టీవీఎస్ లాజిస్టిక్స్లో 1,000 కోట్ల పెట్టుబడులు | Canadian fund CDPQ pumps in Rs 1000 cr into TVS logistics arm | Sakshi
Sakshi News home page

టీవీఎస్ లాజిస్టిక్స్లో 1,000 కోట్ల పెట్టుబడులు

Published Thu, Oct 20 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

టీవీఎస్ లాజిస్టిక్స్లో 1,000 కోట్ల పెట్టుబడులు

టీవీఎస్ లాజిస్టిక్స్లో 1,000 కోట్ల పెట్టుబడులు

చెన్నై: టీవీఎస్ గ్రూప్‌కు చెందిన థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థ, టీవీఎస్ లాజిస్టిక్స్ సర్వీసెస్‌లో కెనడాకు చెందిన రెండో అతి పెద్ద పెన్షన్ ఫండ్,  సీడీపీక్యూ రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నది. తమ సంస్థలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన గోల్డ్‌మన్ శాక్స్, కేకేఆర్ వాటాలతో పాటు మరికొంత వాటాను సీడీపీక్యూ కొనుగోలు చేస్తుందని టీవీఎస్ లాజిస్టిక్స్ సర్వీసెస్ ఎండీ, ఆర్. దినేశ్ పేర్కొన్నారు.

తమ సంస్థలో గోల్డ్‌మన్ శాక్స్ కంపెనీ 2008 నుంచి రెండు దఫాలుగా రూ.120 కోట్లు, కేకేఆర్ కంపెనీ 2012లో రూ.240 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయని వివరించారు. భవిష్యత్తులో  సీడీపీక్యూ మరింతగా ఇన్వెస్ట్ చేయనున్నదని దినేశ్ పేర్కొన్నారు. ఈ సంస్థ ఇప్పటికే ఎడిల్‌వేజ్ ఏఆర్‌సీలో 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. గత ఏడాది రూ.4,200 కోట్ల ఆదాయం సాధించామని, ఈ ఏడాది రూ.5,700 కోట్ల ఆదాయం, మూడు నుంచి ఐదేళ్లలో మూడింతల ఆదాయం  సాధించడం లక్ష్యమని వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement