ఇంజెక్షన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, స్లిప్పర్ క్లచ్‌లతో పాటు రీడిజైన్ చేయబడిన ఎల్ఈడీ (LED) హెడ్‌ల్యాంప్ కూడా ఉంది. అధునాతన బ్లూటూత్‌తో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తున్నాయి. గేర్ పొజిషన్ ఇండికేటర్, టీవీఎస్ కనెక్ట్ యాప్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 సిరీస్ గ్లోస్ బ్లాక్, పెరల్ వైట్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుండగా, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 సిరీస్‌లో గ్లోస్ బ్లాక్, పెరల్ వైట్, రేసింగ్ రెడ్, మ్యాట్ బ్లూ, టీ-గ్రే వంటి ఐదు వేరియంట్ కలర్స్‌లో లభ్యమవుతుంది. చదవండి: రూ.17వేల కోట్ల నష్టం.. ఇలా అయితే గాల్లోకి ఎగరడం కష్టమే! -
స్కూటీ అమ్మకాల్లో టీవీఎస్ రికార్డ్ !
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీవీఎస్ మోటార్ కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఎలక్ట్రిక్ వాహనాల హవాలోనూ తన సత్తా చాటింది. ముఖ్యంగా స్కూటీ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. దీంతో స్కూటీ అమ్మకాలు 50 లక్షల యూనిట్లను దాటి కొత్త మైలురాయిని అధిగమించినట్టయ్యింది. ఈటీఎఫ్ఐ ఎకోథ్రస్ట్ టెక్నాలజీతో 87.8 సీసీ ఇంజన్‌తో ఇది తయారైంది. ఫోర్ స్ట్రోక్ సింగిల్ సిలిండర్, 6.5 ఎన్ఎం టార్క్, 4 కిలోవాట్ పవర్, పేటెంటెడ్ ఈజీ స్టాండ్ టెక్నాలజీ, టెలిస్కోపిక్ సస్పెన్షన్, డీఆర్ఎల్ ఎల్ఈడీ ల్యాంప్స్, 4.2 లీటర్ల సామర్థ్యంతో ఇంధన ట్యాంక్ పొందుపరిచారు. అయిదు రంగుల్లో లభిస్తుంది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర మోడల్‌నుబట్టి రూ.56–59 వేల మధ్య ఉంది. -
ఈవీ స్కూటర్... ఎన్ని డబ్బులు ఆదా చేస్తుందో తెలుసా ?
పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. లీటరు పెట్రోలు ధర సెంచరీ దాటి పరుగులు పెడుతోంది. బండి బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఐదు వందల రూపాయల నోటు ఇచ్చినా ఐదు లీటర్ల పెట్రోలు కూడా రావట్లేదు. దీంతో పెట్రోలు బండ్లకు ప్రత్యామ్నాయంగా ఈవీ స్కూటర్లను పరిశీలిస్తున్నారు. అయితే ఈవీ స్కూటర్ల వల్ల కలిగే ప్రయోజనం ఎంత అనే సందేహం చాలా మంది మదిలో మెదులుతోంది. ఈ సందేహాలకు ‘ఆటోకార్’ ఇలా సమాధానం ఇచ్చింది. టీవీఎష్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల మైలేజీ, మెయింటనెన్స్ తెలుసుకునేందుకు టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ని పరిశీలనలోకి తీసుకున్నారు. టీవీఎస్ ఐక్యూబ్‌లో 2.2 కిలోవాట్ లిథియమ్ ఐయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఈ బ్యాటరీ ఫుల్ చార్జ్ అయ్యేందుకు ఐదు గంటల సమయం తీసుకుంటుంది. పవర్ మోడ్‌లో 48 కిలోమీటర్ల మైలేజీ ఏకోమోడ్లో 74 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అయితే ఏకోమోడ్లో ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 48 కిలోమీటర్లుగా ఉంది. 30 పైసలు బ్యాటరీని ఫుల్ చార్జ్ చేసి కంపెనీ సూచనల మేరకు టైర్లలో ఎయిర్ నింపి సిటీ రోడ్లపై ఏకో, పవర్ మోడ్లలో పరుగులు తీయించగా... సగటున ఒక కిలోమీటరు ప్రయాణానికి 30 పైసలు ఖర్చు వచ్చింది. ఇదే సమయంలో లీటరు పెట్రోలు ధర రూ.107ని తీసుకుంటే పెట్రోలు ఇంజను స్కూటరు ప్రయాణానికి ఒక కిలోమీటరకు రూ. 1.80 వంతున ఖర్చు వస్తున్నట్టు ఆటోకారు పేర్కొంది. 10 వేలకు 15 వేలు ఆదా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లీటరు పెట్రోలు ధర, యూనిట్ కరెంటు ఛార్జీలను పరిగణలోకి తీసుకుని పెట్రోలు స్కూటరు, ఈవీ స్కూటర్లను పరిశీలిస్తే... పది వేల కిలోమీటర్లు తిరిగే సరికి ఎలక్ట్రిక్ వెహికల్ కేవలం పెట్రోలు రూపంలోనే రూ. 15,000 పెట్రోలు ఆదా చేసేందుకు తోడ్పడుతోంది. ఇక 50,000 కి.మీ ప్రయాణం పూర్తి చేసే సరికి రూ. 75,000ల వరకు మిగులు ఉంటున్నట్టు ఆటోకార్ తెలిపింది. పైగా ఈవీ వెహికల్స్‌కి ఆయిల్ ఛేంజ్, ఫిల్టర్లు ఇలా మెయింటనెన్స్ ఖర్చు కూడా తక్కువే. ఈవీకి డిమాండ్ పెట్రోలు రేట్లు పెరిగిపోతుండటంతో ఈవీ స్కూటర్లకు దేశంలో డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే పలు బ్రాండ్లు ఈవీలను మార్కెట్లోకి తీసుకురాగా.. ఓలా స్కూటర్‌కి అయితే ప్రీ బుకింగ్స్‌లో ప్రపంచ రికార్డు సాధించింది. -
టీవీఎస్ నుంచి హై స్పీడ్ స్కూటర్
ముంబై: టీవీఎస్ మోటార్ మంగళవారం ఎన్‌టార్క్ 125సీసీ రేస్ ఎక్స్పీ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. తెలంగాణలో ఎక్స్ షోరూంలో దీని ధర రూ.89,192 గాఉంది. 125 సీసీ సిగ్మెంట్లో 10 పీఎస్ పైగా పవర్‌తో భారత్‌లో రూపొందిన ఏకైక స్కూటర్ ఇదే అని కంపెనీ తెలిపింది. రేస్, స్ట్రీట్ అనే రెండు డ్రైవింగ్ మోడ్ ఆప్షన్లను కలిగి ఉంది. ఎన్‌టార్క్ 125సీసీ రేస్ ఎక్స్పీ బైక్‌లో అధునాత ఫీచర్లను టీవీఎస్ జత చేసింది. అందులో వాయిస్ అసిస్టెంట్, కనెక్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ రేస్ మోడల్లో గంటకు 98 కిలోమీటర్ల వేగం ప్రయాణిస్తుంది. -
టీవీఎస్ బాస్‌పై సంచలన ఆరోపణలు
సాక్షి, చెన్నై: తమిళనాట పవిత్ర విగ్రహాల మాయం, చోరీ కేసులో కీలక పరిణామం చేసుకుంది. రెండు ప్రధాన ఆలయాల్లో విగ్రహాల మాయంపై హైకోర్టు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో టీవీఎస్ చైర్మన్, ఎండీ వేణు శ్రీనివాసన్ ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కేసు నమోదు, అరెస్ట్‌కు అవకాశం ఉందన్న అంచనాలతో కోర్టులో పిటిషన్ వేశారు. విగ్రహాల చోరీ కేసులకు సంబంధించిన పిటిషన్‌ను జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ పీడీ అదికేశవులతో కూడిన స్పెషల్ డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. ఆరు వారాలపాటు ఆయనను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అనంతరం, శ్రీనివాసన్ ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆరు వారాలకు వాయిదా వేశారు. ప్రస్తుతానికి శ్రీనివాసన్‌కు ఊరట లభించింది. మరోవైపు కేవలం కాపాలీశ్వర్ భక్తుడిగా తాను ఆలయ వృద్ది కోసం వ్యక్తిగత నిధులను భారీగా వెచ్చించానని పిటిషన్లో శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఆలయ పెయింటింగ్, ఇతర పునర్నిర్మాణ ఖర్చుల కోసం 70 లక్షల రూపాయలను వెచ్చించినట్టు కోర్టుకు తెలిపారు. అంతకుమించి తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అలాగే శ్రీరంగం ఆలయ పునర్నిర్మాణం కోసం ఆలయ ఛైర్మన్‌గా వ్యక్తిగతంగా 25 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు వెల్లడించారు. అలాగే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో 100 ఆలయాలను పునర్నిర్మాణం పూర్తిచేసినట్టు శ్రీనివాసన్ పేర్కొన్నారు. జూలై 28న మద్రాసు హైకోర్టు సమర్పించిన అఫిడవిట్లో వేణు శ్రీనివాసన్ పేరును ఎలిఫెంట్ రాజేంద్రన్ ప్రస్తావించారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. అందుకే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్టు చెప్పారు. తిరుచ్చికి చెందిన రంగజరాన్ నరసింహన్, చెన్నైకి చెందిన ఎలిఫెంట్ రాజేంద్రన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీరంగం ఆలయం నుంచి పవిత్రమైన అనేక పురాతన కళాఖండాలు చోరీకి గురయ్యాయనీ, ఆలయంలోని ప్రధాన పెరుమాళ్(విష్ణుమూర్తి) విగ్రహం దెబ్బతిందని ఫిర్యాదుదారులు ఆరోపించారు. అలాగే కపాలీశ్వర్ ఆలయంలో శివుడిని పూజించే నెమలి(పార్వతిదేవి ప్రతిరూపంగా భావించే) ప్రతిమను మార్చివేశారని ఆరోపించారు. 2004లో ఆయన పునరుద్ధరణ కార్యక్రమంలో వీటిని రాత్రికి రాత్రే తారుమారు చేశారనేది పిటిషన్ దారుల ప్రధాన ఆరోపణ. కాగా 2004లో తమిళనాడులోని దేవాలయాలలో కుంభాభిషేకం నిర్వహణకు నియమించిన ప్రభుత్వ కమిటీ(ఆలయ పునరుద్ధరణ కమిటీ)లో వేణు శ్రీనివాసన్ సభ్యుడిగా ఉన్నారు. అలాగే శ్రీరంగం ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా కూడా ఆయన ఉన్నారు. ఇక్కడ కుంభాభిషేకం నిర్వహణలో కూడా ఈయన భాగం. తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాలు, చెన్నైశివారు ప్రాంతంలో మైలాపూర్‌లోని కపాలీశ్వర, శ్రీరంగం ఆలయాల విగ్రహాలు, ఇతర పురాతన వస్తులు మాయం కేసులో విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశించిన మరోసటి రోజే శ్రీనివాసన్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు టీవీఎస్ ట్రస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా తమిళనాడులోని అనేక పురాతన ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధికి సహాయ సహకారాలందించే శ్రీనివాసన్‌పై తాజా ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. -
అమెరికా వర్సిటీ పోటీలో కౌశిక్ వర్మ ఫస్టు
మామిడికుదురు (పి.గన్నవరం): అమెరికాలోని ఏఆర్ఎం యూనివర్సిటీ, టీవీఎస్ కంపెనీ ఇటీవల సంయుక్తంగా నిర్వహించిన ఏఆర్ఎం డిజైన్ ఛాలెంజ్ పోటీలో పాశర్లపూడికి చెందిన రుద్రరాజు కౌశిక్ వర్మ తయారు చేసిన అటానమస్ వాహనానికి మొదటి బహుమతి లభించింది. ఇతడి తండ్రి, టీవీ నటుడు రుద్రరాజు ప్రసాదరాజు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. చెన్నై శకుంతల అమ్మాళ్ (ఎస్ఏ) ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న కౌషిక్ వర్మ సొంత అలోచనతో అటానమస్ వాహనం రూపొందించాడని చెప్పారు. డ్రైవర్ లేకుండా నిర్దే శించిన ప్రాంతానికి చేరుకోవడం ఈ వాహనం ప్రత్యేకత. మూడు స్టేజిల్లో సెన్సార్స్ సహాయంతో ఈ వాహనం నడుస్తుందన్నారు. సోలార్ ఎనర్జీతో కూడా పని చేయడం దీనిలో ఉన్న మరో ప్రత్యేకత అన్నారు. ఈ ప్రయోగం అనుకున్న విధంగా పనిచేసి నిర్వాహకుల ప్రశంసలు అందుకుందని చెప్పారు. దీంతో అతడికి అవుట్ స్టాండింగ్ వ్యక్తిగత ప్రతిభ అవార్డు రూపేణా రూ.25 వేల ప్రోత్సాహకం, షీల్డు అందజేశారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 200 టీములు ఈ పోటీల్లో తలపడగా తుది పోరులో 17 టీములు నిలిచాయన్నారు. వీటిలో కౌశిక్ వర్మ వాహనం విజేతగా నిలిచిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన అతడిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. కౌశిక్ సొంత ఊరు అల్లవరం మండలం గోడిపాలెం కాగా పాశర్లపూడిలోని తాతయ్య ఇంట్లో ఉంటాడు. -
టీవీఎస్ లాజిస్టిక్స్‌లో 1,000 కోట్ల పెట్టుబడులు
చెన్నై: టీవీఎస్ గ్రూప్‌కు చెందిన థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థ, టీవీఎస్ లాజిస్టిక్స్ సర్వీసెస్‌లో కెనడాకు చెందిన రెండో అతి పెద్ద పెన్షన్ ఫండ్, సీడీపీక్యూ రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నది. తమ సంస్థలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన గోల్డ్‌మన్ శాక్స్, కేకేఆర్ వాటాలతో పాటు మరికొంత వాటాను సీడీపీక్యూ కొనుగోలు చేస్తుందని టీవీఎస్ లాజిస్టిక్స్ సర్వీసెస్ ఎండీ, ఆర్. దినేశ్ పేర్కొన్నారు. తమ సంస్థలో గోల్డ్‌మన్ శాక్స్ కంపెనీ 2008 నుంచి రెండు దఫాలుగా రూ.120 కోట్లు, కేకేఆర్ కంపెనీ 2012లో రూ.240 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయని వివరించారు. భవిష్యత్తులో సీడీపీక్యూ మరింతగా ఇన్వెస్ట్ చేయనున్నదని దినేశ్ పేర్కొన్నారు. ఈ సంస్థ ఇప్పటికే ఎడిల్‌వేజ్ ఏఆర్‌సీలో 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. గత ఏడాది రూ.4,200 కోట్ల ఆదాయం సాధించామని, ఈ ఏడాది రూ.5,700 కోట్ల ఆదాయం, మూడు నుంచి ఐదేళ్లలో మూడింతల ఆదాయం సాధించడం లక్ష్యమని వివరించారు. -
మూడు టెక్ స్టార్టప్ లలో టీవీఎస్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: టీవీఎస్ గ్రూప్‌కు చెందిన టీవీఎస్ ఆటోమొబైల్ సొల్యూషన్స్(టీవీఎస్ ఏఎస్ఎల్) సంస్థ మూడు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టింది. కంపెనీ డిజిటల్ ప్రయత్నాల్లో భాగంగా ఈ స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేశామని టీవీఎస్ ఏఎస్ఎల్ వివరించింది. ఇప్పటివరకూ వివిధ టెక్నాలజీ స్టార్టప్‌లలో రూ.75 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టామని టీవీఎస్ ఏఎస్ఎల్ ఈడీ జి.శ్రీనివాస రాఘవన్ చెప్పారు. ఈ కొత్త వ్యాపారాల నుంచి మూడేళ్లలో రూ.250 కోట్ల ఆదాయం లభించగలదని అంచనాలున్నాయని వివరించారు. జాజ్మైరైడ్డాట్కామ్(ప్రయాణికుల, వాణిజ్య, ద్విచక్ర వాహన విడిభాగాలు, యాక్సెసరీలకు సంబంధించిన ఈ-కామర్స్ సంస్థ), ఆటోసెన్స్(టెక్నాలజీ, ఎనలిటిక్స్ ఆధారిత కస్టమర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థ), రెడ్సన్(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రంగంలోని కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ)ల్లో పెట్టుబడులు పెట్టామని పేర్కొన్నారు.