
సాక్షి,ముంబై: రెడ్‌మీ అందుబాటులో ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. క్లీన్ ఆండ్రాయిడ్ 12,హీలియో ఏ22 చిప్, వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో రెడ్‌మి ఏ1 పేరుతో దీన్ని లాంచ్ చేసింది.ఈ ఎంట్రీ-లెవల్ ఫోన్ ధర రూ. 6,499గా ఉంచింది. సెప్టెంబర్ 9 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
భారతదేశంలో రెడ్‌మి ఏ1 ధర, విక్రయ తేదీ
2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,499. సెప్టెంబర్ 9నుంచి షావోమివెబ్‌సైట్, మై హోమ్, అమెజాన్ రిటైల్ అవుట్‌లెట్లలో లభ్యం. లేత ఆకుపచ్చ, లేత నీలం, నలుపు మూడు రంగుల్లో లాంచ్ అయింది.
రెడ్‌మి ఏ1 స్పెక్స్, ఫీచర్లు
6.52 అంగుళాల 720p డిస్‌ప్లే
8 ఎంపీ రియర్‌కెమెరా
5 ఎంపీ సెల్పీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
10W మైక్రో-యూఎస్‌బీ ఛార్జింగ్ సపోర్ట్
Comments
Please login to add a commentAdd a comment