
కేటీఎమ్ కంపెనీ తన 390 డ్యూక్ 2025 బైకును అప్డేట్ చేసింది. ఇప్పుడు ఇందులో క్రూయిజ్ కంట్రోల్ మాత్రమే కాకుండా.. ఇది కొత్త కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది. దీని ధర రూ. 2.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కలిగి ఉండటం వల్ల కేటీఎమ్ 390 డ్యూక్ మరింత టూరింగ్-ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ బైక్ చిన్న అప్డేట్స్ పొందినప్పటికీ ధరలో మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పటికే ఈ బైక్ డీలర్‌షిప్‌లలో కనిపించింది. అంటే అమ్మకానికి వచ్చేసిందన్నమాట.
ఈ బైక్ చూడటానికి.. దాని మునుపటి బైకుల కంటే కొంత భిన్నమైన పెయింట్ స్కీమ్ పొందుతుంది. కాబట్టి ఇది నలుపు రంగులో ఉండటం చూడవచ్చు. కాగా ఇప్పటికే ఈ మోడల్ నారింజ, నీలం రంగులలో ఉంది.
ఇంజిన్, పర్ఫామెన్స్ వంటి వాటిలో కూడా ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇందులో 399 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 45.3 Bhp పవర్, 39 Nm టార్క్ అందిస్తుంది. పనితీరులో స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment