కుమార్తె మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకొని రోదిస్తున్న తల్లి
కామేపల్లి (పిడుగురాళ్ల రూరల్): అతివేగానికి చిన్నారి బలైపోయింది. పండుగ సెలవులకని అమ్మమ్మ ఇంటికి వెళ్లి రెండు రోజులు ఆనందంగా గడిపి తిరిగి వస్తున్న చిన్నారిని కారు రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటన వుండలంలోని కామేపల్లిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. మాచవరం నుంచి పిడుగురాళ్ల వైపు వెళుతున్న ఆటోను కామేపల్లి గ్రామం వద్ద పిడుగురాళ్ల వైపు నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఘటనలో నకరికల్లు మండలం ఈదులపేటకు చెందిన నాగుల్‌మీరా, నన్నెల దంపతుల చిన్న కువూర్తె షభానా(5) అక్కడికక్కడే మృతి చెందింది. అదే ప్రమాదంలో మోర్జంపాడుకి చెందిన వీఆర్వో సర్వేశ్వర, పిడుగురాళ్ళకు చెందిన నాగవ్ము, సక్కుబాయి, నాగబాబు, కృష్ణా జిల్లా బొగ్గవరపుకు చెందిన వెంకటేశ్వర్లు, మండలంలోని తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సుజాత, రవుణమ్మ గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను పిడుగురాళ్ళలోని ఓ ప్రై వేటు వైద్యశాలకు, నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.