2023 KTM 390 Adventure Spoke Wheels: కుర్రకారుకు ఎంతో ఇష్టమైన 'కెటిఎమ్ 390 అడ్వెంచర్' KTM 390 Adventure) ఇప్పుడు కొన్ని ఆధునిక హంగులతో దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. ఈ బైక్ ప్రైస్, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతీయ విఫణిలో విడుదలైన కొత్త 'కెటిఎమ్ 390అడ్వెంచర్' ధర రూ. 3.60 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లేటెస్ట్ బైక్ ఇప్పుడు మరింత ఆఫ్ రోడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వైర్-స్పోక్ రిమ్‌లను కలిగి ఉండటం వల్ల మరింత రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
కొత్త మార్పులు..
గతంలో చాలామంది కెటిఎమ్ బైక్ రైడర్లు ఈ వైర్-స్పోక్ రిమ్ ఫీచర్ ఉంటే మరింత గొప్ప రైడింగ్ అనుభూతిని పొందవచ్చని అభిప్రాయం వ్యక్తం చేయడం వల్ల చివరకు కంపెనీ ఆ ఫీచర్ తీసుకువచ్చింది. ఇందులో అల్యూమినియం వైర్-స్పోక్ రిమ్‌లు ఉన్నాయి. ఇవి కూడా ట్యూబ్-టైప్ మెట్‌జెలర్ టూరెన్స్ టైర్‌లను కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
(ఇదీ చదవండి: భారత్‌లో అరంగేట్రం చేయనున్న ఎక్స్ఎల్7 - ఫీచర్స్‌కి ఫిదా అవ్వాల్సిందే!)
లేటెస్ట్ కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఇప్పుడు అడ్జస్టబుల్ సస్పెన్షన్ కూడా కలిగి ఉంటుంది. అయితే ఫోర్క్ కంప్రెషన్ అండ్ రీబౌండ్ కోసం మాత్రమే అడ్జస్టబుల్ ఉంటుంది. కానీ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ లేదు. అదే సమయంలో 10 స్టెప్ ఫ్రీలోడ్ & 20 స్టెప్ రీబౌండ్ అడ్జస్ట్ పొందుతుంది. ఈ కొత్త మార్పులు మాతర్మే కాకుండా ఈ బైక్ ఇప్పుడు కొత్త ర్యాలీ ఆరెంజ్ కలర్ ఆప్షన్‍లో కూడా లభిస్తుంది.
(ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్‌గా మారిన ఇంజినీర్.. సంపాదన రూ. 50 లక్షల కంటే ఎక్కువే!)
డిజైన్, ఫీచర్స్ కూడా దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. ఇంజిన్ విషయానికి ఇందులో 373 సిసి 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 42.9 bhp పవర్, 37 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది, కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ఇలాంటి మరిన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి
Comments
Please login to add a commentAdd a comment