సాక్షి, కోలారు: ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా కష్టం తెలియకుండా ఆదుకోవాల్సిన తల్లే నిప్పంటిస్తే చిన్నారుల ప్రాణాలు విలవిలలాడాయి. ముళబాగిలు వద్ద అంజనాద్రి కొండపై బుధవారం తెల్లవారుజామున ఇద్దరు కూతుళ్లపై తల్లి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటనలో మరో కూతురు కూడా ఆస్పత్రిలో మరణించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన తల్లి జ్యోతి కుటుంబ కలహాలతో ఈ అఘాయిత్యానికి పాల్పడడం తెలిసిందే.
తల్లికి కస్టడీ, తండ్రికి విచారణ
తల్లి ఇప్పుడు కోలారు జైలులో జ్యుషియల్ కస్టడీలో ఉంది. మంటల్లో పెద్ద కుమార్తె అక్షయ అక్కడికక్కడే మరణించగా చిన్న కుమార్తె ఉదయశ్రీ బెంగుళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం చనిపోయినట్లు ముళబాగిలు ఎస్‌ఐ మంజునాథ్ తెలిపారు. ఘటనలో ఉదయశ్రీ కి 60 శాతం కాలిన గాయాలు అయ్యాయి. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలిక చివరకు ప్రాణాలు విడిచింది. కాగా జ్యోతి భర్త తిరుమలేశును విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
(చదవండి: తొందరగా వెళ్లాలని పట్టాలు దాటుతోంది..సడెన్‌గా ట్రైయిన్ రావడంతో..)
Comments
Please login to add a commentAdd a comment