న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ సర్వీసులను 26 గిగాహెట్జ్ మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్‌లో ఆవిష్కరించినట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వెల్లడించింది. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో 2 జీబీపీఎస్ (సెకనుకు గిగాబిట్స్) స్పీడ్‌ను సాధించినట్లు తెలిపింది.
దీనితో దేశవ్యాప్తంగా మొత్తం 22 టెలికం సర్కిళ్లలోని జియో కస్టమర్లు .. 26 గిగాహెట్జ్ వేవ్ అధారిత బిజినెస్ కనెక్టివిటీని పొందుతున్నారని జియో వివరించింది. దాదాపు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా, పూర్తి సామర్ధ్యంలో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించేందుకు మిల్లీమీటర్ వేవ్ ఉపయోగపడగలదని తెలిపింది.
తమకు నిర్దేశించిన గడువులోగానే 22 టెలికం సర్కిళ్లలో కనీస స్థాయిలో సర్వీసులను ప్రారంభించాలన్న నిబంధనను అమలు చేయగలిగినట్లు జియో తెలిపింది. 5జీని అత్యంత వేగంగా అందుబాటులోకి తెచ్చిన సందర్భాల్లో ఇది కూడా ఒకటని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment