ప్రముఖ కంపెనీ ఎలక్ట్రిక్‌ వాహనాల రీకాల్‌ TVS Motor Company has issued a recall for a specific batch of iQube electric two-wheelers. Sakshi
Sakshi News home page

ప్రముఖ కంపెనీ ఎలక్ట్రిక్‌ వాహనాల రీకాల్‌

Published Sat, Jun 8 2024 3:13 PM | Last Updated on Sat, Jun 8 2024 3:35 PM

TVS Motor Company recalled a select set of iQube electric two wheeler units

టీవీఎస్‌ మోటార్ కంపెనీ తన ఐకూబ్‌ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. జులై 10, 2023 నుంచి సెప్టెంబర్ 9, 2023 మధ్య తయారు చేసిన వాహనాలను రీకాల్‌ చేస్తున్నట్లు తెలిపింది.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..‘ప్రోయాక్టివ్ ఇన్స్పెక్షన్’ కోసం ఐకూబ్‌ మోడల్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలను రీకాల్‌ చేస్తున్నారు. వాహనాల సామర్థ్యం ఎలాఉందో నిర్థారించుకోవడానికి బ్రిడ్జ్ ట్యూబ్‌ను తనిఖీ చేయనున్నారు. అందులో ఏదైనా సమస్యలుంటే కస్టమర్లకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగానే సర్వీసు చేస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకు సంబంధించి డీలర్ భాగస్వాములు వ్యక్తిగతంగా కస్టమర్లను సంప్రదిస్తారని సంస్థ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement