Fastest charger
-
Realme GT3: మార్కెట్లోకి ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్.. ధర మాత్రం...
రియల్మీ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో విడుదలైంది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో రియల్మీ జీటీ3 (Realme GT3) స్మార్ట్‌ఫోన్‌ను ఆ కంపెనీ విడుదల చేసింది. ఆ కంపెనీ చెప్పిన దాని ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తిగా ఛార్జ్ కావడానికి కేవలం 9.5 నిమిషాలు పడుతుంది. దీని ప్రారంభ ధర 649 యూఎస్ డాలర్లు (రూ. 53,543). realme GT3 Global Launch Event | Speed to the Max https://t.co/0cGd4NBHku — realme (@realmeglobal) February 28, 2023 Realme GT3 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 2,772 x 1,240 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.74 అంగుళాల AMOLED డిస్ప్లే. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్. 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ 240 వాట్ల వేగవంతమైన ఛార్జింగ్. ఆండ్రాయిడ్ 13 ఓఎస్, అంతర్గత Realme UI, డాల్బీ అట్మోస్. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ (50ఎంపీ ప్రైమరీ లెన్స్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మైక్రోస్కోప్ లెన్స్). (ఇదీ చదవండి: సిమ్‌కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్’ టెక్నాలజీ!) -
ఇండియన్ ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్...! షావోమీ నుంచి..ధర ఏంతంటే..?
Xiaomi 11i Hypercharge Launch Date In India: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ భారత్‌లో ఫాస్టెస్ట్ హైపర్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో షావోమీ 11ఐ హైపర్ ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాది జనవరి 6 లాంచ్ చేయనుంది. ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో లాంచ్ఐనా రెడ్మీ నోట్ 11 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్‌గా Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌గా రానున్నుట్లు తెలుస్తోంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తోందని కంపెనీ ప్రకటించింది. అంతేకాకండా భారత ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తోందని కంపెనీ వెల్లడించింది. Xiaomi 11i హైపర్‌ఛార్జ్ 5G కనెక్టివిటీతో రానుంది. 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్..! Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కేవలం 15 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతోందని కంపెనీ వెల్లడించింది. Xiaomi 11i హైపర్‌ఛార్జ్ ఒకే 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లో వస్తుందని తెలుస్తోంది . కామో గ్రీన్, స్టెల్త్ బ్లాక్ కలర్స్ వేరియంట్స్‌లో రానుంది. ధర ఎంతంటే..! చైనా మార్కెట్లో Redmi 11 ప్రో + స్మార్ట్‌ఫోన్ భారత్‌లో రీబ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌గా రానుంది. అయితే చైనాలో 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. దీని ధర సుమారు సుమారు రూ. 22,500 గా ఉంది. 8GB + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర భారత్‌లో దాదాపు రూ. 24,900 గా ఉండనున్నట్లు తెలుస్తోంది. Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్పెసిఫికేషన్లు (అంచనా) 6.67-అంగుళాల AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ 8GB ర్యామ్+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 920 SoC 108-ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా డ్యూయల్ జేబీఎల్-ట్యూన్డ్ స్టీరియో స్పీకర్స్, 4,500mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5G కనెక్టివిటీ చదవండి: 2022లో భారత మార్కెట్లపై స్మార్ట్‌ఫోన్ కంపెనీల దండయాత్ర..! వచ్చే ఏడాదిలో రానున్న పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. -
15 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్..
బార్సిలోనా: చైనా ఫోన్ల తయారీ దిగ్గజం ఒప్పో కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది. ఈ టెక్నాలజీ సాయంతో కేవలం 15 నిమిషాల్లో ముబైల్ ఛార్జింగ్ (0 నుంచి) 100శాతం అవుతుందట. ముబైల్ వరల్డ్ కాంగ్రెస్ మంగళవారం ఈ ఛార్జర్ ను ఆవిష్కరించింది. 'సూపర్ వూక్' (superVOOC) ఛార్జన్ 2,500 మి.అంపియర్ అవర్ ఉన్న ఛార్జింగ్ లేని బ్యాటరీని ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. మైక్రో యూఎస్బీ, యూఎస్బీ టైప్-సీ కేబుల్స్ ఇందులో వాడినట్లు సంస్థ తెలిపింది. తక్కువ వోల్టేట్ అల్ గారిథమ్స్ వాడకంతో ఫోన్లు వేడేక్కడం లాంటి సమస్యలకు గురికావట. 5 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 10 గంటలపాటు మాట్లాడే అంత సామర్థం బ్యాటరీకి లభిస్తుందని కంపెనీ అధికారి వెల్లడించారు. క్వాల్కమ్ వారి 'క్విక్ ఛార్జ్ 3.0' ఛార్జర్ ఇప్పటివరకు ఫాస్టెస్ట్ ఛార్జింగ్ డివైస్ గా ఉండేది. ఆ ఛార్జింగ్ టెక్నాలజీతో 35 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ 80 శాతం ఛార్జింగ్ అయ్యేది. భారత్ లో ఈ ఏప్రిల్ లో విడుదలకానున్న ఎఫ్1 ప్లస్ స్మార్ట్ ఫోన్స్ లో కొత్త టెక్నాలజీ బ్యాటరీ మార్కెట్లోకి రానుంది. ఎఫ్1 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఫోన్ పూర్తి వివరాలు: ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ 13 మెగా పిక్సల్ కెమెరా 4G టెక్నాలజీ, 4 GB ర్యామ్ 32 GB ఇంటర్నల మెమరీ 5.5 అంగుళాల స్ర్ర్కీన్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 616 ప్రాసెసర్ బ్లూ టూత్ 4.1, జీపీఎస్, డ్యూయల్ సిమ్ ధర: 26, 990 రూపాయలు.