రూ.13 వేలకే.. తొలిసారి 3డీ కర్వ్‌డ్‌ స్మార్ట్‌ఫోన్‌ | itel launches 3D curved smartphone under 15K | Sakshi
Sakshi News home page

రూ.13 వేలకే.. తొలిసారి 3డీ కర్వ్‌డ్‌ స్మార్ట్‌ఫోన్‌

Published Wed, Oct 4 2023 9:05 AM | Last Updated on Wed, Oct 4 2023 10:06 AM

itel launches 3D curved smartphone under 15K - Sakshi

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్‌ (itel) కొత్తగా రూ. 15 వేల లోపు సెగ్మెంట్‌లో తొలిసారి 3డీ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ ఎస్‌23ప్లస్‌ను ఆవిష్కరించింది. బ్యాంక్‌ ఆఫర్లు మొదలైనవన్నీ పరిగణనలోకి తీసుకుంటే దీని ధర రూ. 12,999గా ఉంటుందని ఐటెల్‌ ఇండియా సీఈవో అరిజిత్‌ తాళపత్ర తెలిపారు.

లాంచ్‌ ఆఫర్‌ కింద రూ. 2,399 విలువ చేసే టీ11 ఇయర్‌బడ్స్‌ను ఉచితంగా పొందవచ్చని పేర్కొన్నారు. ఎస్‌23ప్లస్‌ ఫోన్ల అమ్మకాలు అక్టోబర్‌ 6 నుంచి ఈ–కామర్స్‌ సైట్‌ అమెజాన్‌ ఇండియాలో ప్రారంభమవుతాయని అరిజిత్‌ వివరించారు. 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్, 256జీబీ మెమరీ, 16 జీబీ ర్యామ్, 32 ఎంపీ ఫ్రంట్, 50 ఎంపీ రియర్‌ కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement