సాక్షి,ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి రెడ్‌మీ 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోలాంచ్ చేయనుంది. రెడ్‌మీ కే30 5 జీ భారతదేశంలో త్వరలో దీన్ని తీసుకురానుంది. గత ఏడాదే బీఐఎస్ సర్టిఫికేషన్ అందుకున్నప్పటికీ, ఈ ఫోన్ లాంచింగ్ ఆలస్యమవుతోంది. అయితే తాజా నివేదికల ప్రకారం రానున్న కొద్ది రోజుల్లోనే రెడ్‌మీ తన తొలి 5జీ స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.
తాజా నివేదిక ప్రకారం, 6జీబీ, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ, 28 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో, ఫ్రాస్ట్ వైట్ మిస్ట్ పర్పుల్ రంగులలో అందించనుంది. పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో రెడ్‌మి కె 20 ప్రో మాదిరిగానే ఉండనుందని అంచనా.
రెడ్‌మీ కే30 5జీ స్పెసిఫికేషన్లు
6.67-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో
1080 x 2400 ఫుల్ హెచ్‌డి + రిజల్యూషన్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్
20+2 మెగాపిక్సెల్ డబుల్ సెల్ఫీ కెమెరా
64+ 8 +5 + 2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా
4500 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర : సుమారు 21,350 రూపాయల నుంచి ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment