
Top Upcoming Bikes To Rock The Indian Two Wheeler Market In 2022: టూవీలర్స్‌లో రాయల్‌ఎన్‌ఫీల్డ్, యెజ్దీ, కేటీఎమ్ బైక్స్ అంటే యువతకు ఎక్కువగా మోజు. యువతను లక్ష్యంగా చేసుకొని పలు టూవీలర్ ఆటోమొబైల్ కంపెనీలు వచ్చే ఏడాది పలు సూపర్ బైక్స్‌తో ముందుకురానున్నాయి. రాబోయే సంవత్సరంలో రాయల్ ఎన్‌ఫీల్డ్, యెజ్దీ, కేటీఎమ్ బ్రాండ్స్ సరికొత్త బైక్స్‌ను విడుదల చేయనున్నాయి. 2022లో విడుదలయ్యే సూపర్ బైక్స్ పై ఓ లూక్కేద్దాం..!
న్యూ-జెన్ కేటీఎమ్ ఆర్‌సీ390: కేటీఎమ్ బైక్స్ కుర్రకారును ఇట్టే కట్టిపడేసింది. కేటీఎమ్ ఆర్‌సీ 390 మోడల్‌కు అప్‌డేట్ వెర్షన్‌గా న్యూజెన్ కేటీఎమ్ ఆర్‌సీ 390 ముందుకురానుంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ బైక్‌ను కంపెనీ లాంచ్ చేయనున్నుట్లుగా తెలుస్తోంది.
యెజ్డీ రోడ్‌కింగ్ ఏడీవీ: రెట్రో బైక్స్‌లో రాయల్‌ఎన్‌ఫీల్డ్ బైక్స్ తరువాత యెజ్డీ బైక్స్‌కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. త్వరలోనే యెజ్డీ బైక్లను రిలీజ్ చేయనున్నుట్లు జావా ఆటోమొబైల్స్ తన సోషల్‌మీడియా ఖాతాలో వెల్లడించింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350: బుల్లెట్ బైక్స్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వచ్చే ఏడాది రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్‌ను లాంచ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. మెటియోర్ 350తో దగ్గరి పోలికలు ఉన్న విభిన్న స్టైలింగ్, డిజైన్, సెటప్‌లను హంటర్ 350లో రానుంది. ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్ కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
రోడ్-బేస్డ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్: ఆఫ్ రోడ్ ప్రయాణాలకు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్‌కు ఏ బైక్ సరిలేదు. రోడ్ బేస్డ్ హిమాలయన్ బైక్‌ను వచ్చే ఏడాది రాయల్ ఎన్‌ఫీల్డ్ రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్ గన్ లేదా క్లాసిక్ 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేస్తున్న బైక్స్‌లో షాట్‌గన్650 మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 650సీసీ ఇంజిన్ సామర్థ్యంతో వచ్చే క్యూయిజర్ మోడల్‌గా ఈ బైక్ నిలవనుంది.
చదవండి: షాకిచ్చిన ఫోక్స్‌వ్యాగన్! సైలెంట్‌గా ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత?
Comments
Please login to add a commentAdd a comment