టూవీలర్ మార్కెటింగ్ పరిశ్రమ బలంగా పుంజుకుంటుందని టీవీఎస్ మోటార్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధ హల్దార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వీటికి గిరాకీ పెరుగుతుందని, రుతుపవనాలు ఆశించిన మేర వస్తుండడంతో వ్యయ సామర్థ్యం పెరిగి వినియోగదారుల సంఖ్య అధికమవుతుందన్నారు. ప్రధానంగా గ్రామాల్లో స్కూటర్లకు డిమాండ్ హెచ్చవుతుందని తెలిపారు.
అనిరుద్ధ హల్దార్ మాట్లాడుతూ..‘స్కూటర్లకు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామాలకు చెందినవారే టూవీలర్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ పరిశ్రమలో స్కూటర్ సెగ్మెంట్ 32 శాతం వాటాను కలిగి ఉంది. రుతుపవనాలు ఆశించినమేర వస్తుండడంతో వినియోగదారులు ద్విచక్రవాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. రాబోయే పండుగ సీజన్‌లో విక్రయాలు పెరగనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వీటి అమ్మకాల్లో సుమారుగా 13 శాతం వృద్ధి నమోదైంది’ అన్నారు.
ఇదీ చదవండి: పెచ్చురిల్లుతున్న ఆర్థిక అంతరాలు!
‘గతంలో బైక్ వాడిన యూజర్లు స్కూటర్ కొనుగోలు చేయాలంటే మైలేజీ, వాహన ఖరీదు వంటి అంశాలు అడ్డంకిగా ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. మైలేజీతోపాటు అధునాతన టెక్నాలజీను అందిస్తున్నారు. టూవీలర్ అనేది ప్రస్తుతం సాధారణంగా అందరి వద్ద ఉండాల్సిన వస్తువుగా మారింది. ప్రభుత్వాలు కూడా మౌలిక సదుపాయాల వృద్ధిలో భాగంగా రోడ్లను మెరుగుపరుస్తున్నాయి. దాంతో వీటిని మరింత సౌకర్యంగా నడిపే అవకాశం ఉంది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment