
సాక్షి, కర్నూల్: జిల్లాలో దారుణం జరిగింది. తెల్లవారుజామున ఇంటి నుంచి బయల్దేరి వాకింగ్‌కు వెళ్లిన కొడుకుపై తండ్రి కత్తులతో దాడిచేసిన ఘటన ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో హర్షవర్ధన్ అనే యువకుడు తీవ్రగాయాల పాలవ్వగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి శ్రీనివాస ఆచారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment