దేశ్ కా స్మార్ట్‌ఫోన్ : బడ్జెట్ ధరలో | DeshKaSmartphone Redmi 9A launched | Sakshi
Sakshi News home page

దేశ్ కా స్మార్ట్‌ఫోన్ : బడ్జెట్ ధరలో

Published Wed, Sep 2 2020 2:51 PM | Last Updated on Wed, Sep 2 2020 3:22 PM

DeshKaSmartphone Redmi 9A launched - Sakshi

సాక్షి, ముంబై: చైనా మొబైల్ తయారీదారు  షావోమి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. రెడ్‌మీ ఏ సిరీస్‌లో భాగంగా ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్‌లో రెడ్‌మీ 9ఏ ను తీసుకొచ్చింది. 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ తో ఈ  స్మార్ట్ ఫోన్ ప్రారంభించింది. ప్రారంభ ధర రూ.6,799 గా నిర్ణయించింది. (రెడ్‌మీ తొలి 5జీ స్మార్ట్ ఫోన్ వస్తోంది..)

2జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్, 3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్  వేరియంట్లలో రెడ్‌మీ 9ఏ  అందుబాటులో ఉంటుంది. అమెజాన్, ఎంఐ ఆన్ లైన్ స్టోర్లలో సెప్టెంబర్ 4న సేల్ ఆరంభం.  త్వరలోనే ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉండనుంది. మూడు రంగుల్లో వస్తున్న ఈ  స్మార్ట్ ఫోన్  ప్రారంభ ధర రూ.6,799,  3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్  7499  రూపాయలుగా ఉంచింది.

రెడ్‌మీ 9ఏ  ఫీచర్లు
6.53  అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్
13 ఎంపీ రియర్  కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్  బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement