Realme GT3: మార్కెట్‌లోకి ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫోన్‌.. ధర మాత్రం... | Realme Gt3 Fast Charging Phone Launched | Sakshi
Sakshi News home page

Realme GT3: మార్కెట్‌లోకి ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫోన్‌.. ధర మాత్రం...

Published Wed, Mar 1 2023 9:39 PM | Last Updated on Wed, Mar 1 2023 9:41 PM

Realme Gt3 Fast Charging Phone Launched - Sakshi

రియల్‌మీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫోన్‌ గ్లోబల్ మార్కెట్‌లో విడుదలైంది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో రియల్‌మీ జీటీ3 (Realme GT3) స్మార్ట్‌ఫోన్‌ను ఆ కంపెనీ విడుదల చేసింది. ఆ కంపెనీ చెప్పిన దాని ప్రకారం..  ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తిగా ఛార్జ్ కావడానికి కేవలం 9.5 నిమిషాలు పడుతుంది. దీని ప్రారంభ ధర 649 యూఎస్‌ డాలర్లు (రూ. 53,543).

Realme GT3 ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు

  • 2,772 x 1,240 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 6.74 అంగుళాల AMOLED డిస్‌ప్లే.
  • క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8+ Gen 1 ప్రాసెసర్‌.
  • 4,600 ఎంఏహెచ్‌ బ్యాటరీ 240 వాట్ల వేగవంతమైన ఛార్జింగ్‌.
  • ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌, అంతర్గత Realme UI, డాల్బీ అట్మోస్‌.
  • 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ (50ఎంపీ ప్రైమరీ లెన్స్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మైక్రోస్కోప్ లెన్స్).

(ఇదీ చదవండి: సిమ్‌కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్‌’ టెక్నాలజీ!) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement