భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సేవలను బలోపేతం చేయడానికి టీవీఎస్ మోటార్ కంపెనీ అమెజాన్ ఇండియాతో చేతులు కలిపింది. వివిధ అమెజాన్ నెట్‌వర్క్, లాజిస్టిక్స్ విభాగాలలో ఈవీ(EV) వినియోగ కేసులను పరిశీలించడానికి ఈ రెండు కంపెనీలు కలిసి పని చేయనున్నాయి.
పారిస్ ఒప్పందానికి ప్రకారం 2040 నాటికి జీరో కార్బన్‌ను సాధించాలనే నిబద్ధతలో భాగంగా అమెజాన్ ఈ ప్రయత్నాలను చేస్తోంది. అందుకోసం 2025 నాటికి 10,000 ఈవీలను డెలివర్ చేసే దిశగా అమెజాన్ ఇండియా ప్లాన్ చేస్తోంది. టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఎనిమిది త్రైమాసికాల వ్యవధిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రీ-వీలర్ల వాహనాల పూర్తి పోర్ట్‌ఫోలియోను మార్కెట్లో విడుదలకు సన్నాహాలు చేస్తోంది. తద్వారా భారత్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో కంపెనీ తన ఉనికిని విస్తరించడంతో పాటు బలోపేతం చేయాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment