సాక్షి, ముంబై : స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐటెల్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 10 (గో ఎడిషన్) ఆధారిత ఇటెల్ విజన్ 1 ప్రో భారతదేశంలో తీసుకొచ్చింది. గత ఏడాది ఆగస్టులో దేశంలో లాంచ్ చేసిన ఇటెల్ విజన్ 1 కు కొనసాగింపుగా ప్రో వెర్షన్‌ను ఆవిష్కరించింది. 8మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్ తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను తోపాటు,ఫెన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా జోడించామని, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఫోన్‌ను 0.2 సెకన్లలో అన్‌లాక్ అవుతుందని ఇటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐటెల్ విజన్ 1 ప్రో ధర 6,599 రూపాయలు. అరోరా బ్లూ, ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఇది లభ్యం. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుందని అధికారిక వెబ్‌సైట్ తెలిపింది.
ఐటెల్ విజన్ 1 ప్రో ఫీచర్లు
6.52 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 10 (గో ఎడిషన్) క్వాడ్‌కోర్ సాక్
720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్
2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
8 మెగాపిక్సెల్ + రెండువీజీఏ సెన్సర్లు
ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment