Amoled Screen
-
రూ.13 వేలకే.. తొలిసారి 3డీ కర్వ్డ్ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (itel) కొత్తగా రూ. 15 వేల లోపు సెగ్మెంట్లో తొలిసారి 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే స్మార్ట్‌ఫోన్ ఎస్23ప్లస్‌ను ఆవిష్కరించింది. బ్యాంక్ ఆఫర్లు మొదలైనవన్నీ పరిగణనలోకి తీసుకుంటే దీని ధర రూ. 12,999గా ఉంటుందని ఐటెల్ ఇండియా సీఈవో అరిజిత్ తాళపత్ర తెలిపారు. లాంచ్ ఆఫర్ కింద రూ. 2,399 విలువ చేసే టీ11 ఇయర్‌బడ్స్‌ను ఉచితంగా పొందవచ్చని పేర్కొన్నారు. ఎస్23ప్లస్ ఫోన్ల అమ్మకాలు అక్టోబర్ 6 నుంచి ఈ–కామర్స్ సైట్ అమెజాన్ ఇండియాలో ప్రారంభమవుతాయని అరిజిత్ వివరించారు. 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్, 256జీబీ మెమరీ, 16 జీబీ ర్యామ్, 32 ఎంపీ ఫ్రంట్, 50 ఎంపీ రియర్ కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
2017లో అన్నీ 'గ్లాస్' ఐఫోన్లేనట!
2016 యాపిల్ కు ఊహించని విధంగా షాకులిచ్చింది. ఎన్ని కొత్త ఫీచర్స్ ను తీసుకొచ్చి ఐఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టినా పెద్దగా కలిసి రాలేదు. వినియోగదారులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ నేఫథ్యంలోనే ఎలాగైనా 2017 మార్కెట్ ను ఏలేలా చేయాలని యాపిల్ నిర్ణయించింది. మార్కెట్లో లభించే స్మార్ట్ ఫోన్ డిజైన్లకు విభిన్నంగా తన ప్రొడక్ట్ ఉండేలా ప్లాన్స్ చేస్తోంది. ఇప్పటివరకూ అల్యూమినియం డిజైన్లతో రూపొందిన ఐఫోన్లను, పూర్తిగా గ్లాస్ తో వినూత్నంగా డిజైన్ చేసి, యూజర్లను ఆకట్టుకొని, మార్కెట్లను కొల్లగొట్టాలని యాపిల్ ప్రణాళికలు రచిస్తోంది. కొత్త స్మార్ట్ ఫోన్ల మెటిరీయల్ గా గ్లాస్ ను యాపిల్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. దీనికి ఎమ్మోల్డ్ స్ర్కీన్ ప్యానెల్‌ను వాడనున్నారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. 2017లో మార్కెట్లోకి విడుదలయ్యే ప్రతి ఐఫోన్ గాజుతో రూపొందనుందని కేజీఐ సెక్యూరిటీస్ ఎనాలిస్ట్ మింగ్-చి క్యూ తెలిపారు. చాలా కంపెనీల స్మార్ట్ ఫోన్ల రూపకల్పన అల్యూమినియంతో జరుగుతుండగా.. మార్కెట్లో తనకంటూ ఓ గుర్తింపు కోసం గ్లాస్ వాడుతున్నారని సమాచారం. ఈ ఏడాది విడుదల చేయబోయే యాపిల్ కొత్త ఐఫోన్ 7ను మాత్రం పాత డిజైన్ తోనే మార్కెట్లోకి ప్రవేశపెడతారని క్యూ చెప్పారు. రాబోయే తరానికి సరికొత్త ఐఫోన్లను యాపిల్ అందించేందుకే ప్రధానంగా డిజైన్లలో మార్పులు చేస్తోంది. మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త ఐఫోన్లకు కూడా బ్రాండ్ పేరును రొటీన్ కు భిన్నంగా ఉండేలా చూస్తుంది. ఇప్పటివరకూ ఐఫోన్ 6 మార్కెట్లోకి వస్తే, తర్వాతి ఐఫోన్ ను 6ఎస్ పేరుతో విడుదల చేసేవారు. ఐఫోన్ 7 విడుదల తర్వాత వచ్చే కొత్త డిజైన్ కు ఐఫోన్ 8గాను లేదా స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన 10 ఏళ్లవుతున్న సందర్భంగా ఐఫోన్ ఎక్స్ గాను నామకరణ చేయనున్నారు.