Itel
-
రూ.13 వేలకే.. తొలిసారి 3డీ కర్వ్డ్ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (itel) కొత్తగా రూ. 15 వేల లోపు సెగ్మెంట్లో తొలిసారి 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే స్మార్ట్‌ఫోన్ ఎస్23ప్లస్‌ను ఆవిష్కరించింది. బ్యాంక్ ఆఫర్లు మొదలైనవన్నీ పరిగణనలోకి తీసుకుంటే దీని ధర రూ. 12,999గా ఉంటుందని ఐటెల్ ఇండియా సీఈవో అరిజిత్ తాళపత్ర తెలిపారు. లాంచ్ ఆఫర్ కింద రూ. 2,399 విలువ చేసే టీ11 ఇయర్‌బడ్స్‌ను ఉచితంగా పొందవచ్చని పేర్కొన్నారు. ఎస్23ప్లస్ ఫోన్ల అమ్మకాలు అక్టోబర్ 6 నుంచి ఈ–కామర్స్ సైట్ అమెజాన్ ఇండియాలో ప్రారంభమవుతాయని అరిజిత్ వివరించారు. 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్, 256జీబీ మెమరీ, 16 జీబీ ర్యామ్, 32 ఎంపీ ఫ్రంట్, 50 ఎంపీ రియర్ కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
ఈ స్మార్ట్ వాచ్ సూపర్! 12 రోజుల బ్యాటరీ బ్యాకప్..
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఐటెల్ భారతదేశంలో తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. తాజగా ఐటెల్ స్మార్ట్‌వాచ్ 2ఈఎస్ (Itel 2ES)ను విడుదల చేసింది. ధర రూ. 1,699లే. బ్లూటూత్ వెర్షన్ 5.3తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ 12 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: ట్రూకాలర్‌లో అదిరిపోయే ఫీచర్.. ఆ మెసేజ్‌లను పసిగట్టేస్తుంది! ఈ స్మార్ట్ వాచ్ ఇంకా మరెన్నో కళ్లుచెదిరే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఉన్న మైక్రోఫోన్ సహాయంతో నేరుగా కాల్స్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.8 అంగుళాల IPS HD డిస్ప్లే ఉంటుంది. ఐటెల్ 2ES స్మార్ట్ వాచ్ ఆకర్షణీయమైన సిటీ బ్లూ, రెడ్, గ్రీన్, వాటర్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఐటెల్ స్మార్ట్‌వాచ్‌లో AI వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. దీంతో యూజర్లు కాల్స్ చేయవచ్చు. మెసేజ్‌లు పంపవచ్చు. వాయిస్ ఆదేశాలను ఉపయోగించి ఇతర స్మార్ట్ గ్యాడ్జెట్లను నియంత్రించవచ్చు. కాల్ ఎనీటైమ్, ఎనీవేర్ ఫీచర్‌తో పాటు, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఈ స్మార్ట్ వాచ్‌లో ఉన్నాయి. మ్యూజిక్, కెమెరా కంట్రోల్ ఉంటాయి. ఎస్సెమ్సెస్‌లు, సోషల్ మీడియా నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి స్మార్ట్ నోటిఫికేషన్ ఆప్షన్ కూడా ఉంది. ఇతర స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే IP68 వాటర్ రెసిస్టెంట్, 1.8 అంగుళాల స్క్రీన్, 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 500 నిట్స్ వరకు బ్రైట్నెస్ వంటివి ఉన్నాయి. ఇక 250mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ వాచ్ గరిష్టంగా 12 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఇది మాగ్నెటిక్ ఛార్జింగ్‌ని కలిగి ఉంటుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
కొత్తగా 3 కోట్ల యూజర్లు లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ ఈ ఏడాది కొత్తగా దాదాపు 3 కోట్ల మంది యూజర్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇది 9 కోట్లుగా ఉందని, దీన్ని సుమారు 12 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఐటెల్ మాతృసంస్థ ట్రాన్షన్ ఇండియా సీఈవో అరిజిత్ తాలపత్ర తెలిపారు. తాజాగా అధిక సామర్థ్యాలు గల ఎ60, పీ40 స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టడం, బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌ను నియమించుకోవడం వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. వ్యాపార విస్తరణ క్రమంలో టీవీలు, ట్యాబ్లెట్లు వంటి విభాగాల్లోకి కూడా ప్రవేశించినట్లు వివరించారు. 5జీ సేవల విస్తరణ నేపథ్యంలో తాము కూడా ఈ ఏడాది మూడు లేదా నాలుగో త్రైమాసికం నాటికి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు అరిజిత్ చెప్పారు. దీని ధర రూ. 10 వేల లోపే ఉంటుందని పేర్కొన్నారు. మేడిన్ ఇండియాపై మరింతగా దృష్టి.: ఫీచర్ ఫోన్లు, అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లను అందించడంపైనా.. దేశీయంగా తయారీపైనా ప్రధానంగా దృష్టి పెడుతున్నామని అరిజిత్ చెప్పారు. దేశీయంగానే లభ్యమయ్యే పరికరాలు, విడిభాగాలను కొనుగోలు చేయడాన్ని పెంచుకుంటున్నట్లు వివరించారు. నోయిడాలో తమకు మూడు తయారీ ప్లాంట్లు ఉన్నాయని, వీటిలో దాదాపు 4,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారని అరిజిత్ చెప్పారు. కోవిడ్‌పరమైన సవాళ్ల కారణంగా కొంతకాలం సెమీకండక్టర్ల కొరత నెలకొన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడిందన్నారు. ప్రస్తుతం రూ. 10 వేల లోపు ఫోన్ల సెగ్మెంట్లో తమకు 25 శాతం పైగా మార్కెట్ వాటా ఉందన్నారు. మొత్తం స్మార్ట్ఫోన్లకు సంబంధించి రూ. 8 వేల లోపు విభాగంలో తాము 12% వాటా దక్కించుకున్నామని అరిజిత్ చెప్పారు. తమ ఆదాయాల్లో దక్షిణాది మార్కెట్ వాటా 20% ఉంటుందని ఆయన చెప్పారు. ట్రాన్షన్ సంస్థ ఐటెల్, ఇన్ఫినిక్స్, టెక్నో బ్రాండ్ల పేరిట మొబైల్ ఫోన్లను విక్రయిస్తోంది. -
తక్కువ ధరలోనే ఐటెల్ 4జి ట్యాబ్ వచ్చేసింది.. వివరాలు
దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు ఐటెల్ కంపెనీ తన మొదటి ట్యాబ్ విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ ట్యాబ్ పేరు 'ఐటెల్ ప్యాడ్ వన్'. దీని ధర రూ.12,999. 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగిన ఈ ట్యాబ్ త్వరలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఐటెల్ ప్యాడ్ వన్ తక్కువ ధరలకు లభించే లేటెస్ట్ ట్యాబ్. ఇది డీప్ గ్రే, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 4జీ కనెక్టివిటీ ఫీచర్ కలిగి, మెటల్ బాడీ పొందుతుంది. 10.1 ఇంచెస్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో ట్యాబ్ ఎడ్జ్‌లు ఫ్లాట్‌గా ఉండటం వల్ల మరింత అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఐటెల్ ప్యాడ్ వన్ ట్యాబ్‌లో యునీఎస్ఓసీ ఎస్సీ9863ఏ1 ప్రాససెర్ ఉంటుంది. మొమరీ కార్డు ద్వారా 512 జీబీ వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు. అంతే కాకుండా, ఇది ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ట్యాబ్‌లో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. కావున ఇది స్టాండర్డ్ 10 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో సింగిల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వైపై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5మిమీ హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ అప్షన్ అవుతుంది. -
తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్‌తో ఐటెల్ ఇయర్ బడ్స్..! ధర ఎంతంటే..?
న్యూఢిల్లీ: స్మార్ట్ గ్యాడ్జెట్స్ బ్రాండ్.. ఐటెల్ కొత్తగా టీ1 ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 1,099గా ఉంటుంది. సంగీతం, ఫిట్నెస్ ప్రియుల కోసం దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు ఐటెల్ బ్రాండ్ మాతృ సంస్థ ట్రాన్షన్ సీఈవో అరిజిత్ తాళపత్ర తెలిపారు. ఒకసారి చార్జి చేస్తే ఒక్కో ఇయర్‌బడ్‌కు 8 గంటల ప్లేబ్యాక్ సమయం ఉంటుందని పేర్కొన్నారు. 350 ఎంఏహెచ్ బ్యాటరీతో శక్తిమంతమైన చార్జింగ్ కేసు, 40 గంటల స్టాండ్‌బై టైమ్ ఉంటుంది. జూక్సెట్ ఎన్53 బీటీ వైర్లెస్ ఇయర్ఫోన్లను కూడా ఐటెల్ ఆవిష్కరించింది. దీని ధర రూ. 799. యువత మెరుగైన ఆడియో అనుభూతిని అందించేందుకు ఇవి ఉపయోగపడగలవని అరిజిత్ వివరించారు. చదవండి: 6జీబీ ర్యామ్, పవర్ఫుల్ బ్యాటరీతో అతి తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్..! -
ఐటెల్ ఆండ్రాయిడ్ టీవీలు వచ్చేశాయ్!
సాక్షి, న్యూఢిల్లీ: జీ సిరీస్ ఆండ్రాయిడ్ టీవీలను ఐటెల్ సంస్థ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని భారత్‌లోనే తయారు చేసినట్టు కంపెనీ ప్రకటించింది. 400 నిట్స్‌తో కూడిన 4కే అల్ట్రా బ్రైట్ డిస్ప్లే, 24 వాట్ స్టీరియో సౌండ్ డాల్బీ ఆడియో, ఫ్రేమ్ పెద్దగా కనిపించని ప్రీమియం డిజైన్, గూగుల్ ప్లేస్టోర్, గూగుల్ అసిస్టెంట్ సాయంతో మాట్లాడుతూ టీవీకి కమాండ్స్ ఇచ్చే సదుపాయాలు ఈ టీవీల్లో ఉన్నాయి. 1జీబీ/8జీబీ, 2జీబీ/8జీబీ సామర్థ్యంతో కూడిన ఈ టీవీలు 60 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటాయి. జీ సిరీస్ కింద కంపెనీ నాలుగు సరికొత్త ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. ఈ టీవీల ధరలు రూ.16,999 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. భారతదేశంలో వీటి ధర, లభ్యత: ఇటెల్ ఇప్పటివరకు అన్ని మోడళ్ల ధరలను ప్రకటించలేదు. 32 అంగుళాల నుంచి 55 అంగుళాల పరిమాణంలో నాలుగు టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటెల్ జీ 3230 ఐఈ ధర రూ. 16,999 ఉండగా, ఇటెల్ జీ 4330 ఐఇ ధర రూ. 28,499. అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. -
ట్రిపుల్ రియర్ కెమెరా ఫోన్ : రూ. 6599
సాక్షి, ముంబై : స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐటెల్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 10 (గో ఎడిషన్) ఆధారిత ఇటెల్ విజన్ 1 ప్రో భారతదేశంలో తీసుకొచ్చింది. గత ఏడాది ఆగస్టులో దేశంలో లాంచ్ చేసిన ఇటెల్ విజన్ 1 కు కొనసాగింపుగా ప్రో వెర్షన్‌ను ఆవిష్కరించింది. 8మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్ తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను తోపాటు,ఫెన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా జోడించామని, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఫోన్‌ను 0.2 సెకన్లలో అన్‌లాక్ అవుతుందని ఇటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐటెల్ విజన్ 1 ప్రో ధర 6,599 రూపాయలు. అరోరా బ్లూ, ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఇది లభ్యం. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుందని అధికారిక వెబ్సైట్ తెలిపింది. ఐటెల్ విజన్ 1 ప్రో ఫీచర్లు 6.52 అంగుళాల హెచ్డీ ప్లస్డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 (గో ఎడిషన్) క్వాడ్‌కోర్ సాక్ 720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 8 మెగాపిక్సెల్ + రెండువీజీఏ సెన్సర్లు ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రూ.1049 లకే ఐటెల్ ఫోన్ : అధ్బుత ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఐటెల్ సంస్థ అద్భుత ఫీచర్లు, అతి తక్కువ ధరలో కొత్త ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రధానంగా కరోనా సంక్షోభ సమయంలో బాడీ టెంపరేచర్‌ను గుర్తించాల్సిన అవసరాన్ని గుర్తించిన తాము ఈ ఫోన్‌ను తీసుకొచ్చామని కంపెనీ వెల్లడించింది. ఐటీ2192టీ థర్మో ఎడిషన్ పేరుతో ఐటెల్ దీన్ని ఆవిష్కరించింది. దీని ధరను కేవలం . రూ .1,049గా నిర్ణయించింది. ఇన్‌బిల్ట్ టెంపరేచర్ సెన్సర్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను మానిటర్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. కోవిడ్ -19 నుండి సురక్షితంగా ఉండటానికి ముందస్తు చర్యగా యూజర్ల శరీర ఉష్ణోగ్రతను ట్రాక్ చేసేలా ఎంట్రీ లెవల్ విభాగంలో దేశంలోనే తొలి ఫీచర్ ఫోన్‌గా ఇది నిలిచింది. అలాగే టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్ ఇందులోని మరో విశేషం. తెలుగుతోపాటు ఎనిమిది భాషలకు ఇది సపోర్ట్ చేస్తుంది. యూజర్లు టెంపరేచర్‌ను గుర్తించేలా ఫోన్లో థర్మో సెన్సార్ ను పొందుపర్చింది. థర్మో బటన్‌ను ఎక్కువసేపు నొక్కి ఉంచితే టెంపరేచర్‌ను రీడ్ చేస్తుంది. సెన్సార్‌ను అరచేతిలో ఉంచుకోవడం లేదా సెన్సార్‌పై టచ్ ఫింగర్‌ను ఉంచితే సెల్సియస్‌లో టెంపరేచర్‌ను చూపిస్తుంది. దీన్ని ఫారెన్‌హీట్‌గా కూడా మార్చుకోవచ్చు. అంతేకాదు టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్ ద్వారా ఇన్కమింగ్ కాల్లు, సందేశాలు, మెనూ వివరాలు మాత్రమే కాకుండా బాడీ టెంపరేచర్ వివరాలను కూడా వినిపిస్తుంది. ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ, గుజరాతీ భాషల్లో దీన్ని వినవచ్చు. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే 4.5 సెం.మీ డిస్ప్లే, 1,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చింది. ఇది సూపర్ బ్యాటరీ మోడ్‌తో 4 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఈ కీప్యాడ్ ఫీచర్ ఫోన్లో వెనుక కెమెరా, రికార్డింగ్ ఆప్షన్‌తో వైర్లెస్ ఎఫ్ఎం, ఆటో కాల్ రికార్డర్, ఎల్ఈడీ టార్చ్, వన్-టచ్ మ్యూట్ , ప్రీ-లోడెడ్ గేమ్స్ఉన్నాయి. వినియోగదారుల ఆరోగ్యం, వినోదం అనే రెండు లక్ష్యాలతో సమాజానికి ఎక్కువ బాధ్యత వహించేలా ఎంట్రీ లెవల్లో అతి తక్కువ ధరలో ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేశామని ఐటెల్ సీఈఓ తలపాత్రా చెప్పారు -
రెడ్మికి షాక్ : చౌక ధరలో స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆధునిక ఫీచర్లు, సరసమైన ధరలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ స్మార్ట్ఫోన్లకు పెట్టింది పేరైన ఐటెల్ కంపెనీ దీన్ని ఆవిష్కరించింది. ఐ టెల్ ఏ 46 పేరుతో దీన్ని ఆవిష్కరించింది. ప్రముఖ మొబైల్ సంస్థ రెడ్మికి చెందిన రెడ్ మి 6ఏ కు పోటీగా నిలుస్తుందని మార్కెట్‌వర్గాలు భావిస్తున్నాయి. భారీ స్క్రీన్, డ్యూయెల్ రియర్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఐటెల్ ఏ46 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతగా కంపెనీ చెబుతోంది. దీని ధరను రూ.4,999గా వెల్లడించింది. ఫోన్‌తోపాటు స్క్రీన్ గార్డ్, బ్యాక్ కేస్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. 1జీబీర్యామ్, 2 జీబీ ర్యామ్ రెండు వేరియంట్లలో నాలుగు రంగుల్లో లభ్యం. అలాగే జియో రూ. 198, 299 ( 24 నెలలపాటు) రీచార్జ్ ప్యాక్‌లపై రూ.1200 ఇన్స్టెంట్ క్యాష్‌బ్యాక్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఐటెల్ ఏ46 ఫీచర్లు 5.45 అంగుళాల డిస్ప్లే 1.6 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 1440 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్ 2 జీబీ ర్యామ్+ 16 జీబీ మెమరీ 128జీబీ వరకు విస్తరించుకనే అవకాశం 8 ఎంపీ+వీజీఏ సెన్సర్ డ్యూయెల్ రియర్ కెమెరా 2400 ఎంఏహెచ్ బ్యాటరీ -
వొడాఫోన్ సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్, క్యాష్‌బ్యాక్
జియో ఫోన్‌కు పోటీగా వొడాఫోన్, ఐటెల్ భాగస్వామ్యంలో కొత్తగా ఓ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఏ20 పేరుతో ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ.3,690 డౌన్‌పేమెంట్‌లో అందుబాటులో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2100 క్యాష్‌బ్యాక్‌ను వొడాఫోన్ ఆఫర్చేస్తోంది. అంటే కేవలం రూ.1,590కే ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు 4జీ కనెక్టివిటీని కూడా పొందవచ్చు. అయితే క్యాష్‌బ్యాక్‌ను పొందడానికి ఏ20 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు వరుసగా 18 నెలల పాటు రూ.150 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా రీఛార్జ్‌లు చేయించుకుంటే, ఏడాదిన్నర తర్వాత రూ.900, ఆ తర్వాత ఏడాదిన్నరకు రూ.1200ను క్యాష్‌బ్యాక్‌గా అందిస్తుంది. యూజర్లు ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని ఎం-పైసా వాలెట్లలో పొందుతారని వొడాఫోన్ పేర్కొంది. వొడాఫోన్-ఇంటెల్ ఏ20 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు... 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ ఆండ్రాయిడ్ 7.0 నోగట్ 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ మెమరీ 1.3గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 1500 ఎంఏహెచ్ బ్యాటరీ -
తక్కువ ధరలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన మరో మొబైల్ తయారీ సంస్థ ఐటెల్ గురువారం బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.6990 ధరకే సెల్ఫీప్రొ ఎస్42 పేరుతో ఓ మొబైల్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నలుపు, బూడిద రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్లో ఆధునిక ఫీచర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది. ఇది వొల్టీ(వీవొఎల్టీఈ) 4జీ స్మార్ట్‌ఫోన్ అని, వినియోగదాలను అమితంగా ఆకట్టుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తింది. సెల్ఫీప్రొ ఎస్42 ఫీచర్లు: 5 అంగుళాల డిస్ప్లే 3 జీబీ రామ్ 16 జీబీ ఇంటర్నల్ మెమరీ 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ 1.25 గిగా హెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ ముందు వెనక 8 మెగా పిక్సెల్ కెమెరా 2700 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ నౌగట్ ఓఎస్ -
ఐడియా: ఆరునెలలు 6జీబీ డేటా ఫ్రీ ...ఎలా?
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ ఆపరేటర్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారీ సంస్థ ఐటెల్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నెలకు 1 జీబీ డ్యాటాను ఆరు నెలలపాటు ఉచితంగా అందించనుంది. అంతేకాదు ఈ ఆఫర్ ఈ రోజునుంచే ( బుధవారం) చెల్లుబాటులోకి రానుందని ప్రకటించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ మొబైల్ టెలికం సేవల సంస్థ ఐడియా ఐటెల్ అందిస్తున్న ఈ ఆఫర్ ఐటెల్‌కు సంబంధించిన ఎంపిక చేసిన కొన్ని స్మార్ట్ ఫోన్ మోడల్స్ లో మాత్రమే అందుబాటులోఉంటుంది. దేశవ్యాప్తంగా పెద్దమొత్తం వినియోగదారులకు దీని మూలంగా లాభం చేకూరనుందనే విశ్వాసాన్ని ఐటెల్ సీఈవో సుధీర్ కుమార్ వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక నిత్యావసరంగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో మన జీవితాలు డిజిటల్ ప్లాట్ ఫాంలోకి మారిపోతున్నాయన్నారు . ఈ క్రమంలో ఐటెల్, ఐడియా యూజర్లకు సరసమైన ధరలో మెరుగైన డిజిటల్ కనెక్టివిటీ అందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ ఆఫర్ పొందాలంటే యూజర్లు ఐటెల్ స్మార్ట్ ఫోన్ల లోని ఐడియా ద్వారా http://i4all.ideacellular.com/offers సైట్‌ను సందర్శించాలని కోరింది. అనంతరం గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేస్తే.. యూజర్ డివైజ్ ఐఎంఈఐ, ఫోన్ నెంబర్ వెబ్ సైట్ గుర్తిస్తుందని తెలిపింది. ఇక్కడ షో మై ఆఫర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి, 1 జీబీ ఆఫర్ ను సెలెక్ట్ చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుందని తద్వారా ఉచిత ఇంటర్నెట్ సేవలను ఆస్వాదించవచ్చని పేర్కొంది. ఈ ప్లాన్ లో మొదటి నెల డాటా పూర్తిగా ఉచితం. ఆ తర్వాత ఆరునెలలు వరుసగా నెలలు 1 జీబీ డాటా ఫ్రీ. అలాగే నెలకు రూ. 50 లేదా అంతకు మించి ప్యాక్‌లు చెల్లించడం ద్వారా అదనపు డేటా, లేదా వాయిస్ కాల్స్‌ను పొందవచ్చని తెలిపింది. మరోవైపు టవర్ల బిజినెస్‌ను కొనుగోలు చేసే యోచనలో అమెరికన్ టవర్ కంపెనీ(ఏటీసీ) అధికారులు ప్రస్తుతం ఐడియాతో చర్చలు జరుపుతోందిట. అటు వొడాఫోన్తో విలీనానికింటే ముందుగానే టవర్ల డీల్‌ను కుదుర్చుకోవాలని ఐడియా యాజమాన్యం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో బుధవారం ఇంట్రాడేలో ఐడియా షేరు 10 శాతం లాభపడింది.