రూ. 3 వేలకే 4జీ హ్యాండ్‌సెట్! | 4G Handset worth Rs. 3,000 price only | Sakshi
Sakshi News home page

రూ. 3 వేలకే 4జీ హ్యాండ్‌సెట్!

Published Mon, Dec 14 2015 8:43 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM

రూ. 3 వేలకే 4జీ హ్యాండ్‌సెట్!

రూ. 3 వేలకే 4జీ హ్యాండ్‌సెట్!

ఫిబ్రవరికల్లా మార్కెట్‌లోకి: డాటావిండ్
న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీ కంపెనీ డాటావిండ్ త్వరలో అతి తక్కువ ధరలో, పలు ఆఫర్లతో 4జీ మొబైళ్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నది. వీటి ధర రూ.3,000గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్లకు ఏడాది పాటు ఉచిత ఇంటర్నెట్ బ్రౌజింగ్ సదుపాయాన్ని (వీడియోలతో సహా ఇతర ఫైళ్ల డౌన్‌లోడ్‌కు మాత్రం ప్రత్యేక ప్లాన్లను వేసుకోవాలి) అందిస్తున్నట్లు తెలిపింది.

తాము 4జీ పరికరాల విషయమై పలు మొబైల్ ఆపరేటర్లతో మాట్లాడుతున్నామని, ఉచిత 2జీ, 3జీ నెట్ బ్రౌజింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఆర్‌కామ్, టెలినార్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని డాటావిండ్ ప్రెసిడెంట్, సీఈవో సునీత్ సింగ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement