దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుల్లో ఒకటైన ప్యూర్ ఈవీ సంస్థ తన విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. సుస్థిర రవాణా కోసం వినూత్న పరిష్కారాలను పరిచయం చేస్తూ దేశవ్యాప్తంగా ఉనికిని పెంచుకోవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేస్తోంది.
లాంగ్-రేంజ్ స్కూటర్‌లు, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే 30 నెలల్లో 250 కొత్త డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని ప్యూర్ ఈవీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో దేశవ్యాప్తంగా తమ మొత్తం నెట్‌వర్క్‌ను 320కి పైగా పెంచుకోవాలని యోచిస్తోంది.
నూతన ఆవిష్కరణలు, వాహనదారుల భద్రతకు తమ కంపెనీ కట్టుబడి ఉంటుందని ప్యూర్ ఈవీ వ్యవస్థాపకుడు, ఎండీ డాక్టర్ నిశాంత్ దొంగరి తెలిపారు. నానో పీసీఎం (ఫేజ్ చేంజ్ మెటీరియల్) టెక్నాలజీని బ్యాటరీ సిస్టమ్‌లలో ఉపయోగించిన మొదటి కంపెనీ తమదే అని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీతో ప్రమాదాల శాతం తగ్గడమే కాకుండా బ్యాటరీల సామర్థ్యం కూడా పెరిగిందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment