Two wheeler company
-
స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్
టూవీలర్ మార్కెటింగ్ పరిశ్రమ బలంగా పుంజుకుంటుందని టీవీఎస్ మోటార్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధ హల్దార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వీటికి గిరాకీ పెరుగుతుందని, రుతుపవనాలు ఆశించిన మేర వస్తుండడంతో వ్యయ సామర్థ్యం పెరిగి వినియోగదారుల సంఖ్య అధికమవుతుందన్నారు. ప్రధానంగా గ్రామాల్లో స్కూటర్లకు డిమాండ్ హెచ్చవుతుందని తెలిపారు.అనిరుద్ధ హల్దార్ మాట్లాడుతూ..‘స్కూటర్లకు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామాలకు చెందినవారే టూవీలర్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ పరిశ్రమలో స్కూటర్ సెగ్మెంట్ 32 శాతం వాటాను కలిగి ఉంది. రుతుపవనాలు ఆశించినమేర వస్తుండడంతో వినియోగదారులు ద్విచక్రవాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. రాబోయే పండుగ సీజన్లో విక్రయాలు పెరగనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వీటి అమ్మకాల్లో సుమారుగా 13 శాతం వృద్ధి నమోదైంది’ అన్నారు.ఇదీ చదవండి: పెచ్చురిల్లుతున్న ఆర్థిక అంతరాలు!‘గతంలో బైక్ వాడిన యూజర్లు స్కూటర్ కొనుగోలు చేయాలంటే మైలేజీ, వాహన ఖరీదు వంటి అంశాలు అడ్డంకిగా ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. మైలేజీతోపాటు అధునాతన టెక్నాలజీను అందిస్తున్నారు. టూవీలర్ అనేది ప్రస్తుతం సాధారణంగా అందరి వద్ద ఉండాల్సిన వస్తువుగా మారింది. ప్రభుత్వాలు కూడా మౌలిక సదుపాయాల వృద్ధిలో భాగంగా రోడ్లను మెరుగుపరుస్తున్నాయి. దాంతో వీటిని మరింత సౌకర్యంగా నడిపే అవకాశం ఉంది’ అని తెలిపారు. -
2022లో విడుదలయ్యే సూపర్ బైక్స్ ఇవే..!
Top Upcoming Bikes To Rock The Indian Two Wheeler Market In 2022: టూవీలర్స్‌లో రాయల్‌ఎన్‌ఫీల్డ్, యెజ్దీ, కేటీఎమ్ బైక్స్ అంటే యువతకు ఎక్కువగా మోజు. యువతను లక్ష్యంగా చేసుకొని పలు టూవీలర్ ఆటోమొబైల్ కంపెనీలు వచ్చే ఏడాది పలు సూపర్ బైక్స్‌తో ముందుకురానున్నాయి. రాబోయే సంవత్సరంలో రాయల్ ఎన్ఫీల్డ్, యెజ్దీ, కేటీఎమ్ బ్రాండ్స్ సరికొత్త బైక్స్‌ను విడుదల చేయనున్నాయి. 2022లో విడుదలయ్యే సూపర్ బైక్స్ పై ఓ లూక్కేద్దాం..! న్యూ-జెన్ కేటీఎమ్ ఆర్సీ390: కేటీఎమ్ బైక్స్ కుర్రకారును ఇట్టే కట్టిపడేసింది. కేటీఎమ్ ఆర్సీ 390 మోడల్‌కు అప్డేట్ వెర్షన్‌గా న్యూజెన్ కేటీఎమ్ ఆర్సీ 390 ముందుకురానుంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ బైక్‌ను కంపెనీ లాంచ్ చేయనున్నుట్లుగా తెలుస్తోంది. యెజ్డీ రోడ్కింగ్ ఏడీవీ: రెట్రో బైక్స్‌లో రాయల్‌ఎన్‌ఫీల్డ్ బైక్స్ తరువాత యెజ్డీ బైక్స్‌కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. త్వరలోనే యెజ్డీ బైక్‌లను రిలీజ్ చేయనున్నుట్లు జావా ఆటోమొబైల్స్ తన సోషల్‌మీడియా ఖాతాలో వెల్లడించింది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350: బుల్లెట్ బైక్స్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వచ్చే ఏడాది రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్‌ను లాంచ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. మెటియోర్ 350తో దగ్గరి పోలికలు ఉన్న విభిన్న స్టైలింగ్, డిజైన్, సెటప్‌లను హంటర్ 350లో రానుంది. ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్ కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. రోడ్-బేస్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్: ఆఫ్ రోడ్ ప్రయాణాలకు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్‌కు ఏ బైక్ సరిలేదు. రోడ్ బేస్డ్ హిమాలయన్ బైక్‌ను వచ్చే ఏడాది రాయల్ ఎన్ఫీల్డ్ రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ షాట్ గన్ లేదా క్లాసిక్ 650: రాయల్ ఎన్ఫీల్డ్ లాంచ్ చేస్తున్న బైక్స్‌లో షాట్‌గన్650 మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 650సీసీ ఇంజిన్ సామర్థ్యంతో వచ్చే క్యూయిజర్ మోడల్‌గా ఈ బైక్ నిలవనుంది. చదవండి: షాకిచ్చిన ఫోక్స్‌వ్యాగన్! సైలెంట్‌గా ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత? -
ప్రపంచంలోనే తొలి కంపెనీగా బజాజ్ ఆటో రికార్డ్
ముంబై, సాక్షి: దేశీ ఆటో రంగ దిగ్గజం బజాజ్ ఆటో సరికొత్త రికార్డును అందుకుంది. తాజాగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. ట్రిలియన్ మార్క్‌ను దాటింది. తద్వారా ప్రపంచంలోనే రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువను సాధించిన తొలి ద్విచక్ర వాహన కంపెనీగా రికార్డు సాధించింది. ఎన్ఎస్ఈలో శుక్రవారం బజాజ్ ఆటో షేరు 1 శాతం బలపడి రూ. 3,479 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,00,670 కోట్లను అధిగమించింది. మార్చి నుంచి జోరు కోవిడ్-19 ప్రభావంతో మార్చి చివర్లో దేశీ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఫలితంగా బజాజ్ ఆటో షేరు సైతం పతనమైంది. తిరిగి మార్కెట్లతోపాటు జోరందుకుంది. వెరసి మార్చి కనిష్టం నుంచి 79 శాతం దూసుకెళ్లింది. ఏడాది కాలాన్ని పరిగణిస్తే 11 శాతం లాభపడింది. మార్చి 24న షేరు ధర రూ. 1,789 దిగువన ఏడాది కనిష్టాన్ని తాకింది. కాగా.. దేశీ ద్విచక్ర వాహన రంగంలో మరో దిగ్గజ కంపెనీ హీరోమోటో కార్ప్ మార్కెట్ విలువ దాదాపు రూ. 62,028 కోట్లు మాత్రమే. ఈ విలువతో పోలిస్తే బజాజ్ ఆటో మార్కెట్ క్యాప్ 63 శాతం అధికంకాగా.. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ ఐషర్ మోటార్స్ విలువకంటే 43 శాతం ఎక్కువకావడం గమనార్హం! ప్రస్తుతం ఐషర్ మోటార్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 69,730 కోట్లుగా నమోదైంది. (మార్కెట్లు భళా- ఈ మూడు కంపెనీలూ స్పీడ్) మూడో పెద్ద కంపెనీ బజాజ్ ఆటో చకన్(పుణే), వలుజ్(ఔరంగాబాద్), పంత్నగర్(ఉత్తరాఖండ్)లో ప్లాంట్లను కలిగి ఉంది. ప్రస్తుతం ప్రపంచ ద్విచక్ర వాహన రంగంలో మూడో పెద్ద కంపెనీగా బజాజ్ ఆటో ఆవిర్భవించింది. త్రిచక్ర వాహన తయారీకి టాప్ ర్యాంకులో నిలుస్తోంది. చకన్లో నాలుగో ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది. ఇందుకు రూ. 650 కోట్లను వెచ్చించనుంది. ఈ ప్లాంటులో ప్రీమియం బైకులు, ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించనున్నట్లు తెలియజేసింది. (కార్ల మార్కెట్లో ఆ 5 కంపెనీలదే హవా) మోటార్ సైకిళ్ల స్పీడ్ మోటార్ సైకిళ్లపై ప్రత్యేక దృష్టి, అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించడం వంటి అంశాల నేపథ్యంలో అత్యంత విలువైన కంపెనీగా రికార్డును సాధించగలిగినట్లు బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొంతకాలంగా ఆటో రంగం నీరసించినప్పటికీ ఎగుమతులు పుంజుకోవడం ద్వారా కంపెనీ వృద్ధి బాటలో సాగినట్లు తెలియజేశారు. పల్సర్, బాక్సర్, ప్లాటినా తదితర బ్రాండ్లతో 70 దేశాలలో కంపెనీ మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది. ఈ బాటలో ప్రస్తుత ఏడాది థాయ్‌లాండ్‌లో, తదుపరి బ్రెజిల్లో అడుగుపెట్టాలని ప్రణాళికలు వేసింది. ద్విచక్ర వాహనాలతోపాటు.. త్రిచక్ర వాహన విక్రయాలలోనూ దేశ, విదేశీ మార్కెట్లలో అమ్మకాలు పెంచుకోవడంపై కంపెనీ తొలి నుంచీ దృష్టిపెట్టి సాగుతున్నట్లు రాజీవ్ తెలియజేశారు. -
యమహా కొత్త బీఎస్–4 వాహనాలు
న్యూఢిల్లీ: టూవీలర్ కంపెనీ యమహా మోటార్ తాజాగా బీఎస్–4 నిబంధనలకు అనువుగా ఉండేటా తన బైక్స్, స్కూటర్ల పోర్ట్‌ఫోలియోను అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో ఎఫ్‌జెడ్ 25, వైజెడ్ఎఫ్–ఆర్15, వైజెడ్ఎఫ్–ఆర్15ఎస్, ఎఫ్‌జెడ్–ఎస్ ఎఫ్ఐ, ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ, ఫజిర్ ఎఫ్ఐ, ఎస్జెడ్ ఆర్ఆర్ బైక్స్ ఉన్నాయి. ఇక ఇది ఇప్పటికే సెల్యుటో 125, సెల్యుటో ఆర్ఎక్స్ బైక్స్‌లో కొత్త వెర్షన్లను మార్కెట్లోకి తెచ్చింది. కంపెనీ అలాగే సైగ్నస్ రే జెడ్ఆర్, సైగ్నస్ రే జెడ్, సైగ్నస్ ఆల్ఫా, ఫాసినో వంటి స్కూటర్లను కూడా బీఎస్–4 నిబంధనలకు అనువుగా అప్‌గ్రేడ్ చేసింది. అన్ని కొత్త వేరియంట్లలో ఆటో హెడ్‌ల్యాంప్–ఆన్ (ఏహెచ్ఓ) ఫీచర్‌ను పొందుపరిచామని కంపెనీ పేర్కొంది.