Entry-level smartphone
-
రియల్మీ సి–55.. ఎంట్రీ లెవెల్ విభాగంలో సంచలనం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ బ్రాండ్ రియల్మీ భారత మార్కెట్లో సి–55 మోడల్‌ను విడుదల చేసింది. 16 జీబీ డైనమిక్ ర్యామ్‌తో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 33 వాట్స్ సూపర్‌వూక్ చార్జింగ్, 90 హెట్జ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ 6.72 అంగుళాల డిస్ప్లే ఏర్పాటు ఉంది. (మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!) సెగ్మెంట్లో అత్యధికంగా 64 ఎంపీ కెమెరా పొందుపరిచారు. చార్జింగ్ ఎంత మేరకు ఉంది, డేటా వినియోగం, నడిచిన దూరం తెలిపే నోటిఫికేషన్స్ స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. ధర రూ.9,999 నుంచి ప్రారంభం. ఎంట్రీ లెవెల్ విభాగంలో ఈ మోడల్ సంచలనం సృష్టిస్తుందని రియల్మీ గ్లోబల్ ప్రొడక్ట్ మేనేజర్ శ్రీహరి మీడియాకు తెలిపారు. (మారుతీ సుజుకీ రికార్డ్.. విదేశాలకు 25 లక్షల కార్లు..) -
టెక్నో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్; ధర వింటే..!
సాక్షి,ముంబై: టెక్నో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తన స్పార్క్ సిరీస్‌ను రిఫ్రెష్ చేస్తూ టెక్నో స్పార్క్ గో 2023ని Tecno ఆవిష్కరించింది. త్వరలోనే ఇండియాలోకూడా ఇది లాంచ్ కానుంది. ఎంట్రీ-లెవల్ ఫోన్ పోకో సీ50, రెడ్మిఏ1 లాంటి వాటికి గట్టి పోటీ ఇస్తుందని అంచనా. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను ఫోన్ ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఉన్న మోడల్ కాస్త అప్గ్రేడ్చేసి దీన్ని తీసుకొచ్చింది. స్పార్క్ గో 2023 మూడు స్టోరేజ్ ఆప్షన్లతో లాంచ్ అయింది. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.6,999గా నిర్ణయించింది. అలాగే 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 4జీబీ, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఎండ్లెస్ బ్లాక్, ఉయుని బ్లూనెబ్యులా పర్పుల్‌లో లభ్యం. టెక్నో స్పార్క్ గో 2023 ఫీచర్లు 6.56-అంగుళాల IPS LCD MediaTek Helio A22 SoC Android 12 HiOS 12.0 రియర్ డ్యూయల్ కెమెరా f/1.85 ఎపర్చర్‌తో 13ఎంపీ ప్రైమరీ కెమెరా QVGA సెన్సార్ , LED ఫ్లాష్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
బిగ్ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, ధర మాత్రం ఏడువేల లోపే!
సాక్షి,ముంబై: రెడ్మీ అందుబాటులో ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. క్లీన్ ఆండ్రాయిడ్ 12,హీలియో ఏ22 చిప్, వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో రెడ్మి ఏ1 పేరుతో దీన్ని లాంచ్ చేసింది.ఈ ఎంట్రీ-లెవల్ ఫోన్ ధర రూ. 6,499గా ఉంచింది. సెప్టెంబర్ 9 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో రెడ్మి ఏ1 ధర, విక్రయ తేదీ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,499. సెప్టెంబర్ 9నుంచి షావోమివెబ్సైట్, మై హోమ్, అమెజాన్ రిటైల్ అవుట్లెట్లలో లభ్యం. లేత ఆకుపచ్చ, లేత నీలం, నలుపు మూడు రంగుల్లో లాంచ్ అయింది. రెడ్మి ఏ1 స్పెక్స్, ఫీచర్లు 6.52 అంగుళాల 720p డిస్ప్లే 8 ఎంపీ రియర్‌కెమెరా 5 ఎంపీ సెల్పీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 10W మైక్రో-యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ -
అతి తక్కువ ధరలో రియల్మీ కొత్త ఫోన్ వచ్చేస్తోంది!
సాక్షి, ముంబై: చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం రియల్మీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఈరోజు భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. సీ-సిరీస్‌లో రియల్మీ సీ30 పేరుతో ఎంట్రీ లెవల్ ఫోన్‌ను ఈ రోజు (జూన్ 20) మధ్యాహ్నం తీసుకొస్తోంది. రియల్మీ వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ సార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మరికొద్ది గంటల్లో లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. రియల్మీ సీ 30 ఫీచర్లు 6.6-అంగుళాల ఫుల్ హెచ్ + డిస్ప్లే వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్ప్లే ఆక్టా-కోర్ Unisoc T612 SoC 13 ఎంపీ ప్రైమరీ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000ఎంఏహెచ్ బ్యాటరీని 2 జీబీ రామ్, 32 జీబీ స్టోరేజ్, 3జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో బ్యాంబూ గ్రీన్, డెనిమ్ బ్లాక్, లేక్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఖచ్చితమైన ధర ఇంకా వెల్లడి కాలేదు. అయితే ప్రారంభ ధర రూ. 7వేలుగా ఉంటుందని అంచనా. -
ట్రిపుల్ రియర్ కెమెరా ఫోన్ : రూ. 6599
సాక్షి, ముంబై : స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐటెల్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 10 (గో ఎడిషన్) ఆధారిత ఇటెల్ విజన్ 1 ప్రో భారతదేశంలో తీసుకొచ్చింది. గత ఏడాది ఆగస్టులో దేశంలో లాంచ్ చేసిన ఇటెల్ విజన్ 1 కు కొనసాగింపుగా ప్రో వెర్షన్‌ను ఆవిష్కరించింది. 8మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్ తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను తోపాటు,ఫెన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా జోడించామని, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఫోన్‌ను 0.2 సెకన్లలో అన్‌లాక్ అవుతుందని ఇటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐటెల్ విజన్ 1 ప్రో ధర 6,599 రూపాయలు. అరోరా బ్లూ, ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఇది లభ్యం. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుందని అధికారిక వెబ్సైట్ తెలిపింది. ఐటెల్ విజన్ 1 ప్రో ఫీచర్లు 6.52 అంగుళాల హెచ్డీ ప్లస్డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 (గో ఎడిషన్) క్వాడ్‌కోర్ సాక్ 720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 8 మెగాపిక్సెల్ + రెండువీజీఏ సెన్సర్లు ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆ ఫోన్ మొదట వచ్చేది భారత్ కే!
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్.. ఎంట్రీ లెవల్ లో జెడ్ 4 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఎవరైతే ఫీచర్ ఫోన్ నుంచి సోషల్ మీడియా, ఇంటర్నెట్, డేటా కనెక్షన్ ఎక్స్ పీరియన్స్ కోసం వేచిచూస్తున్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్ ను శాంసంగ్ తీసుకొస్తోంది. ఎంపిక చేసిన మార్కెట్లలో తొలుత ఈ ఫోన్ ను లాంచ్ చేయాలని భావిస్తున్న శాంసంగ్, మొదటగా భారత్ వినియోగదారులకే అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిసింది. బ్లాక్, సిల్వర్, గోల్డ్ రంగుల్లో ఇది వినియోగదారులను అలరించనుంది. అయితే కమర్షియల్ గా ఎప్పుడు భారత్ లో విడుదల చేస్తారు, ఎంత ధరకు భారత్ లో ఈ ఫోన్ విక్రయానికి వస్తోందో కంపెనీ ఇంకా పబ్లిక్ గా ప్రకటించలేదు. శాంసంగ్ తీసుకురాబోతున్న ఈ ఎంట్రీ లెవల్ జెడ్4 స్మార్ట్ ఫోన్ ఫీచర్లెలా ఉండబోతున్నాయో ఓసారి చూద్దాం... 4 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్ ప్లే 1జీబీ ర్యామ్ 8జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ ప్రొవిజన్ మైక్రో ఎస్డీకార్డు ద్వారా 128జీబీ వరకు విస్తరణ 400x800 పిక్సెల్స్ రెజుల్యూషన్ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ 143 గ్రాముల బరువు క్వాడ్ కోర్ ప్రాసెసర్ శాంసంగ్ టిజెన్ ఓఎస్ వెర్షన్ 3.0 4జీ ఎల్టీఈ 2050ఎంఏహెచ్ బ్యాటరీ 5ఎంపీ రియర్, ఫ్రంట్ కెమరా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ -
ఇంటెక్స్ నుంచి ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్
ధర రూ.2,400 న్యూఢిల్లీ: దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘ఇంటెక్స్ టెక్నాలజీస్’ తాజాగా కొత్త ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ ‘ఆక్వా ఎకో 3జీ’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.2,400గా ఉంది. ఇందులో 4 అంగుళాల స్క్రీన్, 3జీ, 256 ఎంబీ ర్యామ్, డ్యూయెల్ సిమ్, 0.3 ఎంపీ రియర్/ఫ్రంట్ కెమెరాలు వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్స్ నలుపు, తెలుపు, నీలం రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.