
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ బ్రాండ్ రియల్‌మీ భారత మార్కెట్లో సి–55 మోడల్‌ను విడుదల చేసింది. 16 జీబీ డైనమిక్ ర్యామ్‌తో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 33 వాట్స్ సూపర్‌వూక్ చార్జింగ్, 90 హెట్జ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ 6.72 అంగుళాల డిస్‌ప్లే ఏర్పాటు ఉంది.
(మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!)
సెగ్మెంట్లో అత్యధికంగా 64 ఎంపీ కెమెరా పొందుపరిచారు. చార్జింగ్ ఎంత మేరకు ఉంది, డేటా వినియోగం, నడిచిన దూరం తెలిపే నోటిఫికేషన్స్ స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. ధర రూ.9,999 నుంచి ప్రారంభం. ఎంట్రీ లెవెల్ విభాగంలో ఈ మోడల్ సంచలనం సృష్టిస్తుందని రియల్‌మీ గ్లోబల్ ప్రొడక్ట్ మేనేజర్ శ్రీహరి మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment